🔰 *శ్రీ గణేశపురాణం*🔰 12వ భాగం

P Madhav Kumar


 *12.భాగం* 


*ఉపాసనాఖండము*

*మొదటి భాగము*

*గజానన దర్శనం*


సూతమహర్షి ఋషులతో ఇలా అన్నాడు ఓ రుషిశ్వరులారా! బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాస మునీంద్రుడు తన అంతరంగం ప్రశాంతం అవ్వగా ప్రసన్న చిత్తంతో చతుర్ముకుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు.


ఓ చతురాననా! నీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనసుకు ఎంతో స్వాంతన కలిగింది ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్టించారు వారు గజాననుడి నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు?


మీ అమృత వచనాలను వింటున్న కొద్ది గజాననుడి లీలల యందు రుచి పెరుగుతున్నదే గాని తరగడం లేదు ఈ గణేశుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్థున్ని చెయ్యి!


ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకడం దుర్లభం అప్పుడు భృగువిలా అన్నాడు ఓ సోమకాంత మహారాజా వినమ్రుడై వ్యాస మునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు.


ఓ వ్యాసమునీంద్ర నీ యొక్క శ్రద్ధాశక్తులకు నాకెంతో సంతోషమైంది అనంతమైన పుణ్య విశేషం వల్లనే నీకు ఈ ఆసక్తి కలిగింది నీ యొక్క వినయము సౌశీల్యత నన్నెంతగానో అలరించాయి యోగ్యుడు వినయ గుణ సంపన్నుడు అయినా శిష్యుడు కోరితే గురువైనవాడు తీర్చని సందేహమే ఉండదు!


నాయనా ఈ గజాననుడు సకల కార్యరంభముల యందు ఆవశ్యం పూజించ తగినవాడు అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి అలా గజాననుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగునా కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి!


ఎందుకంటే సమస్త వేదమంత్రాలకు ప్రణవమే ఆది ప్రణవ రహితమైన మంత్రం నిరర్థకం ఇక విజ్ఞహరుడైన గణపతి సాక్షాత్తు ప్రణవ స్వరూపుడే పరతత్వ స్వరూపుడు పరబ్రహ్మరూపి అయినా గజాననుడే సకల సృష్టి అయి ఉన్నాడు.


వ్యక్త అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తు అంతా ఆయన రూపమే సమస్త దేవతలు సిద్ధ సాధ్య గంధర్వ రాక్షస యక్ష కిన్నెర కింపురుష గణాలు మానవులు వీరందరూ కూడా గణేశుని స్వరూపమే అయి ఉన్నారు.ఇక గణేశా ఉపాసనను దాని విశిష్టతను తెలియచేసే పురాతన గాధనోకదానిని చెబుతాను విను.


పూర్వం ఒకానొకప్పుడు ప్రళయం సంభవించింది భీకరంగా వీస్తున్న ఆ ప్రళయకాల జంజా మారుతాలకు పర్వతాలు సైతం ఎగుర కొట్టబడి మొక్కలు ముక్కలైపోయాయి అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యుల వలన ఆ జలం యావత్తు ఎండిపోయింది.


అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది ఆ సమయంలో సంవర్తకము మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి దీనివల్ల సృష్టి యావత్తు జలమయమైంది అప్పుడు సకల జగత్తు నశించిపోయింది.


అతి సూక్ష్మరూపం ధరించిన గజాననుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్ముడై అజ్ఞాతంగా ఉన్నాడు చిరకాలం లోకాలన్నీ అంధకార బంధురంలో మునిగిపోయాయి ఇలా చాలా కాలం గడిచాక ప్రణవ నాదము దాని నుండి పరబ్రహ్మ శబ్ద బ్రహ్మగా ఉద్భవమైనారు.


ఆనాదమే క్రమముగా మాయావికారం పొంది గజాననుడి రూపు సంతరించుకుంది ఆ మాయావికారం పొందిన గజాననుని నుండి సత్వ రాజ తమో గుణాలు వాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా ఉద్భవించారు.


ఆ తరువాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తు పుట్టింది అప్పుడు త్రిమూర్తులు మాయ యొక్క ప్రభావం వల్ల చిత్త బ్రాంతికలవారై తామెందుకు పుట్టింది తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలని తమ పుట్టుకకు కారణుడైన ఆ గజాననున్ని దర్శించాలని ఉత్సుకులైనారు.


అప్పుడు సృష్టింపబడ్డ 21 స్వర్గాలను అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన ఆ పరమాత్ముని జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయడం మొదలుపెట్టారు ఆహారం వర్ణించి అలా వేయి దివ్య వత్సరాల సుదీర్ఘకాలం తపస్సును ఆచరించారు.


అయినా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవకపోవడం వల్ల అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు నదులు పర్వతాలు గుహలలో వెతుకుతూ చివరికి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు నానా విధ రాలతోనూ పద్మములతోనూ జలపక్షులతోనూ నిండి ఉన్నదా దివ్య సరస్సు.


త్రిమూర్తులు ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొంత తడవు విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరారు ఇలా ఆ సరస్సును అందులోనే అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముద్దులై వెళుతున్న వారికి కళ్ళు విరమిడ్లు కొలిపే దివ్యకాంతి కనిపించింది. 


కోటి సూర్యుల కాంతితో సమానమై ప్రకాశమానమై ప్రళయాగ్నిలా వెలుగుతూ ఉన్న ఆ తేజస్సును కనులతో చూడలేక బ్రాంతి చెందిన మనసుతో ఇది ఏమి విపరీతము అని వ్యాకుల పడుతుండగా కరుణామయుడై సకల లోకాలకు వంధ్యుడైన  గజాననుడు ఆ తేజోమద్యంలో వారికి సాక్షాత్కరించాడు.


అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగి ఆ రూపం పాదాంనాయి. ఆ దివ్య మంగళ రూపం ఎలా ఉన్నదంటే గుష్టం యొక్క నఖం నుండి వెదజల్ల పడుతున్న కాంతితో ఎర్రని రోమాలు ఎర్రటి వస్త్రము ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రని ప్రకాశించే సూర్య మండలాన్ని తలదన్నేలా ఉంది.


తన నాలుగు దివ్యబాహువుల లోను ఒక దాంట్లో ఖడ్గము ఖేటమూ ధనస్సు శక్తి వీటిని ధరించి ఉన్నాడు చక్కటి నాసికతో పున్నమ చంద్రుని వెక్కిరిస్తున్నట్లుగా దివ్యమైన ముఖ కాంతి కలిగి పద్మముల వంటి నేత్రాలతో దగదగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కిరీటం దాల్చి నక్షత్రాలతో నిండిన ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరియ్యాన్ని ధరించి ఏకదంతాముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేలాంటి పెద్ద తొండంతో దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఆ గజాననుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులాయన పాదాలను నంటి నమస్కరించి స్తోత్రం చేయసాగారు.


ఇది శ్రీ గణేశ పురాణం

ఉపాసన ఖండములోని గజానన దర్శనం అనే  అధ్యాయము సమాప్తం.


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat