అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?

P Madhav Kumar
2 minute read

 స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. అయితే ఈ చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఉంది. ముద్ర అంటే అభినయం. ‘చిన్‌’ అనే పదం ‘చిత్‌’‌ను సూచిస్తుంది. సిద్ధింపజేసేది అని అర్థం. చిన్ముద్రలో జాగురూకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటనవేలు బ్రహ్మం, మిగిలిన మూడు వేళ్లు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడూ ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాం. అందుకే జపం చేసే వేళ ఈ వేలుని ఉపయోగించరు. ఈవేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తాం.


బొటన వేలు మిగతా నాలుగు వేళ్లకు ఆధారం. ఇదే గనుక లేకపోతే ఏ పనులు చేయలేం. మిగతా వేళ్లు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటనవేలిని ఆత్మగా, ఆధారం బ్రహ్మంగా చెబుతారు. మిగతా మూడు వేళ్లు త్రిగుణాలను గ్రహించడానికి ఉపయోపడతాయి. విజ్ఞానం పొందడానికి, ఆహారం స్వీకరించడానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను అధీనంలో తెచ్చుకుని, బ్రహ్మం గురించి తెలుసుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చిన్ముద్ర వెనుక పరమార్థం. బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది. ఇదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి, పరబ్రహ్మంతో ఐక్యం అయ్యేవాడికి జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు.


ఇక అయ్యప్పస్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయడం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది.


 ‘పట్టబంధనం’ అనే సూత్రం స్వామి మోకాళ్ల కింది నుంచి వాటిని ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోర్కెలు తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో స్వామి అభయమిస్తారు.



ధ్యానంలో ఎక్కువకాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలగాలి ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుంది అని తెలియజేయడం కోసమ, ధర్మశాస్త్ర యోగాసనం, పై కూర్చున్నాడు. అట్టి యోగాసనం శరీరాన్ని మనసును, ఇంద్రియాలను, నియంత్రించి స్థిరమైన మానసిక స్థితిని అందించి తపోదీక్షలో దీర్ఘకాలం కూర్చునేందుకు వీలును కల్పిస్తుంది. జీవాత్మ, పరమాత్మల, కలయిక కావలసిన *స్థిరత్వాన్ని*’శక్తిని’ అందిస్తుంది.


                 * స్వామి ధ్యానం* లో ఉన్న స్థితి భగవత్ ప్రాప్తిని పొందడం కోసం ఎక్కువ కాలం ధ్యానంలో ఉండండి అని మనకు తెలియ చేయడం కోసమే “” స్వామి ధ్యాన” యోగాన్ని కలిగియున్నాడు. అని తెలుస్తోంది. అంతేగాక, బ్రహ్మ అనుభూతిని స్వయంగా తాను పొందడానికి, చిన్ముద్ర, యోగాసనం, ధ్యానం, అనే మూడింటిని, ధర్మశాస్త, కలిగియున్నాడు అని తెలుస్తున్నది. * ధ్యానాన్ని నిశ్చలంగా సాగేలా శబరిగిరీశ చిన్ముద్ర, యోగాసనంలో* కూర్చున్నాడు. “శబరి గిరీశడ యోగాసనం, పై కూర్చొని” ధ్యానం “లో ఉన్నాడు.


(యోగాసనం అనుసరించి ఆనందసిద్ధి కలుగుతుంది) (ఏకాగ్రత కలుగుతుంది) ధ్యానయోగం విజయవంతంగా ఆచరించబడుతున్న. ఇది తీవ్రమైన కృషి చేయాలి అందుకు అనంతమైన” దీక్ష “కావాలి. విచ్ఛిన్నమైన ధారవలే మనసు” ధ్యానం”లో ఉండాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat