శ్రీ జగన్నాథ దాసు:
శ్రీరాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని యవతారము. ప్రహ్లాదునకు సహ్లాదుడను సోదరుడు కలడు. ఆ దైత్యశ్రేష్ఠుడు ఈ కలి యుగములో జగన్నాథ దాసునిగ జన్మించి తన అగ్రజుడైన ప్రహ్లాదుని శ్రీరాఘవేంద్ర యతి రూపములో దర్శించెను. ఆయన వారికి ఏకాంత సేవచేసి చరితార్థు డయ్యెను.
రాయచూరు జిల్లా మానవి యను గ్రామము చెంత భాగ్యవట్టి యను కుగ్రామం కలదు. ఆ గ్రామములో నరసప్ప యను భగవత్ భక్తుడు కలడు. ఆయన ఆగ్రామమునకు కరణము, భార్య లక్ష్మక్క మహా పతివ్రత. భార్యాభర్తలు ఇరువురు గొప్ప సంగీత విద్వాంసులు. వారు పురందరదాసు రచించిన కీర్తనలను సదా గానమొన రించు చుండెడివారు. వారికెంతకాల మైనను సంతానము కలుగ లేదు. ఒక దినమున వారికి స్వప్నములో పురందర దాసు దర్శనమొసంగి యిట్లు పలికెను. “భక్తులారా! నేను శ్రీహరిని స్తుతించుచు ఐదు లక్షల కీర్తనలను రచింపవలెనని సంకల్పించి నాల్గు లక్షల డెబ్బది అయిదు వేల కీర్తనలను మాత్రమే రచింప గలితిని. నేను నా కనిష్ఠ కుమారుడైన మధ్వ పతిని మిగిలిన ఇఱువది అయిదు వేల కీర్తనలను రచింప వలసినదిగా కోరితిని. అతడు మీ గర్భవాసమున జన్మించి భగవంతుని, భగవద్భక్తు లను కీర్తించి పరంధామ మునకు వెళ్లగలడు". తదనంతరము భార్యాభర్త లకు మెలకువ కాగా వారెంతయో సంతసించిరి.
ఆదంపతులకు శాలివాహ నశకము 1650 కీలకనామ సంవత్సర శ్రావణ శుద్ధవిదియ (27-7-1728) శుభ దినమున ఒక తేజోవంతు డగు పుత్రుడు ఉదయిం చెను. వానికి శ్రీనివాసప్ప యని నామ కరణ మొనరించిరి. శ్రీ రాఘ వేంద్రతీర్ధ స్వామి శిష్య పరంపరలోని శ్రీవరదేంద్ర తీర్థస్వామి చెంత విద్యాభ్యాస మొనరించి శ్రీనివాసప్ప గొప్ప సంస్కృత విద్వాంసు డయ్యెను.
మధ్వ శాస్త్రములలో ప్రకాండ పండితుడయ్యెను. సంస్కృత భాషాభిమాని యై పాండిత్య ప్రకర్షతో తన మాతృభాషయైన కన్నడ భాషను తక్కువగా చూచుచుండెను. అతడు గృహస్థాశ్రమమును స్వీకరించి గృహములోనే సంస్కృత గురుకులమును జరుపుచుండెను. ఆరోజుల లో విజయదాస స్వామి మధ్వమత ప్రచార మొన రించుచు తన శిష్యులైన గోపాలదాసు, పంగనామా ల తిమ్మన్న దాసు, మోహనదాసు మొదలగు వారిని వెంట నిడుకొని గ్రామగ్రామము తిరుగుచు భాగ్యవట్టి గ్రామమును చేరిరి. శ్రీ విజయదాసు కన్నడ వాగ్గేయకారులు. అసంఖ్యాకముగ భక్తిరస ప్రధానములైన కన్నడ కీర్తనలను రచించి గాన మొనరించు చుండిరి. వీరు శిష్యసమేతముగ ఆ గ్రామ దేవాలయములో విడిది చేసి భగవంతుని లీలలను గానముచేయుచు సత్సంగ మొనరించు చుండిరి.
శ్రీ దాసుగారు గృహస్తుల గృహముల చెంత ప్రతి దినము కీర్తనలను రచనలను పాడుచు ఆగెడివారు. వారర్పించిన పదార్ధములను గైకొని దేవాలయములో భగవం తునకు నివేదించి సంతర్పణ గావించెడివారు. ఒకదినమున శ్రీనివాసాచా ర్యుల గృహము చెంత నిలచి కన్నడ కీర్తనల నాలపించిరి. సంస్కృతాభి మానియైన శ్రీనివాసాచా ర్యులు బిక్ష నివ్వక ఆ భక్తుని యవమానించెను. శ్రీదాసుగారు దేవాలయము లో జరుగుచున్నసమారాధ నకు శ్రీనివాసా చార్యులను ఆహ్వానించిరి. కన్నడ పండితుడైన విజయదాసు ల సమారాధనమునకు వచ్చుటకు శ్రీనివాసా చార్యుల అహంకార పూరితమైన మనస్సు అంగీకరింపలేదు. అతడు తనకు ఆలస్యముగ భుజించినచో కడుపులో శూలకల్గునని అసత్య మాడి భక్తులతో భుజించు టకు పోలేదు. ఈ విషయము తెలియగనే విజయదాసస్వామి రోష పడక మందహాసము చేయుచు అటులనా? యని పలికిరి. శ్రీ దాసుగారి శిష్యులు గోపాలదాసు మొదలగువారు తమ గురువులకు జరిగిన యవమానమునకు కుపితులైరి. ఆదినమున శ్రీనివాసాచార్యులు ఆలస్య ముగ భుజించిరి. తత్ క్షణమే ఆయన తీవ్రమైన పరిణామశూలకు గురి అయ్యెను. ఎన్ని ఔషధము లను వాడినను ఆ శూల ఉపశమింపలేదు. అతడు తీవ్రముగ అస్వస్థుడై 'వేరుదారిగానక బృందా వనము చేరి అనేక విధముల శ్రీరాఘవేంద్రతీర్థ స్వామిని ప్రార్థించెను. అపుడు శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి ఆచార్యా! మహాభక్తుడు, కన్నడ వాగ్గేయకారుడునైన శ్రీ విజయదాసులను నీవు సంస్కృత పాండిత్య ప్రకర్షచే అహంకరించి అవమానించితివి. భాగవ తాపచార ఫలమే ఈ దుర్భరమగు శూల, నీవు వెంటనే ఆ మహాత్ముని పాదములపై బడి శరణు వేడుమని ఆదేశించిరి.
వెంటనే శ్రీనివాసాచార్యులు గురుదేవుని యాజ్ఞాను సారముగ శ్రీ విజయదాస స్వామిని ఆశ్రయించెను. విజయదాస స్వామి ప్రసన్నులై కుమారా! నీకు ఇట్టిశూల కల్గుటకు కారణము నాశిష్యుడైన శ్రీగోపాలదాసు. నీవు సంస్కృతాభిమానివై నన్ను చులకనగ చూచుటగాంచి నాశిష్యుడు కోపించెను. నీవు పలికిన అసత్యమే నీకు శూలగ పరిణమించెను. నీవు వెంటనే 'గోపాల దాసుని ఆశ్రయింపు" మని పలికెను.
శ్రీనివాసాచార్యులు శ్రీ గోపాలదాసు నివసించు చున్న గ్రామమునకు జని ఆ భక్తుని ఆశ్రయించి తన యహంకారమునకు పశ్చాత్తాపము చెందు చున్నానని నన్ను క్షమింపు డని ప్రార్థించెను. అపుడు శ్రీగోపాలదాసు జొన్న రొట్టె లను చేసి వానిని శ్రీహరికి నివేదించి ప్రసాదమును శ్రీనివాసాచార్యులకు ఒసంగెను. ఆ భగవత్ప్ర సాదము నారగింపగనే శ్రీనివాసాచార్యులు అనుభవించుచున్న భయంకరమైన శూల తొలగిపోయెను. శ్రీనివాసా చార్యులు గోపాలదాసుతో గలసి శ్రీ వేంకటాచలము నకు జనెను.
"ఎన్నియో నెలలనుండి రోగ పీడితుడై యున్న కారణమున శ్రీనివాసాచార్యులు ఏడు కొండ లెక్కి సొమ్మసిల్లెను. భగవత్ప్రసాదమును తెచ్చి ఆచార్యులను రక్షింపవలెనని గోపాల దాసు ఆలయమునకు జనెను. ఇచట క్షణ మాలస్యమైనచో శ్రీనివాసా చార్యులు మరణావసిష్టు డగును. అపుడు శ్రీ వేంకటేశ్వర స్వామియే తన ప్రసాదమును గైకొని శ్రీగోపాలదాసు రూపమున అఱుదెంచి శ్రీనివాసాచా ర్యుల కొసంగి రక్షించెను. తదనంతరము గోపాలా చార్యులు ప్రసాదమును తీసుకొని ఆలస్యముగ వచ్చినవాడై జరిగిన దంతయువిని పరమానంద భరితుడై వచ్చినవాడు తానుగానని, సాక్షాత్తుగ ఆ శ్రీ మన్నారాయణుడు అని పలికెను. భగవంతునిచే అనుగ్రహింపబడి శ్రీ శ్రీనివాసాచార్యులు చరితా ర్థుడయ్యెను. నాటి నుండి శ్రీ శ్రీనివాసాచార్యులు సర్వసంగ పరిత్యాగిగా మారిపోయెను. పండరి పురంలో శ్రీపాండురంగడు శ్రీ శ్రీనివాసాచార్యుల ననుగ్రహించి శ్రీజగన్నాథ దాసు యనెడి అంకిత నామ మిడెను. ఆయన శ్రీహరిని కీర్తించుచు ఇఱువదిఐదువేల కన్నడ కీర్తనలను రచించి గాన మొనరించెను. శ్రీజగన్నాథ
దాసు తనగురుదేవులైన శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామిని ఆరాధించుటకు మంత్రాల యమును చేరెను. శ్రీ జగన్నాథదాసు మంత్రాల యములో నివసించుచు శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామికి ఏకాంత సేవల నొనరించు చుండెను. శ్రీవారియను గ్రహవిశేషముచే శ్రీ జగ న్నాధ దాసస్వామి సకల వేద శాస్త్రోపనిష త్సారమైన శ్రీహరికథా మృత సారమను మహా గ్రంధమును రచించెను. ఆ దివ్యగ్రంథము ద్వైత సిద్ధాంత సామ్రాజ్యములో విశేషస్థానము నలంకరిం చెను. శ్రీ జగన్నాధ దాసు నిత్యము శ్రీరాఘవేంద్ర స్వామి బృందావనము చెంత భక్తిరస ప్రధానము లైన కీర్తనలను పాడుచు శ్రీరాఘవేంద్రతీర్థ స్వామిని సంతోష పెట్టెడివారు. శ్రీ దాసుగారు, శ్రీవారు ఏకాంతమున భగవంతుని దివ్యలీలలను ముచ్చటిం చు చుండెడివారు. శ్రీ దాసుగారు పిలువగనే శ్రీవారు బృందావనము నుండి పలికెడివారట. వీరి సంభాషణమును వినవలె నని కొందఱు ఆశ్రమ వాసులు చాటుగ నుండి ప్రయత్నించిరి. ఆ దినము న యెన్ని పర్యాయములు ప్రార్ధించినను శ్రీ దాసుగారి తో పలుకక మౌనము వహించిరి. శ్రీ జగన్నాథ దాసు పలువిధముల దుఃఖించుచు తనవలన ఎట్టియపరాధము జరిగెనో యని శంకించుచు గృహమును జేరెను. నాటి రాత్రి శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి సాక్షాత్కరించి “సోదరా! మన సంభాషణ ము వినవలెనని కొందరు పొంచియుండిరి. అందు వలన నీవెంత పిలిచినను నేను పలుకలేదు. ఇక నుండి నేను స్వప్నములో గోచరించి నిన్ననుగ్రహిం చెద' నని పలికెను. అపుడు జగన్నాథదాసు పరమానందభరితుడై శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి ననేక విధముల స్తుతించెను.
ఇట్లు శ్రీవారికి అనేక విధములుగా ఏకాంత సేవలనొనరించుచు శ్రీ జగన్నాథ దాసస్వామి చరితార్థుడయ్యెను. ఈ మహాభక్తుడు ఎనుబది యొక్క సంవత్సరములు జీవించి శాలివాహనశకము 1731 శుక్ల నామ సంవత్సర భాద్రపద శుద్ధనవమి, భానువార మున (17-9-1809) యోగ ద్వారమున ఈ పాంచభౌతికమగు దేహము త్యజించి పరంధామము నకు జనెను.
జై శ్రీ గురు రాఘవేంద్ర
****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
25 వ భాగం
సమాప్తం **
💥🌸💥🌸💥🌸
🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్ర య నమః 🙏