ఐదవ అధ్యయనం - మూడవ భాగం
విలాసహసవ్యసనా తిచిత్రాః కాంతాననాః శోణసరోజనేత్రాః
శ్రీరూపమాత్మానమవేశ్య భూపాస్తామన్వగచ్చన్ విఠదాను వృత్యా.
అహం వటస్థః పరిధర్షితాత్మా పద్యావివాహోత్సవ దర్శనాకుల
తస్కొవచో.. తర్లృది దుఃఖితాయాః శ్రోతుం స్థితః ప్రీత్వమిశేషు తేషు
🌺అర్ధం:
కటాక్ష భ్రూవికారాది శృంగారభావములు, హాసము, వ్యసనములచే మిక్కిలి చిత్రముగ కనబడువారు, మనోహరములగు ముఖములు గలవారు, రక్తపద్మములవంటి నేత్రములు గలవారు అగురాజులు స్త్రీ రూపముగ తమును చూచుకొని నిష్కల్మసులై పద్మావతిని అనుసరించిరి.
పద్మావతి వివాహోత్సవమును చూచు కోరికతో నేను సమీపమందలి మండపం నందు కూర్చుండిని. కాని రాజులందరు స్త్రీరూపములను ధరించుటను చూచి మిక్కిలి ఖిన్నుడనైతిని, వారి వార్తాలాపములను వినుటకు అచ్చటనుంటిని.
జహీహి కల్కే కమలావిలాసం క్రుతం విచిత్రం జగతామధీశ
గణే వివాహోత్సవమంగళ సా శివం శరణ్యం హృదయే నిధాయ.
తాన్ దృష్టా నృపతీన్ గజాశ్వరధిభిస్త్యక్తాన్ సిఖిత్వం గతాన్
స్త్రీ భావేన సమన్వితానముగతాన్ పద్మాం విలోక్యాంతికే.
దీనా వ్యక్తవిభూషణా విలిఖతీ పాదాంగులై: కామినీ
శం కర్తుం నిజనాథమీశ్వరవచస్తథ్యం హరిం సా స్మరత్.
🌺అర్ధం:
ఓ జగదీశ !మంగళమయముకు వివాహోత్సవ సమయమున రాజులందరు స్త్రీరూపమును పొందుటచూచి పద్మావతి విలపించెను. శరణాగతరక్షకుడగు పరమేశ్వరుని ధ్యానించెను. వెంటనే స్త్రీరూపములను పొందిన రాజులు గజాశ్వరథములను విడిచి సఖురాండ్రుగ ఆమెవెంట నడవసాగిరి. వారిని చూచి ధీనురాలై, అలంకారములను తీసివేసి, పరమేశ్వరుని వరమును సఫలము చేసుకొనుటకై పతిభావముతో విష్ణువును ధ్యానించేను.