కార్తిక శుద్ధ చవితి - నాగుల చవితి

P Madhav Kumar

🐍🐍🐍🐍🐍🐍🐍🐍

కార్తీకమాసంలో వచ్చే చతుర్థి తిథిని నాగులచవితి అన్నారు. ఆ రోజు నాగులను పూజ చేస్తారు. పాములను ఇంటికి తెచ్చుకోవడము అన్న విషయము సాధ్యము కాదు కనక ఆ రోజున పాములు ఉన్నచోటుకే వెళ్ళి పూజ చేస్తారు. సాధారణముగా నాగులచవితి చెయ్యని వారు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరు చక్కగా తలస్నానము చేసి పుట్టకు వెళ్ళి పాము తినే పదార్థములను పుట్టలో ఆవుపాలు, చిమ్మిలి, చలిమిడి వేస్తారు. కొంతమంది గుడ్డు కూడా వేస్తారు. పుట్టచుట్టూ తిరిగి పిల్లా పాపలతో ప్రదక్షిణముగా నమస్కారము చేసి ఇంటికి వచ్చేస్తారు. పాముని పూజ చేసేటప్పుడు నాగమును దేవతగా భావన చేసి

పుట్ట దగ్గర నిలబడి ప్రకటనముగా సంస్కృత భాషలో చెయ్యవలసిన శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో ఒక మాట అడుగుతారు. నాగుల చవితి విశేషము దానికి సంస్కృతిక పూజా విధానము ఉండదు. పుట్టలో పాలు పోసేసి నిలబడి నన్నేలు నాగన్న నా కులము నేలు. నా ఇంటి నేలు. నను కన్న వారి నేలు నా ఆప్తుల నేలు. పడగ తొక్కితే పగవాడనుకోకు. నడుము తొక్కితే నా వాడనుకో. తోక తొక్కితే తొలగి వెళ్ళిపో. ఈ నూకలని పుచ్చుకో పిల్లమూకలను ఇయ్యి. మాట అడుగుతారు.

నాగదేవత సంతాన కారకుడు అయిన సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యములో ఉండే సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపములో తిరుగుతూ ఉంటాయని పెద్దలు చెపుతారు. సుబ్రహ్మణ్యుని యొక్క నామములలో ‘వంశవృద్ధి కారకాయ నమః’ అని ఒక నామము. ఆయన సంతాన కారకుడై వంశమును నిలపెడతాడు. ఆ కారణము చేత పాముని సుబ్రహ్మణ్యునిగా భావన చేసి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat