*దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను* 🌺
*దేవతల పూజా విధానం :*
అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధునీ, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.
*ఓం ఇంద్రాయ నమః - ఇంద్రుని - తూర్పులో
*ఓం అగ్నయే నమః - అగ్ని - ఆగ్నేయంలో
*ఓం యమాయనమః - యముని - దక్షిణంలో
*ఓం నిరృతయే నమః - నిరృతిని - నైఋతిలో
*ఓం వరుణాయ నమః - వరుణుని - పశ్చిమంలో
*ఓం వాయవే నమః - వాయువుని - వాయవ్యంలో
*ఓం కుబేరాయ నమః - కుబేరుని - ఉత్తరంలో
*ఓం ఈశానాయ నమః - ఈశ్వరుని - ఈశాన్యంలో
స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.
🌺దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను , పుత్ర లాభమును కోరుకొనేవారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం (దేశికుడనికి ఉపదేశమిచ్చే ఆచార్యుడు వుండాలి).
🌺మీరు పైన సారంశం గమనించినట్లైతే ఇంటి వాసు శాస్త్రం మరియు దిక్పాలకులు ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందో వివరించబడింది.ఇంటి ప్రధాన ద్వారం నిర్మించుకోవడానికి పై సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.