మంచాల:
కృతయుగములో మహా దైత్యుడగుహిరణ్యకశిపుడు అఖండ తపస్సుచేసి స్రష్టయైన బ్రహ్మదేవునారా ధించి అప్రతిహతము లైన వరములను పొంది అజేయుడై త్రిభువనము లను జయించి భారత వర్షమున తనరాజధానిని స్థాపించెను. నేటి ఆంధ్ర ప్రదేశమందుగల అహోబిల ప్రాంతము హిరణ్య కశిపుని నివాసస్థానమై యుండవచ్చును. అహో బిల పర్వతముపై శ్రీలక్ష్మీ నృసింహదేవుని ఆలయం కలదు. స్వామి ఒక స్థంభమునుండి బయల్వెడ లినట్లు నేటికిని దర్శన మొసంగుచున్నాడు.
ఆ ప్రదేశమే హిరణ్య కశిపుని రాజాస్థానము. ప్రహ్లాదుని వాక్యములు సత్యములని నిరూపించు టకు శ్రీహరి ఆ క్షణమున బ్రహ్మాండములోని ప్రత్యణు వునందు శ్రీ నృసింహ రూపమున విరాజిల్లెను. ఆయన రాజాస్థాన మధ్య భాగములో గల స్థంభము నుండి బయల్వెడలి హిరణ్యకశిపుని సంహ రించి ప్రహ్లాదు ననుగ్రహిం చెను. నేడు ఆప్రాంత మంతయు అరణ్య ప్రాంత ముగా నున్నది.
హిరణ్యకశిపుని మరణా నంతరము శ్రీలక్ష్మీనృసింహ భగవానుడు ఆ దైత్యేశ్వ రుని సింహాసనము నలంకరించి దానిని పరమపవిత్ర మొనరించి ప్రహ్లాదుని తనయొడిలో గూర్చుండబెట్టుకొని రాజ్య అభిషేకమొనరించెను. ప్రహ్లాద చక్రవర్తి విరాగి.
భగవంతుని ఆజ్ఞానుసార ముగ సామ్రాజ్యమును, ధర్మమును తప్పక పరి పాలించెను. రాజసూయ యాగములను, ఆ మహా మనీషి అసంఖ్యాకముగ అశ్వమేధం యజ్ఞములను నిర్వహించెను. దక్షిణ భారత దేశములో ప్రవహించుచున్న పవిత్ర తుంగభద్రానదీ తీరమున ప్రహ్లాదచక్రవర్తి సకల యజ్ఞ ములను నిర్వహించెను. నేడు ఆ ప్రదేశమునే మంత్రాలయమని భక్త జనులు కీర్తించుచున్నారు. ప్రహ్లాదుడు యే ప్రదేశము లో ఆసీనుడై మహా పుణ్య ప్రదములైన యజ్ఞముల నొనరించెనో ఆప్రదేశమందే శ్రీరాఘవేంద్రస్వామి దివ్య బృందావనములో విరా జిల్లుచు అనిష్ట పుణ్యము లను స్వీకరించి బహు కాలము తన్నాశ్రయించిన భక్తులకు అవిచ్ఛిన్నముగ ప్రసాదించు చున్నారు. ఆప్రాంతమునే 'మంచాల' యందురు. కృతయుగ ములో సకలవిభూతులకు నిలయమైన ఆ మహా పట్టణము నేడొక గ్రామము గనున్నది. ఈ గ్రామమందు 'మంచాలమ్మ' యను గ్రామదేవత కలదు. కృతయుగములో కూడ ఆ శక్తి హిరణ్యకశిపునకు ఆరాధ్య దేవతయై విరాజిల్లెను. ఆమె వారి గృహదేవత, ఆమె విరాజిల్లియున్న పవిత్ర ప్రదేశము కావుననే ఆ ప్రాంతమును మంచాల యందురు. నేటికిని మంత్రాలయములో మఠ ముఖద్వారములో మంచాలమ్మ మండపము కలదు. క్రీ.శ.1960 సం॥లో శీ సుయమీంద్ర తీర్థ స్వామి శ్రీరాఘవేంద్ర తీర్థుల బృందావనము నకు చేరువలో మంచాల మ్మకు చక్కని దేవాల యమును నిర్మించిరి. మంత్రాలయ ప్రదేశ మంతయు భక్తవరేణ్యు డైన శ్రీప్రహ్లాద రాజేంద్రునకు కర్మభూమి, యజ్ఞభూమి అయ్యెను. నాటి ప్రహ్లాదుడే నేటి శ్రీ రాఘవేంద్ర తీర్ధ స్వామి.
విశాలపర్వతముల వలె తాను సమపార్జించిన తన యనిష్ట పుణ్యములను దానమొనరించుటకు శ్రీరాఘవేంద్ర తీర్ధ స్వామి బృందావనములో నేటికిని సజీవులై తన్నాశ్రయించిన భక్తులకు దర్శనమొసంగి వారిని భవబంధవిముక్తుల గావించుచున్నారు.
శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి దక్షిణమున పయనించు చున్న కాలములో, ఆ మంచాల ప్రాంతము అసదుల్లాఖాన్ అను మహమ్మదీయుని పరి పాలనలో నుండెను. శ్రీస్వామివారి యనుగ్రహ మునకు పాత్రుడైన వెంకన్న యను అనాధబ్రాహ్మణ బాలకుడే స్వామివారి ఆశీర్వాదబలముచే నాడు ఆరాజ్యమునకు దివానుగ నియమింపబడెను. శ్రీ స్వామి బీజాపూరు రాజ్యమునుండి బయలు దేరి ప్రయాణ మొనరిం చుచు పరివార సహిత ముగ ఆదోనిని సమీపించిరి. ఆదోని ప్రాంతమునకు దివానుగా నున్న వెంకన్నకు స్వామి వారి ఆగమనవార్త తెలిసెను. ఆభక్తుడు పరివార సహితుడై పాదచారిగా బయలు దేరి తన గురుదేవునకు రాజోచిత స్వాగతము నుబల్కెను. శ్రీస్వామి యొక్క దివ్వమంగళరూప ము గాంచి పులకిత గాత్రుడై అశ్రుపూర్ణ నయ నములతో అనేక దండ ప్రణామముల నర్పించెను. స్వామి దివ్వపాదస్పర్శచే వెంకన్నపంతులు చరితార్థు డయ్యెను. శ్రీరాఘవేంద్ర స్వామి తన చరణముల నాశ్రయించిన శిష్యుని లేవనెత్తి ఆశీర్వదించి అనుగ్రహించి మంత్రివర్యా? కుశలమా! యనిరి. అప్పుడు వెంకన్న ‘గురుదేవా! మంత్రి యెవరు? నేను మీ పాదానుదాసుడను, మీ చరణారవిందముల నాశ్ర యించిన భక్తుడనని పల్కి తనభక్తి ప్రపత్తులను ప్రదర్శించెను. గురుదేవా! నేననాథను, విద్యాగంధ ము లేని మూఢుడను. మీయనుగ్రహము వలన నేను అపారవిద్యా వంతుడనై పరిషియాభాష లోనున్న అసదుల్లాఖానుని రాజపత్రమును పఠించు టచే నేడు ఈరాజ్యము నకు మంత్రినైతిని. ఈ సౌభాగ్యమంతయు తమ కృపాప్రసాదమని జరిగిన విషయము నంతటిని వెంకన్న పంతులు శ్రీ తీర్థుల వారికి విన్నవించు కొనెను. గురు దేవుని
పరివార సహితముగ తనగృహమునకు దయ చేయుమని వెంకన్న ప్రార్థింపగా స్వామి వారు అంగీకరించి వెంకన్న గృహమును పావన మొనరించిరి.
శ్రీతీర్థులవారు వెంకన్నకు అతిథియై ఆయనగృహ ప్రాంగణములో నిత్యారాధ నలకేర్పాట్లు చేయవలసి నదిగ శిష్యులనాజ్ఞాపించిరి. పీఠాధిపతియైన సన్యాసి ప్రతినిత్యము భగవదారా ధన మొదలగునవి విధిగ నిర్వర్తింపవలెను. వెంకన్న పంతులు శ్రీ తీర్థులవారికి అనన్యశిష్యుడై తనహోదా నుసైతము మఱచి సామాన్య భక్తునివలె గురు కార్యములందు నిమగ్ను డయ్యెను.
వెంకన్న పంతులు ప్రతిదినము సత్సంగమున కేర్పాట్లుచేసి ప్రజలందఱిని పాల్గొనవలసినదిగ ఆహ్వా నించెను. దూర ప్రాంతము లనుండి అరుదెంచు భక్తులకు, స్థానికముగ పాల్గొను ప్రజలకు ఉచితముగ ఆహారవ్యవస్థ నొనరించెను. విశాలమైన చలువపందిళ్ళను నిర్మించి ఒక సమున్నత వేదిక పై పీఠమును మూలవిగ్రహ ములను విరాజిల్ల చేసెను.
శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి ప్రతినిత్యము ఆశ్రమ మూల దైవములకు స్వయముగ పూజల నొనరించెడివారు. ఆ దృశ్యము చూపరుల కత్యంత ఆహ్లాదకరము, సకలపాప వినాశకము, భగవద్భక్తి ప్రదాయకమునై యుండెను. ఈ మహోత్సవమును గాంచు టకు ప్రజలు అసంఖ్యాక ముగ వచ్చెడి వారు. ఈ యారాధనా మహోత్సవ ములో శ్రీమూలరామా రాధన మత్యంత యుత్కృష్టముగ నుండెను. శ్రీ మూల రామస్వామి తేత్రాయుగములో శ్రీ రామ చంద్రమూర్తి నుండి ఆవిర్భవించెను. ఈపావన చరితము సకల భవభయహరము నిర్మల భక్తి జ్ఞాన వైరాగ్యప్రదము.
శ్రీ మూలరామ చరితము:
అది సత్యయుగము. సనక సనందనాదులచే శపింప బడి జయవిజయులను పార్షదులు వైకుంఠము నుండి దిగివచ్చి అవనిపై జన్మించిరి. విరోధభావ ముతో మూడుజన్మలలోనే నన్ను జేరగలరని శ్రీ హరి జయవిజయులకు అభయ మొసంగెను. వారే మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులైరి. శంఖు కర్ణుడను శ్రీహరిపార్షదుడు "బ్రహ్మ దేవుని ఆదేశాను సారముగ అవనిపై హిరణ్యకశిపుని కుమారు డైన ప్రహ్లాదునిగ అవత రించెను.
హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు భేదమనెడు ఆరాధన ద్వారమున భగవంతునిచే నిహతులై త్రేతాయుగములో రావణ కుంభకర్ణులుగ జన్మించిరి. ప్రహ్లాదుడు శ్రీలక్ష్మీనృసింహ స్వామి కృపకు పాత్రుడై సకల భువనములకు చక్రవర్తి అయ్యెను. హిరణ్యకశిపుని వధానంత రము శ్రీఉగ్రనారసింహ స్వరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుని సింహాసన ము నధిష్ఠించి దానిని పవిత్రమొనరించి బాల ప్రహ్లాదుని సకల సామ్రాజ్య అధినేతగ నభిషేకించెను, చక్రవర్తి ప్రహ్లాదుడు రాజోచితములైన యజ్ఞ యాగాది కర్మల నొనరించి అఖండపుణ్యమును సముపార్జించెను.
పుణ్యముకూడ జీవునకు మరల జన్మను సంప్రా ప్తింపజేయును. కావున తన పుణ్యవశమున పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు రావణ కుంభ కర్ణులకు తమ్ముడై జన్మించి విభీషణుడను నామధేయ మున ప్రసిద్ధిగాంచెను.
భకులకు తానొసంగిన వరములను నెరవేర్చుటకై ఆ శ్రీమన్నారాయణుడే రావణ కుంభకర్ణాదులను అనుగ్రహించుటకు అవనిపై దశరథరాజ నందనుడన బడు శ్రీరామచంద్రునిగ అవతరించెను, శ్రీరామ కథామృతమును గ్రోలని వారు పవిత్ర భారత వర్షములో ఉన్నారనుట కేవలము విడంబనమే అగును.
రావణ వధానంతరము శ్రీరామభద్రుడు సీతా లక్ష్మణ సహితుడై సకలవానర పరివారముతో విభీషణుడు వెంటరాగా అయోధ్యా నగరమును జేరెను. పదునాల్గు సంవత్సరములు శ్రీరామ వియోగమును అనుభవిం చిన అయోధ్యా వాసులు పరమానంద భరితులై మహోత్సవముల నొన రించిరి. శ్రీరామ పట్టాభి షేకమును ప్రజలు పరమానందభరితులై తిలకించిరి. మహోత్సవ అనంతరము లంకాధిపతి యైన విభీషణుడు రామ
భద్రుని కళ్యాణమూర్తిని గాంచి లంకానగరమునకు మరలిపోలేక స్వామి చరణారవిందముల చెంతనే జీవితమును గడుపవలెనని సంకల్పించు కొనెను. శ్రీరాముడు “ప్రజలను పరిపాలించుట కర్తవ్యము కావున లంకా నగరమునకు బయలు దేర” మని విభీషణు నాదేశించెను. అపుడు విభీషణుడు “కళ్యాణ గుణాభిరామా! నీదివ్య మంగళ విగ్రహమును గాంచనిదే, ఆరాధింపనిదే ఒక్కక్షణమైనను నేను జీవింపజాలను, నన్ను అనుగ్రహింపు" మని శ్రీరామచంద్రుని అనేక విధముల ప్రార్థించి ఆయన దివ్య చరణారవిందముల నాశ్రయించెను. ఆ పరమ భక్తునకు గల భగవత్ప్రేమ నుగాంచి సకలవానరులు, అయోధ్యప్రజలు ఆభాగవ తోత్తముని వివిధ రీతుల ప్రశంసించిరి.
భక్తవత్సలుడు, భక్తా ధీనుడు, దయాసాగరుడు, సకలకళ్యాణ గుణాభి రాముడు, పరబ్రహ్మము, పరమాత్మ, పరంధాముడు, భగవంతుడునైన శ్రీరామ చంద్రమూర్తి అనన్య భక్తుడైన విభీషణు ననుగ్రహించుటకై ఆత్మ శక్తిచే తననుండి శ్రీమూల రామవిగ్రహమును ప్రాదుర్భవింపజేసెను. ఆ దివ్యవిగ్రహము పరిపూర్ణ తముడైన భగవంతుని అర్చావిగ్రహము.
సభాసదులందరూ ఈ దృశ్యమును గాంచినవారై పరమానంద భరితులై అశ్రుపూర్ణ లోచనములతో గద్గదకంఠముతో పులకాం కితగాత్రులై భగవంతుని అనేకవిధముల స్తుతించిరి. విభీషణుడు బాహ్య జ్ఞాన మును విస్మరించి శ్రీరామ నామము నుచ్ఛరించుచు సభామధ్యమున నృత్య మొనరించెను. శ్రీరామ చంద్రుడు తనపాదముల నాశ్రయించిన విభీషణుని శిరముపై మంగళకరము, అభయప్రదమునగు తన దక్షిణ హస్తము నుంచి యిట్లుపల్కెను. "రాక్షసేశ్వరా! మద్భక్తాగ్ర గణ్యా! నీయనన్య భక్త్యా రాధనలకు నేనత్యంత సంతుష్టుడనైతిని. నా స్వరూపమే యైన ఈమూలరామమూర్తిని నీ కొసంగుచున్నాను. నా యారాధనలో చరితార్థు డవుగమ్ము". ఇట్లనుగ్ర హించి శ్రీరామభద్రుడు తన అర్చావిగ్రహమును విభీ షణున కొసంగెను. అపుడాకాశమున సకల దేవతలు ఆ శ్రీ విగ్రహ మును దర్శించుటకు సమావేశమైరి. కుసుమ వృష్టిని గావించి, ఆనక దుందుభులను మ్రోగించు చు దేవతలు శ్రీరామనామ సంకీర్తన మొనరించిరి. బ్రహ్మ గగనము నుండి భూమిపైకిదిగి స్వయముగ శ్రీమూలరామ మూర్తిని సభా మధ్యములో ఆరాధించెను. తన కమండలము లోని దివ్య మందాకినీ జలముతో శ్రీ మూల రామమూర్తి చరణార విందములను ప్రక్షాళనము చేసెను.
శ్రీరామభద్రు ననేక విధము ల స్తుతించి బ్రహ్మ తన లోకమునకు వెడలి పోయెను.
విభీషణుడు శ్రీమూల రామమూర్తి విగ్రహమును శిరముపై నుంచుకొని ఆత్మతృప్తి నొందినవాడై రామనామమును కీర్తించు చు శ్రీరామాజ్ఞచే సకలపరి వారముతో లంకానగరము జేరెను. ప్రప్రథమమున బ్రహ్మ దేవుడారాధించిన ఆ శ్రీమూలరామ విగ్రహము ను భక్తాగ్రేసరుడైన విభీషణుడారాధించెను. అయినను విభీషణునకు తృప్తి కలుగలేదు. కోట్లకొలది జన్మలనిచ్చినచో నేను శ్రీమూలరామ మూర్తిని తనివిదీర ఆరాధింపగలను గదా యని విభీషణుడు సతతము సంకల్పిం చెడివాడు. ఈవిభీషణుడే సత్యయుగములోని ఆ ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడే శ్రీహరి పార్షదుడైన శంఖుకర్ణుడు.
విభీషణ సార్వభౌముడు కూడ రాజోచితములైన యజ్ఞ యాగాదులు జేసి అనంతములైన పుణ్యము లను సముపార్జించెను. పాప పుణ్యములు, సంకల్పములు జీవునకు మఱలజన్మను ప్రసాదిం చును. శ్రీమూలరామా రాధన మొనరించవలె ననెడి ప్రగాఢకాంక్షచే విభీషణుడు ద్వాపర యుగములో నేటి ఒరిస్సా
ప్రాంతమునకు ప్రభువైన బాహ్లికునిగ జన్మించెను. బాహ్లికుని పూర్వజులు లంకా రాజ్యమును జయించి అచట విరాజిల్లి యున్న శ్రీ మూలరామ విగ్రహమును తమరాజ ధానికి సకల మర్యాదలతో తోడ్కొనివచ్చి ఆరాధింప నారంభించిరి. కావుననే విభీషణుడు ఆ వంశము లో శ్రీమూలరామవిగ్రహము
నారాధించుటకు జన్మిం చెను.
శ్రీ గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
14 వ భాగము
సమాప్తము. **
🎾🎾🎾🎾🎾🎾