పంచాంగ గణనం ప్రకారం సౌరమానం సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో నెలరోజులపాటు సంచరిస్తూ పన్నెండు మాసాలలో పన్నెండు రాశులనూ చుట్టివస్తాడు. ఇది మొత్తం ఒక సంవత్సర కాలం. సౌరమానం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది ఆ సంక్రాంతి అవుతుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అవుతుంది.
చైత్రం మొదలు ఫాల్గుణం వరకు చాంద్రమాన మాసాలు పన్నెండు. ఈ పన్నెండు మాసాల్లోనూ సూర్యసంక్రాంతులు ఏర్పడతాయి. సౌరమానం, చాంద్రమానాల్లో ఉన్న తేడా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెలకంటే ఎక్కువకాలం ఉండిపోతాడు. దానినే చాంద్రమానరీత్యా అధికమాసం అంటాం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి ఉండదు.
భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేకాలం 365.2622 రోజులు. కానీ చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు. సౌరమానంలో అయితే 30 రోజులుంటాయి. చాంద్రమానంలో అమావాస్యకు అమావాస్యకు మధ్యనున్నకాలం 29.53 రోజులు..
సౌర, చాంద్ర మాసాల మధ్య గల ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకే భారతీయ కాల గణనలో ప్రతి రెండున్నర ఏళ్ల తర్వాత ఒక అధిక మాసం వస్తుంది. రెండు అమావాస్యల మధ్య ఎప్పుడయితే సంక్రమణం ఉండదో అదే అధిక మాసం అవుతుంది. ఇది సుమారు 32 మాసాల పదహారు రోజులకు ఒకసారి వస్తుంది. ప్రతి ఐదు సంవత్సరాలలో రెండు అధిక మాసాలు వస్తాయి. ఒక్కోసారి రెండు రోజులపాటు ఒకేతిథి ఉంటుంది. ఒక్కోసారి ఒకే రోజు రెండు తిథులుంటాయి.
*🏵️ క్షయతిథులు - తిథిద్వయం 🏵️*
* చాందేభ్యో*
*ద్యుభ్యః ప్రోష్య తిథిక్షయాః*
*ఉదయాదుదయం*
*భానోర్భూమి సావన వాసరః*
రెండు సూర్యోదయాల మధ్య ఉండే కాలాన్ని సావన దినం అని వ్యవహరిస్తాం. దీనికే భూదినమని కూడాపేరు. మానవులకు సంబంధించినంత వరకు ఒకరోజంటే రెండు సూర్యోదయాల మధ్యన ఉన్నదే. అయితే చాంద్రదినం దేవతలకు సంబంధించినది. మనం నిర్వహించుకునే పూజలు, వ్రతాలు, పండగలు అన్నీ చాంద్ర తిథులను ఆధారం చేసుకుని నిర్ణయించుకుంటాం. ఈ చంద్ర తిధులు పూర్తిగా అంతరిక్ష సంబంధమైనవి.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ భూ గమనం వల్ల భూలోక వాసులకు పగలు, రాత్రి ఏర్పడతాయి. సూర్యకాంతి నేలపై పడుతున్నప్పుడు పగలుగానూ, లేనప్పుడు. రాత్రిగానూ వ్యవహరిస్తాం. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి.. చుట్టూ తిరుగుతాడు. ఆ చంద్రగమనంలో భూమినీడ చంద్రునిపై పడుతుంది. అలా చంద్రునిపై పడే నీడనే చాంద్రమానం తిథులుగా లెక్కిస్తాం.
చంద్రునిపై భూమి నీడ ఒక్కోసారి ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా పడుతుంటుంది. ఈ కారణం వల్లనే తిథులలో వ్యత్యాసాలు వస్తాయి.. తిథి వృద్ధి చెందటం... తిథి క్షయమవటం మనం పంచాంగాలలో గమనిస్తాం. ఇది విపులంగా తెలియాలి అంటే చాంద్ర దినాల నుండి భూదినాలు తీసివేయాలి. మిగిలినవి. క్షయ తిథులు అవుతాయి. ఒక మహాయుగంలో 2,508,252 తిథులు ఉంటాయి.
*🌳 అధిక మాసం 🌳*
అధికమాసం ఏర్పడేందుకు జ్యోతిశ్శాస్త్రం పేర్కొన్న నియమాలను పరిశీలిస్తే మరింత వివరంగా బోధపడుతుంది. సూర్యుడు అప్పుడే రాశి ప్రవేశం చేసి ఉండాలి. చంద్రుడు అమావాస్యను వీడి పాడ్యమి తిథిలో ఉండాలి. ఈ రెండూ వెనువెంటనే ఒకదానివెంట మరొకటి జరిగిపోవాలి. అప్పుడే అధికమాసం . సిద్ధిస్తుంది. సూర్యునికంటే వేగం గలవాడు . చంద్రుడు. అతడు 29.5 రోజుల్లోనే నెలను పూర్తి చేస్తాడు. సూర్యునికి పూర్తిగా 30 రోజులూ పడుతుంది. వీటిమధ్య తేడా ఉన్న సగం రోజులోనే రవిసంక్రమణం, చంద్రుని శుక్ల పాడ్యమి ప్రవేశం జరిగిపోవాలన్నమాట. లేదంటే సూర్యుడు అమావాస్య లోపుగా మరో సంక్రమణం చేసే అవకాశం ఉంది. ఒక రాశిలో సూర్యుడు 30 రోజులుంటాడు. ఈలోపు గానే రెండు అమావాస్యలు ఏర్పడితేనే అధికమాసమవుతుంది.
అధికమాసం వచ్చినప్పుడు 30 రోజుల అధికమాసం కేవలం చంద్రగమనంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక మాసం ఎప్పుడూ.. చైత్రమాసం నుండి ఆశ్వయుజమాసం మధ్యలోనే రావడం ఒక విశేషం.
*🌺 అధిక మాసంలో చేయదగినవి : 🌺*
అన్నప్రాశనం, సీమంతం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దైవ దర్శనాలు, మంత్ర జపాలు పరాణ పఠనం, నిత్య పూజాదికాలు యధావిధిగా చేసుకోవచ్చు. పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. దానధర్మాలు, అన్నదానం శాస్త్ర ప్రకారం మరణించిన పితరులను తలచుకొని కనీస విధులు చేయాలి.
*🌺 అధిక మాసంలో చేయకూడనివి: 🌺*
ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనం, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట మొదలైన శుభకార్యాలు చేయకూడదు.
*🚩 డైలీ విష్ 🚩*