వెళ్లాలి చూడాలి తాకాలి.. బంగారు బల్లి కథ ‘కంచి’కే....!!

P Madhav Kumar

 


🌸 ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.


🌸 కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూడండి. 

తమిళనాడులోని కాంచీపురంలో అడుగుపెట్టగానే.. మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72 కిమీలో మీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. 


🌸ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ‘కంచి’కి రావల్సిందేనని మన పూర్వికులు చెబుతుండేవారు. అందుకే కాబోలు కథలను ముగించేప్పుడు.. కథ ‘కంచి’కి అనేవారు. హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. 


🌸ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. 

‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం.


🌸 అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు. ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 


🌸20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 

కంచి వెళ్లినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు, కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి.


🌸వేదంతంగల్ పక్షుల అభయారణ్యం, ఎలగిరి హిల్స్, శ్రీపెరుంబదర్, కంచి పీఠం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి. 


🌹‘బంగారు బల్లి’.. కథ! 🌹


🌺 కంచి కథ ముగించేప్పుడు.. ‘బంగారు బల్లి’ గురించి తెలుసుకోకపోతే కథ కంచికి వెళ్లదు. శరీరం మీద బల్లి పడగానే.. కంచి నుంచి వచ్చినవారిని తాకితే దోషం పోతుందని అంటారు.


🌸 లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లిని తాకాలని అంటారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. 

గౌతమ అనే మహర్షికి ఇద్దరు శిష్యుటు ఉండేవారు. ఒక రోజు వారిద్దరు నది నుంచి కుండతో నీరు తీసుకొస్తారు. అయితే, ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించరు. 


🌸మహర్షి ఆ బల్లిని చూసి.. ఇద్దరిని బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. శపవిముక్తి కోసం ప్రార్థించగా.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతాడు. దీంతో పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్లకు వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వారిద్దరూ సూర్య, చంద్రుల ప్రతిరూపాలుగా బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా భక్తులకు దోషనివారణ చేయాలని ఆదేశిస్తాడు.


🌸 సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat