అయ్యప్ప షట్ చక్రాలు (5)

P Madhav Kumar


అప్పుడే పిండరూపాన్ని సంతరించుకొన్న మానవ దేహాన్ని గమనిస్తే, అదో అతిచిన్న మాంసం ముద్దగా ఉంటుంది. ఆ అతిచిన్న మాంసంముద్దే క్రమేపీ ఇప్పటి ఈ రూపాన్ని తనంతట తానే సంతరించుకొంటుంది. ఈవిధంగా రూపుదిద్దుకొనేలా చేయడానికి అందుకో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్నే ప్రాణమయకోశమని అంటారు. అంటే శక్తిమయ శరీరం అన్నమాట. ఈ శక్తి శరీరమే మొట్టమొదటగా స్వయంగా ఆవిర్భావమవుతుంది. తరువాత దానిపైన ఈ భౌతిక శరీరం రూపుదిద్దుకొంటుంది. ఒకవేళ ప్రాణమయ కోశంలో ఏవైనా లోపాలు, హెచ్చుతగ్గులున్నట్టయితే ఆ ప్రభావం భౌతిక శరీరంపై కూడా కనిపిస్తుంది. అందుకే మన సంస్కృతిలో ఓ సంప్రదాయం ఉంది. ఎవరైనా ఓ అమ్మాయి గర్భవతి కాగానే ఆమె నిత్యం గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడంతో పాటు ప్రాణమయకోశాన్ని అంటే శక్తిమయ శరీరాన్ని ప్రభావితం చేయగిలిగిన శక్తిసంపన్నులైన (తపస్సంపన్నత) గల పెద్దలవద్దకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ఆచారంగా ఉంది. చక్కటి స్పందన గల శక్తిమయ శరీరం ఉన్నట్టయితే ఆమె ఎంతో సమర్థతగల మానవునికి జన్మను ఇవ్వగలుగుతుంది.


మూలాధారము ఈ శక్తిమయ శరీరానికి మూలం - పునాది వంటిది. ఇప్పటివారికి మూలాధారమంటే అది అన్నిటికన్నదిగువన గల చక్రమని, పట్టించుకోవలసినంత గొప్పదేమీ కాదనే భావన ఉంది. పునాది అనేది అసలు పట్టించుకోనక్కరలేని విషయమని భావించే వారెవరైనా భ్రమలో జీవిస్తున్నారనే చెప్పాలి. పునాది అనేది చాలా ప్రధానమైనది. అలాగే మూలాధారం అతిముఖ్యమైనది. మనం యోగాభ్యాసం చేసేటప్పుడు అన్నింటికీ మించి మూలాధారం మీదే మన దృష్టినంతటినీ కేంద్రీకరిస్తాము.


ఎందుకంటే, ఇక్కడ స్థిరత్వం సాధించామంటే మిగిలినదాన్నంతా సృష్టించడం చాలాసులభం. ఓ భవనం పునాది చాలా బలహీనంగా ఉంటే, దాన్ని పడకుండా చూడ్డానికి మనం దాన్ని మోయడం మొదలుపెడితే అది పెద్ద సర్కస్ అయిపోతుంది. ఇదే మానవ జీవితంలోనూ జరుగుతోంది. ఓ విధమైన ఆరోగ్యస్థాయిలో తమను ఉంచుకోవడానికి ప్రతిరోజూపడే తాపత్రయం, చాలామంది మానవుల నిత్యజీవనకృత్యమైపోయింది. అలాకాకుండా, మన మూలాధారం సుస్థిరంగా ఉన్నట్టయితే, జీవితమైనా.. మరణమైనా.. ఏమాత్రం చెక్కుచెదరకుండా మనం కూడా ఎటువంటి ఆందోళన లేకుండా స్థిరంగా ఉండగులుగుతాం. ఎందుకంటే మన పునాది, మన మూలస్థానం గట్టిగా ఉండబట్టే. మిగతా అంశాలన్నిటినీ ఆ తరువాత సుస్థిరం చేసుకోవచ్చు. అలాకాకుండా పునాది కనుక అస్థిరంగా ఉన్నట్టయితే, ఆందోళన అనేది అతిసహజం.


అనుభూతలకై వెతకటంలోని కష్టాలు

దైవకృపకు పాత్రులవ్వాలంటే, అందుకు తగిన శరీరం మనకు ఉండాలి. అలా కాకుండా మనకు తగిన శరీరం లేకుండా మనమీద అఖండంగా అనుగ్రహం వర్షించినట్టయితే, మనం తట్టుకోలేం. మన శరీరం విలవిల్లాడిపోతుంది. చాలామంది తమకు పెద్ద పెద్ద (ఆధ్యాత్మిక) అనుభవాలు కావాలనుకొంటారు కాని ఆ అనుభవాలు సాధించడానికి తగినరీతిలో తమ దేహాలను సిద్ధంచేయడానికి మాత్రం సుతరామూ అంగీకరించరు. కేవలం ఆధ్యాత్మిక అనుభవాలు కావాలంటూ వాటికోసం వెంపర్లాడుతూ సాధనలు సాగించడం వల్ల చాలామంది మతులు పోగొట్టుకొన్నారు, దేహాలను ఛిన్నాభిన్నం చేసుకొన్నారు. యోగక్రియలో మనం అనుభవాలకోసం వెంపర్లాడేది ఏదీ ఉండదు, కేవలం సంసిద్ధులమవుతాం, అంతే. 


యోగవ్యవస్థలన్నీ నిరంతరం మూలాధారం మీదే కేంద్రీకరించి ఉంటాయి. మన దైవం శ్రీ ధర్మ శాస్త వారికి సంబంధించి ఆరు చక్రాలను పోలుస్తూ ఆరు దేవాలయాలు స్వయంభూగా నిర్మితమయ్యాయి అందులో మూలాధార చక్రం తమిళనాడులోని సొరి ముత్తయ్య దేవాలయం కలదు ఆ దేవాలయ చరిత్ర మన ధారావాహికలో మున్ముందు తెలుసుకుందాం ఈ ఆరు చక్రాలు ఆరు దేవాలయాలకు సంబంధించి పూర్తి వివరాలు ముందు ముందు తెలియపరుస్తాను🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat