*శుక్ర మౌఢ్యమి*
🌞జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి, మరొకటి గురు మౌఢ్యమి. మౌఢ్యమినే వాడుక భాషలో మూఢం అంటారు. మౌఢ్యమి అంటే చీకటి అనే మరో అర్థం కూడా ఉంది. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూ గ్రహం, సూర్య గ్రహం ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు.
🌞దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్యుడికి అతి సమీపంగా ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యమి అనీ, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యమి అని అంటారు.
🌞ఆ సమయంలో అవి బలహీన దీనివల్లే దానిని మూఢం అనే పేరుతో పిలుస్తూ శుభ కార్యాలకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రుడికు శక్తి హీనత మాత్రమే దోషంగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తుంది. ఏ శుభ కార్యానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు.
🌞గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు.
🌞మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తున్నది.