కల్కి పురాణం - మూడవ అధ్యయనం -ఐదవ భాగం 🌺

P Madhav Kumar


విశాఖయూపభూపాలః శ్రుత్వా తేషా భాషితమ్

ప్రాదుర్భావం హరే ర్మేనే కలిని గ్రహకారకమ్.


మాహిమ్మత్యం నిజపురే యాగదానతపోవ్రతాన్

బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైక్యాన్ కూడ్రానపి హరేః ప్రియాన్


🌺అర్ధం:

శంభలగ్రామవాసుల మాటలు విని విశాఖయూప భూపాలుడు కలిని సంహరించుటకు అవతరించిన విష్ణుమూర్తి అవతారముగ కల్కి ని తెలుసుకోని మాహిష్మతీ నగరమున యాగదాన తపోవ్రతములనాచరించి బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్య, శూద్రులు నాలుగు వర్ణముల వారు వారికి ఇష్టులైరి.


స్వధర్మనిరతాన్ దృష్ట్వా ధర్మిష్లో భూత్ నృపః స్వయమ్

ప్రజాపాలః శుద్ధమనాః ప్రాదుర్భావాత్ శ్రియః పతే


అధర్మవంశ్యాస్తాన్ దృష్ట్వాజనాన్ ధర్మక్రియాపరాన్

లోభానృతాదయో జగ్ముస్తద్దేశా దుః ఖితాభయమ్.


🌺అర్ధం:

బ్రాహ్మణ క్షత్రియాదులు తమతమ ధర్మములయందాసక్తి కలిగియుండుటను చూచి రాజగు విశాఖయూపుడు ధర్మతత్పరుడాయెను. లక్ష్మీపతి ప్రాదుర్భావము వలన శుభ్రమనస్కుడై ప్రజలను పాలించెను. సహిష్ణుతీనగరమందు జనులందరు ధర్మతత్పరులగుట చూచి అధర్మవంశీయులగు లోభము అనృతము మున్నగునవి మిక్కిలి దుఃఖముతో భయముతో నగరమును విడిచిపోయినవి.


జైత్రం తురగమారుహ్య ఖడ్గల్చి విమల ప్రథమ్

దలశిరః సకరం చాపం గృహీత్వాగాత్ పురాద్బహిః


విశాఖయూప భూజలు ప్రాయార్ సాధుజన ప్రియః

విశాఖయూపో దదృశే చంద్రం తారాగణైరివ

పురాద్బహిః సురైర్యద్వ దింద్రముచ్చైః శ్రవః స్థితమ్.


🌺అర్ధం:

తేజస్సంపన్నులగు కవి ప్రాజ్ఞసుమంతులు ముందుండగ జ్ఞాతులగు భార్య విశాలురు కల్కిని చుట్టి యుండిరి. నక్షత్రసముదాయములో చుట్టుముట్టిన చంద్రునివలె, దేవతలతో కూడి ఉచ్చైః శ్రవ మధిరోహించిన ఇంద్రునివలె ఉన్న కల్కిని విశాఖయూపుడు చూసెను.


విశాఖయూపో_వనతః సంప్రహృష్ట తనూరుహః

కల్కే రాలోకనాత్ సద్యః పూర్ణాత్యా వైష్ణవో భవత్. 


సహరాజ్ఞా వసన్ కల్కి : ధర్మానాహ పురోదితాన్ 

బ్రాహ్మణక్షత్రియ విశా మాశ్రమాణాం సమాసతః.


🌺అర్ధం:

కల్కిని చూచి హర్షముతో పులకితుడయిన విశాఖయూపుడు అవనతుడాయెను. కల్కిదర్శనము వలన రాజు పరిపూర్ణమగు విష్ణుభక్తుడాయెను. రాజుతోకూడ నివసించు కల్కి అతనికి బ్రాహ్మణ క్షత్రియవైశ్యుల ఆశ్రమధర్మములను సంగ్రహముగ చెప్పెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat