కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం

P Madhav Kumar


Part - 14


 ఆలయ పరిసరాన్ని,ప్రత్యే కించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడాని కోసం జరిపే సేవ కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సంవత్సరంలో ఈ ఉత్సవం నాలుగు సార్లు జరుగుతుంది.ఉగాది,ఆణివార ఆస్టానం,వార్షిక బ్రహ్మోత్సవం,వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవ జరుగుతుంది.సుగంధద్రవ్యాదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత. స్వామి సాక్షాత్కారించిన ఆలయం లోపలి గోడల మీద చిత్రాలుండేవని,తిరుమంజనం కారణంగా ప్రస్తుతం కనబడం లేదని పెద్దలు చెబుతారు


  అళ్వారులంటే చప్పన 12గురు ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ 12 గురిలో కొయిల్ ఆళ్వార్ లేడు.దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైష్ణవ   పరిభాష.అంచేత కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించిడమని విశిష్టార్ధం.

                                                         వసంతోత్సవం


 తిరుమలలోని శ్రీవారికి వసంతఋతువులో చైత్రమాస శుద్ధత్రయోదశి పూర్ణిమా తిధులలో జరిగే ఉత్సవం వసంతోత్సవం.


  మొదటి రోజు ప్రాతఃకాల మధ్యాహ్న ఆరాధన ముగిశాక ఉభయ దేవేరులతో మలయప్పస్వామి బంగారు తిరుచ్చిలో ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారి ఆలయానికి పడమటనున్న వసంత మండపానికి వేంచేస్తారు. శ్రీవారికి అభిషేకం,అలంకారం,

ఆరాధనం నిర్వహిస్తారు.

సాయంకాలం ఆస్టానాoతరం తిరిగి గర్బాలయం చేరుకొంటారు. 


రెండవ రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీభూదేవులతో సహా ఆరాధనం పూర్తికాగానే బంగారు రధం అధిరోహిస్తారు.రధోత్సవం పూర్తి అయ్యాక వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ శ్రీవారికి దేవేరులకు అభిషేకం అలంకరణ జరుగుతాయి. సాయంకాలం సన్నిధి చేరుకొంటారు. మూడోవ రోజు ఆరాధనం పూర్తి అయ్యాక శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో ఒక తిరుచ్చిలోను,శ్రీ సీతారామ లక్ష్మణులు మరొక తిరుచ్చిలోను,శ్రీకృష్ణస్వామి రుక్మిణిగారలు మరొక తిరుచ్చిలోను వేంచేసి తిరువీధుల ఊరేగింపుతో వసంత మండపానికి వేంచేస్తారు.అక్కడ అభిషేకం ,అలంకారం,ఆస్తానం జరుగుతాయి


                ఈ వసంతోత్సవం క్రి.శ.1360 లో ప్రారంభమైనది. తిరుమల మీద జరిగే వసంతోత్సవాలు మూడు మొదటిది బ్రహ్మోత్సవ సమయంలో జరిగే కార్యక్రమం,రెండవది వసంతఋతువులో జరిగే ఉత్సవం, మూడవది భక్తదులు  ఆర్జిత సేవగా జరిపించే ఉత్సవం.

                                            పవిత్రోత్సవం


 సంవత్సరానికి ఒక్క సారి ఆలయ పవిత్ర వాతారణం పునఃస్టాపితం కావడానికి జరిపే ఉత్సవం పవిత్రోత్సవం. ఇది సంప్రోక్షణాది తతంగం కంటే బిన్నమైనది.ఆలయ విర్వహణలో,పూజాదూలలో తెలిసో తెలియకో జరిగిన పొరపాటు వల్ల అనర్ధం జరగకుండా ఉండడానికి జరిపే ఉత్సవం .ఈ ఉత్సవం క్రి.శ 1464 నుండి 1562 వరకు జరుగుతుండేవి. మరల దేవస్తానం వారు ఈ ఉత్సవాన్ని 1982 న  తిరిగి పునరుద్దరించారు.


   ఈ మూడు రోజులలో స్వామి ,దేవేరులతో కూడిన ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచుతారు. మొదటి రోజు పట్టు పోగులతో తులసి పూసలు లేదా తామర తుళ్లు సరంలాగా కనిపించే పవిత్రాలు యాగశాలలో ఉంచుతారు. రెండోవ రోజు శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రాలను శ్రీవారి ఆలయానికి బేడి ఆంజనేయస్వామి ఆలయానికి నుడుమ ఉన్న ప్రధాన ఇతర దేవతలకు సమర్పిస్తారు.


మూడోవ రోజు పవిత్ర విసర్జనం,పూర్ణాహుతి జరిపి ఉత్సవ పరిసమాప్తి చేస్తారు


   ఈ ఉత్సవం ఆగష్టు లో జరుగుతుంది.



   పుష్పయాగం


 తిరుమల శ్రీవారి ఆలయంలో 1980 నుండి పునః ప్రవేశ పెట్టిన మహోత్సవం పుష్పయాగం విగ్రహప్రతిష్ట చేసిన తరువాతగాని ,ఉత్సవాల ముగింపులోగాని,మేష తుల సంక్రమణ వేళ్ళలోగాని,కటకమకర సంక్రమణ సమయంలోగాని,యుగాంతంలోగాని,సంక్రాంతిలోగాని ,శ్రావణనక్షత్రంలో,రాజు,గ్రామం,యజమానుల జన్మ నక్షత్రసమయంలో,దుర్ఫిక్ష,అనావృస్టి,దుస్వప్నం,రాష్ట్ర విబ్రమ,పరచక్రభయ,మహావ్యాధి పీడన ఉపధ్రువ సమయాలలోగాని శ్రీవారికి అభిషేక పూర్వంగా పుష్ప యాగం చేయవచ్చని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి


  నిత్యారాధన అనంతరం శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతోబంగారు తిరుచ్చిలో రాజ మర్యాదులతో యాగశాలకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికీ అభిషేకం మొదలవ్తుంది. స్వామిని తులసి మాలాలంక్రుతుని చేసి సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. వైష్ణవస్వాములు ద్రావిడ వేదంలోని నీరాట్టుం గాధలను శ్రావ్యంగా వినిపిస్తారు. అభిషేకం పూర్తికాగా నూతన వస్త్రదారులై స్వామివారు ద్యానపిఠo అలంకరిస్తారు. అర్చకులు పుష్పదిపతికి ఆవాహనం చేస్తారు. ఆచార్యుడు మంత్రసంస్కారంతో పువ్వులను యగార్హం చేస్తాడు.శ్రీవారికి దక్షిణభాగంలో అగ్ని ప్రతిష్ట జరుగుతుంది. అక్కడ హోత్రం` మొదలవ్తుంది.విష్ణు గాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హొమం జరుగుతుంది. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాదిపతికి సంబందించిన హొమం కుడా జరుపుతారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat