మంత్రాలని సంస్కృతంలోనే చదవాలి | Mantras should be recited in Sanskrit

P Madhav Kumar

మంత్రం యొక్క శక్తి 

అనుదాత్త ఉదాత్త స్వరితాలతో కూడిన మంత్రములు వేదము వచ్చినవే. వేదములు అపౌరుషేయములు. ఆ పరమేశ్వురుని కృపచే ఋషులకు గోచరమైన మంత్రాలకు ఉన్న శక్తి మనం తెలుగులోకి అనువదించుకుని చదవడం వలన రాదు. భావం ఒకటే అయినప్పటికీ సంస్కృతంలో వాడిన పదాల అమరిక, ఉచ్ఛరించే విధానం ఆ మంత్రాలకి విశేష శక్తిని ఇస్తాయి. అయినా పరమేశ్వరనిచే సృష్టి అయిన మంత్రములను ఎంత పెద్ద పండితుడు మాత్రం అనువదించగలడు? కనుక సంస్కృత మంత్రములకు ఉన్న శక్తి మనం తెలుగులో చెప్పుకునే భావానికి ఉండనే ఉండదు.

సంస్కృతంలో ఉండే మంత్రాలని అనువదించుకోవడంలో మరొక అనర్థమేమంటే తెలుగులోకి మార్చేటప్పుడు అనువాదకుని సొంత పైత్యం కొంత కలిస్తే ఇక అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఎందరో ఎన్నో సార్లు తమ బాణిలో రచించారు. తపశ్శక్తి సంపన్నుల రామాయణాల వలన అరిష్టం తక్కువగా ఉన్నప్పటికీ పాండిత్య ప్రకర్షకోసం రచించిన వారి రామాయణాల వలన అనేక అనర్థాలు వచ్చాయి అన్నది మనకు తెలిసిందే.

మూలం

ఇక అనువాదాల వ్యాప్తి వస్తున్న కొద్దీ అసలైన మూలాన్ని కోల్పోతాము. అందరూ తమకి నచ్చినట్లు అనువదించుకొని మంత్రాలని చదివేస్తే సంస్కృతం ఎందుకు? వేదపారాయణలు ఎందుకు? భవిష్యత్తులో ఈ అనువాదాలు పెరిగి, అందులో కలిప్రభావంతో ఉన్న వాక్యాలు పెరిగి గందరగోళం శృష్టిస్తాయి. నిజమైన ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి మూలం తెలుసుకోవడం చాలా కష్టమౌతుంది. కనుక మంత్రాలు సంస్కృతంలోనే చదవాలి. స్వరయుక్తంగానే చదవాలి. ఈశ్వరప్రోక్తమైన వేదమంత్రాలు అర్థంకాకపోయినా విననంత మాత్రము చేతనే మనకు అనేక సంపదలను కలుగజేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

స్తోత్రాలు కూడా అంతే! 

ఎంతో తపోనిష్టులైన వారు రచించినవి కనుక వాటికీ మంత్రములకున్నంత శక్తి ఉన్నది. వాటినికూడా ఆభాషలోనే చదవాలి. అంతెందుకు ఒక కథ చదువుతాము. ఎంతో ప్ర్రేరణ కలిగిస్తుంది. అదే కథని మన మాటలలో మరొకరికి చెప్పామనుకోండి అంతటి ప్రేరణ వారికి కలుగుతుందా! నిస్సంశయంగా కలగదు. ఎందుకంటే ఆకథ రాయడానికి రచయిత పడినంత అంతర్మథనం మనం పడము కనుక. అతనికి ఉన్న పట్టు మనకు ఆ కథా విషయంపై ఉండదు కనుక. అలాగే మహర్షులు రచిచింన పురాణాలు, స్తోత్రాలు మనం అనువదిస్తే అంతటి శక్తి ప్రేరణ కలుగదు.
  ఇక మిగిలింది సంకల్పం, పరిచయం ( ప్రవర ) వంటివి మాతమే! వాటిని ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ సంస్కృతంలో చెప్పుకుని మనసులో అర్థాన్ని భావనచేయడమే శ్రేయస్కరం. సాధారణంగా బ్రహ్మగారు కూడా సమయాన్ని బట్టి వీలైనంత వివరణ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా మనకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat