🔱 శబరిమల వనయాత్ర - 65 ⚜️ సన్నిధానం - పడిపూజ ⚜️

P Madhav Kumar

⚜️ సన్నిధానం - పడిపూజ ⚜️

నలుగురు మనుష్యుల ఎత్తున , నల్లరాతిగోడలు కట్టి లోపల సచ్చదురము గావించి వన్యమృగములు అలాంటి మనుష్యులు లోనికి ప్రవేశింపలేని రీతిగా తయారైన శ్రీ స్వామివారి కోవెల , పొన్నంబలం , మడప్పళ్ళి మండపం , గణపతి , సర్పరాజు , సుబ్రహ్మణ్య సన్నిధి మున్నగునవి ఇందులోనే సరిపోవును. పదునెనిమిది మెట్లు మిక్కిలి పవిత్రమైన స్థలము. ఇది సత్య ధర్మములకు ఆవాసము , కనుక వ్రతభంగముతో వచ్చు వారిని సోపానములు దాటి సన్నిధిలోకి ప్రవేశింప నివ్వదు. వీనిని

పరిరక్షించుటకు కుడి ప్రక్కన కరుప్పస్వామి , ఎడమ ప్రక్కన కడుత్త స్వామి వారు గలరు.

సన్నిధానమునకు దర్శనార్థం ఇరుముడితో మాత్రమే ఈ మెట్లను ఉపయోగించవలెను.


మిగిలిన వేళలలో ఉత్తర పశ్చిమ దిశలలో యుండు మెట్ల ద్వారానే సన్నిధానము లోనికి ప్రవేశించవలయును. కొందరు ఇరుముడి లేకను , వుండినను , మండలకాలవ్రత ఆచరణలేకను , నేటికాలములో ఆ మెట్ల యొక్క ప్రభావము తెలియక అధిరోహించుచున్నారు. ఇది ఎంతటి అపచారమన్నది నేడు ప్రత్యక్షం కాకపోయినను కాలక్రమేణ తత్పలితం వారికి గోచరించును. ఇట్టివారు ఈ మెట్లను తొక్కి అపవిత్రము చేయుటవలన ఆ మెట్ల యొక్క పవిత్రత చెదరక యుండుటకు సత్పురుషులకు సత్ఫలితమిచ్చుటకు ఆ మెట్లకు పూజారాధనలు సలిపి దాని ప్రభావమును , పవిత్రతను పునరుద్ధరించుటయే ఈ మెట్ల పూజలోని అంతరార్థం. దీనినే పడిపూజ అందురు. శబరిమల ప్రధాన తాంత్ర పూజారులు ఈ పూజను క్రమముగా నిర్వహిస్తారు. వంశావళిగా వారికి కలిగిన ఈ హక్కును మిక్కిలి భయభక్తితో నిర్వహిస్తారు వారు.

ఒక్కొక్క మెట్టుకు గల దేవతకు ఆవాహనాదులు షోడశోపచార పూజలు తాంత్రరీత్యా చేసి , విసర్జన చేసి , దాని శక్తిని పునరుద్దారణ గావిస్తారు. తన్మూలముగా క్రమబద్ధముగా యాత్ర చేసి ఆ సోపానముల నధిరోహించే యధార్ధభక్తులకు సదనుగ్రహము ప్రాప్తించక మానదు. గాని అటులకాని ఇతరుల విషయము కరుప్పస్వామి , కడుత్తస్వాములే చూసుకొంటారు.


ప్రస్తుత కాల శబరిమలై ప్రధాన తాంత్రులను *“ఈ పదునెట్టాంబడి దేవతలు ఎవరు ? మీరు ఎవరిని ఆవాహనము చేసి పూజించుచున్నారు ?"* అని అడుగగా అందులకు వారు *“ఇది దేవ రహస్యము. ఎవరికిని వెల్లడించరాదు. కాని భక్తులు ముక్కోటి దేవతలలో తమకిష్టమైన ఏ పదునెనిమిది దేవతలుగా భావించి. ఆ మెట్లను మ్రొక్కి ఎక్కిననూ ఆయా రూపములలో వారిని కటాక్షిస్తారు ఆ పదునెట్టాంబడి దేవతలు , ఇది సత్యము"* అని

పలికిరి. అవును నిజమంతే గదా ? మిగిలిన ఏ మతస్థులకు లేని స్వేచ్ఛారాధన మన హైందవ మతస్థులకు గలదు. నిర్దేశించిన ఏదో యొక దైవమునే సర్వులు మొక్కవలయునన్నది ఇతర మతస్థుల సిద్ధాంతము కాని చెట్టులోను , పుట్టలోను సకల చరాచరములలోను గల దైవాన్ని కొలిచినా ముక్తి అన్నది హైందవుల సిద్ధాంతము. అదియే మన మతమునకు గల విశేషత.


🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat