*7.భాగం*
తరువాత నా దేవలుడు వేగముగా నాయడవిదాటి గంగాతీరమున బ్రవేశించెను. ముల్లోకములను బవిత్రము చేయునదియు, దివ్యమైనదియు,
పాపములను మేఘములకు గాలివంటిదియు, శివునిజటాజూటమున విహరించునదియు, విశదకాంతిగలదియు, పాతాళమువఱకును వ్యాపించియున్నదియు,
పెక్కు జలజంతువులతో, గూడియున్నదియు, పూలమాలవంటి తరంగములతో
నిండియున్నదియు, అందుందు దలలుపై కెత్తు జలజంతువులచే గంగలోస్నానము
చేసినవారి పాపములు నశించునని చెప్పుచున్నట్లు గనుపడుచున్నదియు తనలో
స్నానము చేసినంత మాత్రమున సమస్తపాపములనుహరించి మనుష్యులను సర్వ
సౌఖ్యములను గలిగించు వైకుంఠమునకు బంపజాలునదియు, తన్ను సందర్శించిన మాత్రముననే వారిపాపములను దూదిని నిప్పువలె భస్మముచేయుచు వెంటనే పరమపదమునకు బంపునదియు, నగుగంగనుజూచెను. మఱియు నాగంగ
పాపహారియగు తన ప్రవాహములో స్నానము చేసిన వారి బ్రహ్మ హత్యాదికములగు
ఘోరపాపములను దూరముగా జేయును. అందు మునిగినవారిని మహాపాతక
ములు కాలినయినుమును ప్రాణులు ముట్టజాలనియట్లుగానే ముట్టజాలవు.
ఆగంగాతీరమునందు మూడు రాత్రులు నివసించి స్నానపానాదులచే లోపలివెలుపలి
పాపములను బోగొట్టుకొని యుత్తమలోకములకు బోవుదురు. మఱియు
బుణ్యపుణ్యంబులగు నాగంగోధకములచే బితరులకు దర్పణాదులు చేసినచో
వారును, వారివంశములో బుట్టినవారును,వారిమిత్రులును, బంధువులును,
గురువులును, ప్రభువులును, ఇంకను వారికిష్టులును దమతమవారలతో గూడ
దుస్తరములగు నరకముల నతిక్రమించి యానందభరితులయి నృత్యము చేయుచు
శాంకరలోకమునకు బోయి నిత్యమును సంతోషించుచుండుదురు. మఱియు ఆగంగానదిని మునులు యోగులు బ్రహ్మనాదులు మొదలగువారు ముక్తినిగోరుచునాశ్రయించి యుందురు. అటువంటి గంగానదిని జూచి దేవలుడు తనయాహ్నిక
కృత్యములను దీర్చుకొని శీఘ్రముగా నచ్చటినుండి బయలుదేటి తిన్నగా
వామదేవాశ్రమమునకుబోయెను. అది ఫలములచేతను పుష్పములచేతను
నిండియున్న వృక్షములుగలదై పద్మవిహారనిబిడములగు చెరువులతో గూడి
వైరములెఱుగని నానాజంతుసంతానముచే నలరారుచు లెక్కకు మిక్కిలియగు పక్షుల రొదలచే శ్రావ్యమయి తపస్సు చేసికొనువారికి సంతోషమును గలిగించుచు
నావామదేవమహామునియొక్క తపోమహత్త్వమునకు నాదర్శమై యొప్పుచున్నది.
ఆదేవలు డిట్టి యాశ్రమమును జూచి మిక్కిలి సంతోషించుచు స్వాధ్యాయపరాయణు లగు శిష్యులచే సేవింపబడుచున్నవామదేవుని జూచెను. మఱియు వేదవేదాంగముల
యథార్థ మెడిగిన వాడును, పరమపావనుడును, నిష్కల్మషుడును, వినయాచారసం
పన్నుడును,జ్ఞానవిద్యా విదారుడును, తేజోరాశియు, మండుచుండు నగ్నిహోత్రము
వలె దురాధర్షుండును నయి యొప్పాఱుచుండెను. ఇట్టి వామదేవమహామునికి
నమస్కరించి యతనిచే క్షేమాదులడుగబడి యతనిసన్నిధిలో గూర్చుండి దేవలు డిట్లనియె, మునీంద్రా ! యిపుడు మీదర్శనముచేతను బవిత్రుడనయితిని.
జ్ఞానభూషణా ! నేను ధన్యుడనయితిని. అని యీరీతిగా నతని గొనియాడుచు మరల
నిట్లనియె. దేవా - మునిభగవానులారా ! తమయందఱకును గుశలమేకదా ! తపోనిధీ !
మీతపశ్చర్య సులభముగా జరుగుచున్నదికదా ! అని యడిగినవిని వామదేవు
డిట్లనెను.వామ మహాబాహుడవును, అమిత విక్రమశాలినియు నగునో దేవలా !యేమని చెప్పగలను ? మేమందఱమును నింతవఱకును సుఖముగా గాలము గడుపు చుంటిమి. మాతపస్సులు స్వాధ్యాయములు యజ్ఞములు నిర్విఘ్నముగా జరుగుచుండెను. మా కేవిధమయినభయమును లేకుండెను. కాని ప్రస్తుతము మాతపస్సులు
మొదలగువానికి విఘాతము తటస్థించినది. ఇపుడు మాయాశ్రమమునకు మహాభీతి కలిగినది, ఇపుడిచ్చటి మునికుమారులకు జాలపీడకలిగినది. ఆశ్రమ మృగములకు నాశము సంభవించినది.బ్రహ్మ - నారదా ! ఇట్లావామదేవముని చెప్పగావిని దేవలుడు వినయముగా నిట్లడిగెను.
దేవ - మునిచంద్రా ! మీతపోవనమునకు బాధగలిగించు పాపాత్ముడెవడు ?
వాడెచ్చటనుండును ! వానిపేరేమి ? వాడు రాక్షసుడా ? భేతాళుడా ? మనుజుడా ?చెప్పుడు వాడియగు నాబాణములచేతను వానిని జంపి యమునియింటికి బంపి
మీబాధ తొలగించెదను. బంగారుపుంఖములు గలిగి పిడుగులతో సమానములైన
నాబాణములచే వాని శిరస్సు నిపుడే నిస్సంశయముగా ఖండించెదను. అని యిట్లు
దేవలుడు చెప్పగానే వామదేవముని చాలసంతోషించి యిట్లనియె.
వామ - దేవలా ! చెప్పెదను వినుము. ఇచ్చట కర్ధయోజన దూరమందు దుర్మార్గుడు కుండికుడను రాక్షసుడు గలడు. వాడు గొప్పబలము గలవాడు. కొండ
గుహలోనుండును. జూచి ప్రాణులన్నియు భయపడి పాఱిపోవుచుండును.
వానిని మేము తపోబలముచేతను నశింప జేయుదుముగాని తపస్సు పోవునని శాంత మనలంభించి యుంటిమి. నీవు మహాబలవంతుడగు రాజవు. బ్రాహ్మణులకు గలిగిన సంతాపమును హరించుట రాజులకు ముఖ్యధర్మము. బ్రాహ్మణులను
రక్షించుటకంటె రాజులకు గొప్పధర్మములేదని కదా పెద్దలు చెప్పుదురు ! ఆర్తులు,
దుర్బలులు, తపస్వులు అగు బ్రాహ్మణులకు దప్పక యభయమియ్యదగినది
యనియు నది పరమ ధర్మమనియు మన్వాదులగు పెద్దలచే జెప్పబడియున్నది.
బ్రాహ్మణులకు సంతోషము గలిగించునందువలన గలుగుపుణ్యమనంతము.
బ్రహ్మహత్యకంటే మించినపాపము, బ్రాహ్మణరక్షణకంటె మించిన పుణ్యము లేదందురు. బ్రాహ్మణులతో ద్వేషించిన పాపాత్మునిదుఃఖమును కంతముండబోదు.
అట్లు ద్వేషించిన పరమ పాపాత్ముడు ఘోరనరకముల ననుభవించి తరువాతను
నీచయోనులయందు బుట్టుచుండును. బ్రాహ్మణులను రక్షించిన ధర్మాత్ముడు భూలోకమున సమస్తసుఖములనుభవించి తరువాతను స్వర్గమునం దుత్తమ భోగముల ననుభవించును. ఆ పుణ్యము క్షీణించిన తోడనే యారోగ్యవంతుడై
ధనవంతులు కులీనులు మొదలగు నుత్తములయిండ్ల బుట్టును. అతని కెప్పుడును
సుఖమేకాని దుఃఖమన నెట్టిదో తెలియదు. బుద్ధిమంతుడయి యీశ్వర ప్రీతిగా
బ్రాహ్మణులకు దృప్తి గలుగజేసినవాడు పునరావృత్తి రహితమయి శాశ్వతమయిన
పదమునుగూర్చి పోవును. ఏకారణముచేతనయినను బ్రాహ్మణులకు దృప్తిని
గలిగించినవాడు దేవతలందఱను దృష్టిని బొందించిన పుణ్యమును బొందును.వానికృత్యములకు దేవతలందఱును దృప్తిని పొందుదురు. వేదవిదుడగు బ్రాహ్మణుని
యనయవయములయందు సమస్త దేవతలును నివసించియుందురు గనుకను
మఱియు నతనిదేహము నాశ్రయించి సమస్త పుణ్యనదులును తీర్థములును ఉండును. గనుకను బ్రతిదినమును నతడుపూజింప దగినవాడు వేదవేత్తలగు బ్రాహ్మణులకు సంతోషముగా బ్రతిదినమును నమస్కరించుచుండుట మంచిది.అతనికి నమస్కరించినచో సర్వదేవతలకు నమస్కరించినట్లగును. రాజా !
ధర్మమాచరింపదలచినవారు తప్పక బ్రాహ్మణులను సంతోషపఱచువలయును.
అందువలన గొప్పధర్మము లభించును. వేయేల ? మహామతీ ! ముఖ్యమయిన
సంగతి చెప్పెదను వినుము. వేలకొలది యశ్వమేధములు, కోట్లకొలది గంగా
స్నానములును బ్రాహ్మణ రక్షణ యొక్క పదియాఱవవంతును బోలవు. కావున నోదేవలా ! మేమారాక్షుసునివలన జాల భయపడుచున్నాము. అట్టి పరమపాపాత్ముని
నీ బాహుబలము నాశ్రయించి చంపుము. వానిని జంపి మాబాధను నివర్తింప
జేయుము. నీవు సాధువులకుపకారము చేయు నిమిత్తమై యీశ్వరునిచే బుట్టిం యిట్లు దేవలుడు చెప్పుచుండగా రాక్షసుడు కోపముగలవాడై యొక పెద్దరాయితీసి
“చావుము" అని రాజుమీదను విసరెను. ఆవచ్చుచున్నశిలను వజ్రమువంటి
బాణముల చేతను బొడిగావించి యారాక్షసుని సర్వాంగములయందును
బాణములను నిండించెను. తరువాతను రాక్షసుడు కోపపూరితుడయి “ఓరీ !
మూడుడా ! కాలచోదితుడనయి నాకంటబడితివి. ఇక నెక్కడకుబోయెదవు ? ఇపుడు
నిన్ను వజ్ర సదృశమయిన నా పిడికిలితో బొడిచి చంపి నీరక్తముద్రావి తృప్తినిబొం
దెదను" అని చెప్పి మీదికి బిడికిలిపట్టి పరుగెత్తుకొని వచ్చుచున్న రాక్షసునిపై
నొక్కవాడిబాణమును బ్రయోగించి యాచేయి ఖండించెను. మఱియొక బాణముచేతను రెండవచేయిగూడ ఖండించెను. ఇట్లు రెండుచేతులును దెగిపడిపోవుటచే
బలవంతుడగు రాక్షసుడు నోరు తెఱచికొని కోఱలతో వానిని బీడింతునుగాక యని
వచ్చుచుండగా నంతట దేవలు డర్ధచంద్రాకారముగల బాణము ప్రయోగించి
రాక్షసుని శిరస్సు తెగగొట్టెను. వాని శిరస్సు వజ్రాయుధముచే గొట్టబడిన కొండ
శిఖరమువలె నేలగూలినది. తరువాతను విమానమెక్కి దివ్యరూపధరుడగు
నొకానొకపురుషుడు తన తేజస్సుచే దశదిశలను వెలిగించుచు దేవలునికగపడెను.
అతనినిజూచి యాశ్చర్యపడి నీవెవరు ? అని దేవలు డడిగెను. ఇట్లడుగగా
నతడిట్లనియె రాజేంద్రా ! సాధు ! సాధు ! పవిత్రుడినయితిని. నీధర్మమున దుస్తరమయిన శాపసముద్రమును దాటితిని. నాశాపాగ్ని హోత్రమును జల్లార్పితివి.
నావృత్తాంతమంతయు జెప్పెద నాలింపుము. నేనిక్ష్వాకుపుత్రుడగు విశాలుని
కుమారుడను. నేను మహబలపరాక్రమములు గలవాడను. నాపే రగ్రధన్వ
యందురు. నేను బాగుగా రాజ్యమేలితిని. నాపట్టణము విశాలయను పేరుగలది.
నేను రాజ్య మేలు కాలముందు వికటు డను పేరు గల రాక్షసుడు దేశములను
బాధించుచు మునీంద్రులను భక్షించుచున్నవాడు. నేనాసంగతిదెలిసికొని
యాపాపాత్మునిజంపి యందఱకును సంతోషమును గలిగించితిని.
*సశేషం..........*