శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 22 వ భాగము

P Madhav Kumar


నాస్తికుడు ఆస్తికుడైన విధము


శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి మరణించిన వారిని కూడ పునర్జీవితులుగ నొనరించి మృత్యుంజయులని కీర్తిని వహించిరి. ఎందరో భక్తులు ఆయన భగవదవతార మని విశ్వసించి  శ్రీవారిని పూజింపసాగిరి. ఈ కలి యుగములో ఇట్టి మాహాత్మ్యములు బూటక ములని విశ్వసించెడి నాస్తికులు  ఎందరో కలరు. ఒక గ్రామమందు ఒక లింగాయతుడు కలడు. శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి మరణించినవారికి పునర్జీ వనము నొసంగుట అసత్యమని, ఇటువంటి స్వాములు అమాయకు లగు ప్రజలచెంత ధనము ను దోచుకొనుటకు ఇట్టి ప్రచారము నొనరింప చేయుచుందురని విశ్వ సించి తన తోటివారి నందరిని సమావేశపరచి శ్రీరామవేంద్రతీర్థ స్వామిని అపహాస్యము పాలుచేయ వలెనని తీర్మానించెను.


ఆగ్రామమందే యున్న ఒకయువకుని మరణించి నట్లు నటింప వలసినదిగ పలికెను. ఆతడు సరేయని శవాకారముగ బడెను. తదనంతరము గ్రామవాసు లనందరిని చేర్చి శ్రీ రాఘ వేంద్రతీర్థస్వామి నాశ్రయిం చినచో నీతడు పునర్జీవితు డగునని పలికెను.


అందరు కలసి ఆ యువకుని శ్రీరాఘ వేంద్ర స్వామి చెంతకు గొని పోయిరి. వారందరూ  ఏడ్చుచు శ్రీవారికి నమస్క రించి 'స్వామి! ఈ యువకుడు అకాల మరణము నొందినాడు. ఎందరో  మృతులకు మీరు ప్రాణమును పోసినారని తెలిసికొని మిమ్ము ఆశ్రయంచితిమి. ఈ యువకుని పునర్జీవితునిగ నొనరింపుడని' వేడుకొను చు దొంగ యేడ్పుల నేడ్వ నారంభించిరి. ఈ విచిత్ర మును చూచుటకు ఆ గ్రామవాసులందరు  గుమి కూడిరి. దివ్యజ్ఞానసంప న్నుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి వచ్చినవారు తన్నపహాస్యము పాలు చేయుటకు అసత్యము లాడుచున్నారని దెలిసికొని 'నాయనలారా! నేను మున్ను బ్రతికించినవారు కొనప్రాణముతో నున్నారు; కావున వారి ప్రాణములను నిలుపగల్గితిని. కానీ ఈయువకుని ప్రాణము ఈ దేహమును వీడి వెడలి పోయెను, కావున వీనిని నేను బ్రతికింపజాలను, ఇక వెళ్ళిరం'డని పలికెను. అపుడు  ఆ లింగాయ తుడు పరిహసించుచు 'లెమ్మోయి యువకుడా! లెమ్ము!  ఈ దొంగసన్న్యాసి పస బయటపడెనని ఆ యువకుని పిలచెను. ఎంతతడవు పిలచినను ఆతడు కదలలేదు. ఔరా! ఇది ఏమి యనివారు ఆయువకుని పరీక్షింపగా అతడు మరణించి శరీరము కొయ్యబారి పోయెను.


సలక్షణముగ నున్న యువకుడు మరణించుట గాంచగనే లింగాయతుని యొక్క వారి స్నేహితుల యొక్క గుండెలు పగిలెను. వారిపుడు నిజముగ ఆక్రందనముల నొనరింప సాగిరి.  వారి మోసము ఊరిజనులకు తెలిసి పోయెను.


నాడు ప్రహ్లాదుడు పల్కిన సూక్తిని (ఇందుగల డందు లేడను సందేహము వలదు) సత్య మొనరిం చుటకు శ్రీనృసింహ స్వామి విశ్వమంతటిలో గల అణువణువందు నిండి యుండెను. ప్రహ్లాదుని యవతారమైన శ్రీరాఘ వేంద్రస్వామి పల్కినపల్కు లను సత్య మొనరించు టకు జీవించియున్న యువకుని మరణింప జేసెను. ఊరకేపోవునా! ఈ భాగవతాపచార ఫలమని గ్రామప్రజలు లింగాయతు ని దూషింప నారంభించిరి.


తమకుమారుని మరణ వార్తను విని వాని తల్లి దండ్రులు దుఃఖించుచు ఆ ప్రదేశమున కేగుదెంచిరి. వారు  ఇట్లు కన్నీరు మున్నీరుగా విలపింప నారంభించిరి. 


'మహనీయుడగు శ్రీరాఘ వేంద్ర యతీంద్రునిపై మంద బుద్దులగు వీరి కిట్టి దురాలోచన ఏల కలుగ వలె? వారు మాకుమారుని ఏల గొంపోవలె? శ్రీవారికి మాబిడ్డపై ఆగ్రహమేల కలుగవలె? మా గ్రహచార మిట్లున్నది.”

 

కొందఱు ఈదుండగులను రాజభటులకు అప్పగించి ఉరి తీయవలెనని పల్కిరి. కొందఱు శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి చరణములపై బడి పశ్చాత్తప్త హృదయముతో ప్రార్ధించిన  లాభము కలుగునని పలుకసాగిరి. అపుడా లింగాయతుడు, వాని యనుచరులు పశ్చాత్తాపమును చెందుచు క్షమింపుడని, యీ యువ కుని పునర్జీవితునిగనొనరిం పుడని శ్రీవారి పాదములపై బడి వేడుకొనదొడంగిరి. ఆయువకుని తల్లి దండ్రులు దీనాతి దీనముగ దుఃఖించుచు శ్రీవారి పాదములచెంత మృతు డైన  యువకుని శరీరము నుంచి యిట్లు ప్రార్థించిరి. "కరుణాసింధూ! ఏపాప మెరుగని మాకుమారుని కాపాడుము. ఈ పాపాత్ము ల సాంగత్యముచే నీతడు ఇట్టి     అధోగతిని బొంది నాడు. వీనిని పునర్జీవి తునిగ నొనరించి మావంశ మును కాపాడుడు'.


శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి మూర్తీభవించిన క్షమా మూర్తి. ఆ మహాను భావుడు తన కమండల ములోనున్న పవిత్రజలము లను ఆ యువకుని శరీరముపై చల్లి శ్రీమన్నా రాయణుని స్మరించెను. తత్ క్షణమే నిదుర నుండి మేల్కాంచిన వాని వలె ఆ యువకుడు లేచి కూర్చుండెను.


జరిగిన విషయము తెలిసి కొని ఆతడు శ్రీవారి పాదములపై బడి నా అపరాధమును క్షమింపు డని ప్రార్ధించెను. లింగా యతుడు, ఆతని యనుచరులు త్రికరణ శుద్ధిగ శ్రీవారికి శిష్యులైరి. నాస్తికులు ఆస్తికులైరి.  శ్రీవారి యీ యద్భుత లీలనుగాంచి సకలజనులు పరమానంద భరితులై  జయ, జయధ్వానముల నొనరించుచు తమతమ నెలవులకు జనిరి.


బృందావన ప్రవేశము:


ఆ దినము పరమ పవిత్రము. నాడు శాలి వాహన శకము 1593 విరోధికృత నామ సంవత్సర, శ్రావణ కృష్ణబహుళ ద్వితీయ (ఆగష్టు 1671/72 AD) బ్రహ్మ ముహూర్తముననే శ్రీవారు నేడు తాను బృందావనమును ప్రవేశిం చెదనని ప్రకటించిరి. అందరూ ఉచ్చైస్స్వరము తో  విలపింపదొడంగిరి. శ్రీవారి అంతిమ దర్శనము నకై లక్షలకొలది ప్రజలు మంత్రాలయమునకు వచ్చి ఉచ్చైస్స్వరముతో భగవ న్నామసంకీర్తన మొనరింప నారంభించిరి.


శ్రీవారు నిత్య కార్యక్రమాను సారము శ్రీమూల రామాది పీఠదేవతలను మనః పూర్వకముగ ఆరాధించి, మాలనుజేకొని ప్రజ్వరిల్లు చున్న జ్యోతి స్స్వరూపుని వలె ప్రకాశించుచు సకలజీవులకు తత్త్వబోధ నొనరించిరి.  వారొనరిం చిన ఆమహాబోధనే శ్రీమద్రాఘవేంద్ర గురుగీత యందురు. శ్రీవారు ఆసమయమున సమావేశ మై యున్న వారందరికి ఆశీస్సులను ఫలమంత్రా క్షతల నొసంగిరి. తదనంత రము శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి శ్రీహరి నామోచ్ఛా రణ మొనరించుచు బృందావనాంతర్గత మగు భూగృహమును ప్రవేశించి పద్మాసనాసీనులై అర్థ నిమీలిత నేత్రములతో తీవ్ర తపోమగ్నులైరి.


ఆ సమయమున దశదిశలు శ్రీహరి నామ సంకీర్తనతో మార్మ్రోగెను. ఆకసమునుండి దుందు భుల శబ్దము వినిపించెను. నదులు సాగరములు ప్రశాంతముగ నుండెను. మేఘములులేక ఆకాశము నిర్మలమై యుండగా సూర్యభగవానుడు జాజ్జ్వ ల్యమానముగ ప్రకాశింప దొడంగెను. వెంటనే శ్రీవారి యాదేశానుసారముగ భూగృహద్వారము మూసి వేయబడెను. శ్రీవారిపై నిర్మించిన బృందావన మందు ద్వాదశక్షేత్ర సాల గ్రామములు, గండకీనది నుండి తెప్పించబడిన వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నా నిరుద్ధాదులైన ఏడువందల సాలగ్రామ ములు ఉంచబడెను. బృందావనము గూడ తదనంతరము మూసి వేయబడెను. ఆసమయ ములో వేలాదిబ్రాహ్మణులు వేదపారాయణ మొనరిం చిరి, అప్రతి హతముగ దేవాలయ ఘంటలు మ్రోగింపబడెను. భక్తులు నగారాలను మోగించిరి. శిష్యులు శంఖారావము లొనరించిరి.  ఈ మంగళ కరధ్వనులతో ఆకాశమంత యు నిండిపోయెను.


నూతనపీఠాధిపతులైన  శ్రీ యోగేంద్ర తీర్థస్వామి బృందావనమును షోడశో పచారములచే ఆరాధిం చిరి.      బృందావనముపై

మూలరామాది దివ్యవిగ్ర హములనుంచి పంచ మంత్రాభిషేకము, జలాభి షేకము, క్షీరాభిషేకము, శర్కరాభిషేకము, మధు అభిషేకము, ఘృతాభిషేక ము, పుష్పాభిషేకము, ఫలాభిషేకము, గంధాభిషే కము చేసిరి.


బృందావనము నంతటిని తులసీమాలలతో అలంక రించిరి. మహానివేదనము గావింపబడెను. ఆ ప్రదేశ మునకు చేరిన    భక్తులం దరకు మహాసంతర్పణ గావింపబడెను. 


స్వయముగ శ్రీయోగేంద్ర తీర్థస్వామి బ్రాహ్మణులను, భక్తులను, విద్వాంసులను, దక్షిణలతో సత్కరించిరి. అనాటి శ్రీవారిబృందావన ప్రవేశ కార్యక్రమము మంగళ కరముగ పరిపూర్ణ మయ్యెను.


జై గురు రాఘవేంద్ర 

**

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము 

22 వ భాగము

సమాప్తము **

🌸💥🌸💥🌸💥


🙏 ఓం శ్రీ నమో రాఘవేంద్రాయ నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat