హరిహరసుతుడు ఎవరు ? అయ్యప్ప ఎవరు ? పురాణంలో ఏమి చెప్పబడివుంది.

 

హరిహరసుతుడు ధర్మశాస్తా. ఆయనకున్న ఎన్నో అవతారాలలో ఒకానొక లీలావతారం భువిలో నాయకుడైన ఈ అయ్యప్ప స్వామి.


అయ్యప్ప అన్న నామం పురాణ ఇతిహాసాలలో కనబడకపోవచ్చును. ఎలాగైతే రాముడు కృష్ణుడు శ్రీమన్నారాయణుని అవతారాలో ఒకే శక్తి అవతారాలో అలాగే అయ్యప్పస్వామి వారు కూడా హరిహరసుతుని ఒకానొక అవతారం. 


🔸 పురాణాలలో చెప్పబడినది 🔸


🕉 బ్రహ్మాండపురాణ అంతర్గత *“భూతనాధోపాఖ్యానము”* అనే గ్రంధంలో శాస్తా అవతారం సంపూర్ణంగా వివరింపబడి వుంది. 


🕉 భువిలో స్వీకరించిన ఈయన అవతారంలో ఆయన నైష్టిక బ్రహ్మచారి కానీ మహాశాస్తా పూర్ణా, పుష్కలా సమేతునిగా దర్శనమిస్తారు.


🕉 శాస్తా భూత పరివారమైన వావరుడు, కటుశబ్దుడు, వీరభద్రుడు, కూపనేత్రుడు, కూపకర్నుడు, కండాకర్ణుడు, మహాబలి అన్న ఏడుగురు వేరు, అయ్యప్ప వావర్ అన్న ఇస్లాం భక్తుడు వేరు. 


🕉 పురాణకాలానికి, చారిత్ర కాలానికి మధ్య చాలా వ్య్వవధి ఉంది. మహిషిని సంహారం చేసిన సందర్భంగా ఏర్పడినదే శబరగిరి ఆలయం. 


🕉 పందళ దేశ రాజుకు బిడ్డగా అనుగ్రహింపబడ్డ అయ్యప్ప ఉదయనుడు అన్న కిరాతుని చంపి శిధిలావస్థలో ఉన్న శబరిమలను పునరుద్ధరించి ఆ స్థలంలో ప్రతిష్టింపబడిన విగ్రహంలో ఐక్యం అవ్వడం ఋజువుగా స్వీకరించవలసి వస్తుంది. 


🕉 నేటి కేరళ ప్రాంతం పరశురాముని భూమి . ఈ ఆలయం కూడా ఆయన ప్రతిష్టింపబడినదే . శబరిమలకు అగ్నిదేవుని శాపం ఉండిన కారణమున నిర్ణీత కాలానికి ఒకసారి ఆలయానికి అగ్నిప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. ఇది కూడా అయ్యప్ప చిత్తమే. అందువలన ఎన్నోమార్లు ఆలయం పునర్నిర్మాణము కావడమూ, విగ్రహ మార్పిడీ జరుగుతున్నది.

 

🕉 క్రీ.పూ. 978వ సంవత్సర చారిత్రిక సంఘటనలో అగ్నిప్రమాదం జరిగిందని ప్రభాకరాచార్యుల వారిచే ప్రతిష్ట జరిగిందని ఆ గుడి తాపడాల మీద శాసనాల ఆధారంగా తెలియవస్తున్నది.


🕉 తమిళనాట పలు గ్రామ రక్షకునిగా ఉన్న అయ్యనార్ మహాశాస్తా అని అనడానికి ఏమీ సందేహం లేదు. కామాక్షీ దేవీ కూడా తన పుత్రునిగా శాస్తాను రక్షణాధికారి గా నియమించింది.


🕉 అంత వరకు ఎందుకు నడిచే దేవుడు పరమాచార్య వారు అయ్యప్ప పూజా విధిని శాస్తా పూజావిధిగా ఆమోదించారు. ఇక నేటి వారు ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదు కదా.


🕉 57 వ కంచి పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ పరశివేంద్ర సరస్వతీ వారు తాము రచించిన సహస్రనామ భాష్యంలో పుత్రిణే నమః అన్న నామానికి గణపతి, స్కంధుడు, మహాశాస్తా అన్న పుత్రులను కన్న తండ్రిగా శివుని కీర్తించారు. 


🕉 *“మిత్రేయిని”* ఉపనిషత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శాస్తా, ప్రణవం అంతా ఒక్కరే అని చెబుతుంది.


🕉 శివసహస్రనామాలలో *“శాస్త్రుపితా”* అన్న నామం పరంజ్యోతి స్వరూపుడైన శాస్తా గురించి ప్రస్తావిస్తున్నది.


🕉 కోటిరుద్రసంహితలో ఈశ్వరుడే స్వయంగా శాస్తాను పొగిడారు.


🕉 *“లింగపురాణం”* లో నందీశ్వరునితో కుమారస్వామి శాస్తా యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ విష్ణు, శివ పుత్రుని యొక్క గుణగణాలగురించి చెబుతూ అమితపరాక్రమవంతునిగా కీర్తిస్తాడు.


🕉 బృహస్పతి విరచితమైన *“బార్హస్ప్యనీత”* లో కుమార పర్వతమున కుమారస్వామి, సహ్యపర్వతమున గణపతి, రైవతక పర్వతమున శాస్తా నిత్యనివాసము చేస్తున్నారని వివరిస్తారు.


🕉 *స్కాందపురాణ అంతర్గతమైన శివరహస్యకాండం* లో శాస్తా గురించి ఆయన ప్రభావం గురించి 13 వేల శ్లోకాలు ఉన్నాయి. 


🕉 *శ్రీ లలితోపాఖ్యానము* లో మోహినిగా వచ్చిన పార్వతి దేవికి శివుని వలన కలిగిన పుత్రునిగా శాస్తా గురించి చెబుతుంది. 


కలియుగంలో మానవ మనుగడలో నీతి నిజాయితీకి భంగం వాటిల్లినప్పుడు పందళ రాజుకు పుత్రునిగా అవతార స్వీకారం చేసి తన ఉనికిని తెలిపాడు కానీ ఈ ధర్మశాస్తా నాటికీ, నేటికీ, ఎప్పటికీ మన సాంప్రదాయపు దేవతాస్వరూపుడే.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!