అలుకా మానరా పలుక వేలరా
ఎలుక వాహన ఏకదంతా…
అలుకా మానరా పలుక వేలరా
ఎలుక వాహన ఏకదంతా…
1. నిన్ను చూసి చందమామ నవ్వెనంట
నవ్వగానే నీకు దీప మొచ్చెనంట
కోపము నాపకా శాపము నీయగా
చంద్రుని నింద పాలు చేస్తి వంట…
అలుకా మానరా పలుక వేలరా
ఎలుక వాహన ఏకదంతా…
2. చేతులార నీకు సేవ చేయ లేక
పాత్ర పోష దయకు నీదు పాత్రుడు గానా
దయకే దూరమా దరిశన భాగ్యమా!
పరిపరి విధముల నిన్ను ప్రస్తుతించెద…
అలుకా మానరా పలుక వేలరా
ఎలుక వాహన ఏకదంతా…
3. ధరణి వెలసి స్మరణ చేయు నీదు భక్తులు
దరికి వచ్చి వరము లిచ్చి బోవ వేమయ్య
దయకే దూరమా దర్శన భాగ్యమా
మదిలో నీదు స్మరూ మరమ జాలమా…
అలుకా మానరా పలుక వేలరా
ఎలుక వాహన ఏకదంతా…