శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 24 వ భాగం

P Madhav Kumar

L

శ్లో. ఇతి కాలత్రయే నిత్యం

ప్రార్థనాం యః కరోతి స: !

ఇహాముత్రాప్త సర్వేష్టో

మోదతే నాత్ర సంశయః

18


తా. ఈ ప్రకారముగా ప్రతి దినము మూడు వేళల ప్రార్థనను చేయుచున్న వాడు ఈలోకమునను, పరలోకమునను సమస్త మనోరధములను సిద్ధించు కొనిన వాడై ఆనందించు చున్నాడు.     (18)


శ్లో. అగమ్యమహిమా లోకే 

రాఘవేన్ద్రో మహాయశాః |

శ్రీమధ్వమత దుగ్ధా బ్ధి

చంద్ర వతు సదా నఘః | 19


తా. లోకమునందు సాకల్యముగ తెలియరాని మహాత్మ్యము కలవాడు ను, గొప్పకీర్తికలవాడును సంపదగల శ్రీమద్ధ్వా చార్యుల వారియొక్క సిద్ధాంత మనెడు పాల సంద్రమునకు చంద్రుని వంటివాడును జరామరణా ది వ్యసనములు లేనివాడును నగు శ్రీరాఘవేంద్రస్వామి ఎల్లప్పుడు నన్ను రక్షించుగాక ! (19)


శ్లో. సర్వయాత్రా ఫలా వాప్త్యై

యధాశక్తి ప్రదక్షిణమ్ |

కరోమి తవ సిద్ధస్య

బృందావనగతం జలమ్,

శిరసా ధారయా మ్యద్య

సర్వతీర్థ ఫలా ప్తయే | 20

                      

తా.మహాగురూ! కాశీ రామేశ్వరాది యాత్రలు సలిపినందు వలన గలుగు పుణ్యమునకై తమ బృందావనమునకు యథా శక్తి ప్రదక్షిణ మొనర్చు చున్నాను. మరియు గంగానది సమస్త తీర్థములయందు గ్రుంకిన నెట్టి ఫలమబ్బునో యట్టి ఫలమునకై నీ బృందా వనమునకు అభిషేకించిన జలమును తలపై దాల్చు కొనుచున్నాను. (20)


శ్లో. సర్వాభీష్టార్థ సిద్ధ్యర్థం

నమస్కారం కరో మ్యహమ్

తవ సంకీర్తనం వేద

శాస్త్రార్థ జ్ఞానసిద్ధయే 21


తా. శ్రీరాఘవేంద్రస్వామీ! సర్వాభీష్టములు సిద్ధించు కొరకు తమకు నమస్కారము నొనర్చు చున్నాను. సమస్తమగు వేదశాస్త్ర జ్ఞానము లభించుటకై నిన్ను స్తుతించుచున్నాను. (21)


శ్లో.సంసారే౭ క్షయసాగరే ప్రకృతితో గాధే సదాదుస్తరే

సర్వావద్య జలగ్రహై రను పమైః కామాదిభంగాకులే|

నానావిభ్రమ దుర్భ్రమే అమితభయస్తోమాది ఫేనోత్కటే

దుఃఖోత్కృష్ట విషే సముద్ధర గురో! మామగ్నరూపంసదా. 22


తా.స్వభావముచే అగాధ మై అనుపమానంబులగు మొసళ్ళు మొదలగు జలచరంబుల బోలు దోష సమూహములచే దాట శక్యము గానిదై, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యము లనెడు తరంగములచే భీకరమై, నానావిభ్రమములనెడు సుడులచే ఆకర్షించుచు నపాయము గూర్చునది యై, భయసమూహ మనెడు డిండీర మండలముచే వెఱగు గొలుపునదియై, దుఃఖం బులనెడు కాలకూటాది విషంబులచే భయజన కమై, అక్షయమై యొప్పు నీ సంసార సాగరంబున నెంతయు మునిగి పారము జేరలేకున్న నన్ను రాఘవేంద్రప్రభూ! ఉద్ధరింపుము ఉద్ధరింపుము. (22)


శ్లో. రాఘవేంద్ర గురుస్తోత్రం

యః పఠే ద్భక్తిపూర్వకమ్ |

తస్య కుష్ఠాది రోగాణాం

నివృత్తి: త్వరయా భవేత్ 23


తా. భక్తి పూర్వకముగా ఎవరు యీ  రాఘవేంద్ర గురుస్తోత్రమును పఠిం చునో వానికి త్వరలోనే కుష్ఠాదిరోగములు సైతము నివారణమగును. (23)



శ్లో. అంధో2పి దివ్యదృష్టిః స్యా

దేడమూకో2పి వాక్పతిః

పూర్ణాయుః పూర్ణ సంపత్తిః

స్తోత్రస్యా స్య జపా ద్భవేత్  24


తా. ఈ రాఘవేంద్ర స్తోత్రమును జపించునేని జాత్యంధుడును, దివ్య దృష్టి గలవాడగును. చెవుడు గల మూగయు బృహస్పతివలె వాక్చాతు ర్యము గలవాడు అగును. మరియు పూర్ణ ఆయుర్దాయము పూర్ణ సంపదలు సైతము కలవాడగును. (24)


శ్లో. యః పిబే జ్జల మే తేన

స్తోత్రేణై వాభిమంత్రితమ్ |

తస్య కుక్షిగతా దోషా:

సర్వేనశ్యంతి తక్షణాత్ ||   25


తా. ఈ స్తోత్రముచే అభిమంత్రింప బడిన జలము నెవడు త్రాగునో వాని కుక్షిలోనున్న ఆధి వ్యాధిరూపంబులగు సమస్త దోషములు తక్షణమే నశించును.   25


శ్లో. యద్బృందావన మాసాద్య |

పంగు: ఖంజో2పి వా జనః 

స్తోత్రేణానేన యః కుర్యాత్  

ప్రదక్షిణ నమస్కృతీ

స జంఘాలో భవే దేవ

గురురాజ ప్రసాదతః "   26


తా. ఈచకాలువాడు గానీ, నడువ శక్తిలేని కుంటివాడు గాని యీ స్తోత్రమును పఠించుచు శ్రీరాఘవేంద్ర స్వాముల బృందావనము నకు ప్రదక్షిణ నమస్కార ములు చేసినచో నాతడు వెంటనే స్వామివారి అనుగ్రహాతిశయముచే వడిగా నడువగల పిక్కబలము గలవాడు నిశ్చయముగా నగును. 26

                     

శ్లో. సోమసూర్యోపరాగే చ

పుష్యార్కా-ది సమాగమే

యో నుత్తమ మిదం స్తోత్ర

మష్టోత్తర శతం జపేత్ |

భూత ప్రేత పిశాచాది

పీడా తస్య న జాయతే ॥ 27


తా. చంద్ర సూర్య గ్రహ ణంబుల యందును, పుష్యమీనక్షత్ర సహిత భానువాసరమునను, జన్మ నక్షత్ర వైధృతి వ్యతీపాత

పూర్ణిమ, అమావాస్య అర్ధోదయ  మహోదయాది పుణ్య కాలములందును ఎవడీ స్తోత్రమును నూటయెనిమిదిమార్లు జపించునో వానికి భూత ప్రేత పిశాచాది పీడలు తొలగును. (27). 


శ్లో.ఏతత్ స్తోత్రం సముచ్చార్య గురో: బృందావనాంతి కే |

దీపసంయోజనాత్ జ్ఞానం

పుత్రలాభో భవేత్ ధ్రువమ్  28


తా. ఈస్తోత్రమును భక్తితో పఠించుచు శ్రీ రాఘవేంద్ర స్వాముల బృందావన సమీపమున దీపము  వెలిగించినచో  జ్ఞానము, పుత్ర సంతానము కలుగును. 28


                       

శ్లో. పరవాదిజయో దివ్య

జ్ఞానభక్త్యాది వర్ధనమ్ |

సర్వాభీష్ట ప్రవృద్ధిః సా

న్నాత్ర కార్యా విచారణా |  29


తా. ఈ స్తోత్రమును పఠించుచు గురువుల బృందావనముకడ దీపము వెలిగించువానికి సభల యందు ప్రతివాదులను గెలుచుటయు, అపరోక్ష జ్ఞానము, హరి, గురువుల యెడ భక్తి మొదలగు, సకలవాంఛల బడయుట యు గలుగును, సంశయ మేమాత్రమును లేదు.  (29)


శ్లో. రాజచోర మహావ్యాఘ్ర

సర్పనక్రాది పీడనమ్

న జాయ తే౨స్య స్తోత్రస్య

ప్రభావా న్నాత్ర సంశయః | 30


తా. ఈ రాఘవేంద్ర స్తోత్రమును పఠించు భక్తులకు ఈ స్తోత్రమహిమ వలన రాజులవలన గాని, చోరులవలనగాని, వ్యాఘ్రముల వలనగాని సర్పముల  వలనగాని మొసళ్లు మొదలుగాగల వాని వలనగాని బాధ కలుగదు. సందేహము ఏ మాత్రము లేదు. (30)


శ్లో. యో భక్త్యా గురురాఘ వేంద్రచరణ

ద్వంద్వం స్మరన్ యః పఠేత్

స్తోత్రం దివ్య మిదం సదా నహి భవే

త్తస్యాసుఖం కించన |

కిం త్విష్టార్ధసమృద్ధి రేవ కమలా 

నాథ ప్రసాదోదయాత్

కీర్తి ర్దిగ్విదితా విభూతి రతులా

సాక్షిహయస్యో త్రహి ॥   31


తా. ఎవడు భక్తిశ్రద్ధలతో శ్రీరాఘవేంద్ర స్వాముల పాద పద్మములను స్మరించుచు యీస్తోత్ర రత్నమును పారాయణ

మొనర్చునో వానికి గొంచెమేనియు దుఃఖము గలుగదు. పైగా శ్రీహరి యనుగ్రహముచే సర్వా భీష్టములు సిద్ధించును, గొప్ప కీర్తివచ్చును. సాటిలేని సంపదలు కలుగును. ఈ విషయ మున హయగ్రీవమూర్తియే ప్రమాణము. 31


ఈ శ్లోకమున సంప్రదాయజ్ఞులగు పెద్దలు ఒక  విషయమును చెప్పుదురు. అప్పణా చార్యుల వారు శ్రీరాఘవేంద్ర స్వాముల బృందావన సమీపమున ఈ స్తోత్రము రచించుచు ఈశ్లోకము నాల్గవ పాదమున `కీర్తి ర్దిగ్విది తా విభూతి రతులా' అను వఱకు రచింపగా బృందావనము నుండి శ్రీ రాఘవేంద్ర స్వాముల స్వరముతో “సాక్షీ హయాస్యోత్ర హి' అను వర్ణసప్తకము వెలువడిన  దనియు అప్పణాచార్యుల వారు చెప్పిన ఫలము నందు శ్రీహయగ్రీవ మూర్తిని ప్రమాణ మిచ్చుచు శ్రీ రాఘవేంద్ర గురువులు తమ సమ్మతిని తెలియ జేసిరనియు ఆ సప్తాక్షరితో శ్రీఅప్పణా చార్యులవారు తమ స్తోత్రమును పూర్తి గావించుకొనిరనియు కింవదంతి.


శ్లో॥ ఇతి శ్రీ రాఘవేంద్రార్య

గురురాజ ప్రసాదతః |

కృతం స్తోత్రమిదం పుణ్యం

శ్రీమద్భిర్యప్పణాభిధై: ॥ 32


తా. ఈ విధముగా శ్రీరాఘవేంద్రార్యులైన గురుశ్రేష్ఠుల అనుగ్రహము వలన గురు కృపాపాత్రు డైన అప్పణాచార్యులను పేరుగల వారి చేత ఈ స్తోత్రము స్తుతింపబడెను.         32



పూజ్యాయరాఘవేంద్రాయ

సత్య ధర్మరతాయ చ |

భజతాం కల్పవృక్షాయ

నమతాం కామధేనవే ! 33

తా.పూజింపదగిన వాడును, సత్యధర్మముల యందాసక్తి గలవాడును,  భక్తితో సేవించువారికి కల్పవృక్షము వంటి వాడును, ప్రపత్తితో నమస్కరించు వారికి కామధేనువువంటి వాడును నగు శ్రీరాఘ వేంద్రస్వామికి నమస్కారము. (33)


జై శ్రీ గురు రాఘవేంద్ర 

****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము 

24 వ భాగం 

సమాప్తం **

💥🌸💥🌸💥🌸


🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat