*14.భాగం*
*ఉపాసనాఖండము*
*మొదటి భాగము*
*బ్రహ్మచింతా వర్ణనం*
అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి ఆ తరువాత గణేశుని అనుజ్ఞ మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు!
ఓ రాజా! అలా గజాననుని గర్భంలోంచి బయటకు వచ్చిన చతుర్ముకుడు తనలో తాను గర్వితుడై సకల వేద శాస్త్ర పురాణములను ఆగమాలన్నింటిని ఎరిగిన వాడను జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిని శాపానుగ్రహ సమర్ధుడిని అవటం వల్లనే నా యొక్క సృష్టి రచన పద్ధతిలో గల ప్రావీణ్యత వల్లనే నాకీ సృష్టి బాధ్యత సిద్ధించింది..
ఇక సృష్టి విషయంలో నాకు వీలు కాని పని అంటూ లేదు అంటూ గర్విష్టియై సృష్టికి పూనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ఆయనకు అనేక విజ్ఞాలు తేనె తుట్టెను చుట్టుముట్టే తేనెటీగల్లా ముసురుకున్నాయి..
ఆ విజ్ఞదేవతల స్వరూపం ఎంతో వికృతంగాను భయాన్ని గొలిపేవిగాను ఉండటంతో, బ్రహ్మవారి ఘోరమైన రూపాలు వారు చేసే వికృత ధ్వనులు చూసి గడగడా వణికిపోయాడు. అప్పుడు కొందరు విజ్ఞదేవతలు బ్రహ్మను కొట్టారు మరికొందరు స్తుతించారు. ఇంకొందరు నమస్కరించారు. కొందరు నిందిస్తే మరికొందరు ప్రశంసించారు. కొందరు సేవిస్తే మరికొందరు బంధించారు..
వారిలోనే కొందరు అతడిని విడిపించారు అలా విడిపించిన వారిని కొందరటూ ఇటు ఈడ్చారు కొందరు అతని నాలుగు ముఖాలను చూసి పరిహసిస్తే మరికొందరు శిఖలను పట్టి అటు ఇటు ఊపారు కొందరు ఆలింగనం చేసుకొని మరికొందరు చిన్ని శిశువు వలె ముద్దాడి కొందరు అతని గడ్డాన్ని మీసాలను పట్టుకొని ఆటపట్టిస్తూ నృత్యం చేశారు...
ఇలాంటి వికృత చేష్టల పట్ల బ్రహ్మ మనః స్వాధీనం కోల్పోయి హృదయం అంతా చింతతోను శోకంతోను బరువెక్కిన వాడై తన మనోగర్వాన్ని వీడి జీవితం పట్ల నిరాశ కలిగి వివసుడై మూడ్చిల్లాడు అలా ఒక ముహూర్త కాలం గడిచాక తెలివి తెచ్చుకుని తన హృదయంలో దేవదేవుడైన ఆ విఘ్నేశ్వరుని స్మరిస్తూ దుఃఖితుడై గజాననుడిని ఇలా స్తుతించసాగాడు..
*బ్రహ్మ గజాననుడిని స్తుతి చేయడం.*
ఓ దేవ దేవా నాకా ఆయుః ప్రమాణం ఎంత ఉన్నది చేత పూనిన కార్యమా ఎంతో ఉత్క్రుష్టమైనది! నాకా నిష్కలంకమైన బ్రహ్మజ్ఞానం కలుగలేదు ఈ భూమండలం పైన జన్మ నెత్తి నీకు భక్తుడనై ముక్తిని ఎప్పుడూ ఎలా పొందగలను కదా ఓ దేవా అందుచేత నీయొక్క కరుణావృష్టి నాపై కురిపించి నన్ను బాధల నుంచి పీడల నుండి విముక్తుడిని గావించు...
కనుక నా జన్మ సార్ధకం అయ్యేలా నాకర్థవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చేలా అనుగ్రహించు అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశం నుండి శరీరవాణి తప! తప! 'తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి' అన్న సందేశం వినపడింది ఆ వాక్కు చెవిన పడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విజ్ఞదేవతలు ఆయనను విడిచి అంతర్దానమైనారు..
అప్పుడు బ్రహ్మ తన మనసులో తపస్సు చేయడానికి తగిన స్థానం మంత్రము ఉంటేనే కదా తపమాచరించగలిగేది అనుకొని తన తపస్సుకు అనువైన స్థానానికై అన్వేషిస్తూ వరప్రదుడైన గజాననుడిని హృదయ పద్మంలో ఏకాగ్రచితంతో ఇలా ధ్యానించసాగాడు..
*గజాననుని ధ్యానమూర్తి:*
ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నాడంటే ఎర్రటి చందనంతో అద్దబడిన దేహంతో ప్రకాశిస్తూ సింధూరారుణ వర్ణంలో శోధించే శిరస్సు పైన ముత్యాల చేత రత్నాల చేత అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి మెడలో ముత్యాల హారాన్ని నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు..
ఆ దివ్య మంగళ మూర్తి చేతి వ్రేళ్ళకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ఉంగరములను ధరించి చిత్రవిచిత్రమైన రత్నాలతో తాపించబడిన మొలత్రాటి నాభి ప్రదేశం వద్ద శేషునితో చుట్టబడి ఎర్రటి దివ్యమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు...
అతని ఏకదంతం చంద్రకళలాగా తెల్లగా ప్రకాశిస్తోంది అటువంటి పరమ సుందరమైన దివ్యమైన అనుగ్రహ రూపుడైన గజానన మూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా ఆకాశంలో నుండి అశరీరవాణి మరలా ఇలా పలికింది వటం పశ్య! వుంటాం పశ్య! అనగా ఆ మట్టి చెట్టును చూడమన్న ఆదేశం విన్న బ్రహ్మ వటావృక్షానికై అన్వేషించసాగాడు...
ఇది శ్రీ గణేశ పురాణం
ఉపాసనా ఖండంలోని
బ్రహ్మ చింతావర్ణం అనే అధ్యాయం సంపూర్ణం...
*సశేషం........*