బాహ్లిక చక్రవర్తికూడ జీవితమంతయు శ్రీ మూల రామవిగ్రహము నారాధిం చుచు రాజోచితములైన యజ్ఞ యాగాదుల ద్వారా అపారమైన పుణ్యమును సముపార్జించెను. శ్రీమూల రామారాధనమున తనివి దీరక బాహ్లిక చక్రవర్తి మరల కలియుగములో శ్రీవ్యాసరాయలుగ జన్మించెను.
బాహ్లికుని వంశజులు శ్రీమూలరామమూర్తిని శ్రీ వ్యాసరాయలవారి గురు పరంపరలోని వారైన శ్రీ నరహరితీర్థుల కొసంగిరి. బాహ్లికవంశజులనే 'గజ పతు'లందురు. గజపతి వంశజులు శ్రీమూలరామ మూర్తిని ఆరాధించు చుండెడివారు. ఆ వంశము లో ఒక రాజు మరణిం చెను. వాని యేకైకపుత్రుడు చిరుతప్రాయము వాడు. సింహాసనాధి కారము పొందుటకు 12 సంవత్స రములు ఆగవలెను. అపుడు సచివులు రాజ్య సంచాలకుని యెన్నిక కొఱకు భద్రగజమును -పుష్పమాలతో విడచిరి.
శ్రీ నరహరితీర్థులు ఒక సరోవరము చెంత భగవదా రాధనమందు నిమగ్నులై యుండగ ఈభద్రగజము ఆమహత్ముని పుష్పమాలా లంకృతునిగ నొనరించెను. శ్రీనరహరితీర్థులు రాజ్య సంరక్షణార్థమై రాజప్రతి నిధి పదవి నలంకరించి పండ్రెండు సంవత్సర ములు ధర్మపాలన మొన రించెను. రాజాంతః పురమునందున్న శ్రీ మూల రామవిగ్రహమును ఆ యతీశ్వరుడారాధించి చరితార్థుడయ్యెను. యుక్తవయస్కుడైన రాజ కుమారునకు పట్టాభిషేక మొనరించి నిజాశ్రమము నకు బయలు దేరెను.
ఆ గజపతిరాజు శ్రీ మూల రామవిగ్రహమును శ్రీనర హరి తీర్ధులవారి కొసంగి నిత్యారాధన మొనరింప వలసినదిగా ప్రార్థించెను. శ్రీనరహరితీర్థులు తమ జీవితమంతయు శ్రీరామ చంద్రుని సేవ కర్పించెను. ఆ గురు పరంపరలోని వారే శ్రీ వ్యాసరాయల వారు. శ్రీ వ్యాసరాయల వారు శ్రీమూలరామ విగ్రహ మును జీవితాంతము ఆరాధించి తృప్తినొందక మరల శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామిగా జన్మించెను. శ్రీహరి పార్షదుడైన శంఖు కర్ణుడే ప్రహ్లాదుడై, విభీష ణుడై, బాహ్లికుడై, శ్రీవ్యాసరాయలై తుదకు శ్రీరాఘవేంద్ర స్వామిగ నవతరించి మూలరామ విగ్రహము నారాధించు చుండెను. ఎన్నిజన్మలు భగవదారాధన చేసినను భక్తులకు తనివిదీరునా? సాలోక్య సారూప్యాది మోక్షముల నభిలషింపరు. బ్రహ్మేంద్రాది పదముల నాకాంక్షింపరు, ఐశ్వర్యాల ను ముట్టరు. ఏజన్మ మైనను ఎన్ని జన్మలైనను భగవంతునకు అనన్య భక్తులై ఆయన దివ్య చరణారవిందములనే ఆరా ధింపవలెనని ఆకాంక్షిం తురు.
శ్రీరాఘవేంద్రస్వామి పరమ గురువులైన శ్రీమధ్వాచా ర్యులు, వారి శిష్యులైన శ్రీనరహరితీర్థులు, శ్రీ వ్యాస రాయతీర్థులు మొదలగు వారందరు శ్రీమూలరాము ని ఆరాధించి చరితార్ధు లైరి. శ్రీమూలరామ విగ్రహ మును విభుదేంద్ర తీర్థుల వారు ఆరాధించిరి. శ్రీసుధేంద్రతీర్థులు మొద లగు వారారాధించిరి. ఇపుడు శ్రీరాఘవేంద్ర తీర్థులు ఆరాధించు చున్నారు.
శ్రీ వ్యాస ముష్టికలు:
శ్రీమధ్వాచార్యులు వ్యాస భగవానుని అనన్యభక్తితో నారాధించిరి. శ్రీకృష్ణ ద్వైపాయనుడు శ్రీ మధ్వా చార్యునకు ప్రత్యక్షమై తనస్వరూపము లైన పంచముష్టికల నొసంగెను. ఆ అయిదు ముష్టికలు నాసంపూర్ణ సన్నిధానము లేనని శ్రీ వేదవ్యాసుడు వచించెను. ఈ ఐదు వ్యాసముష్టికలలో ఒక ముష్టిక శ్రీ రాఘవేంద్ర స్వామిచే ఆరాధింపబడు చుండెను. రెండవముష్టిక శ్రీవ్యాసరాయల వారి మఠములో విరాజిల్లెను. మూడవముష్టిక సోదెమఠ మందు ఉండెను. నాల్గవ ముష్టిక శ్రీబదరికాశ్రమ ములో కలదు. ఐదవ ముష్టిక దివ్యబృందావన మందుండెను. ఈనాల్గవ ముష్టిక, ఐదవముష్టికలు మాత్రము అదృశ్యరూప మున విరాజిల్లియున్నవి. ఈమూర్తులేకాక మరి యెన్నియో దేవతా మూర్తులు శ్రీరాఘవేంద్ర స్వామిచే ఆరాధింపబడు చున్నవి. శ్రీరాఘవేంద్ర స్వామి ఏకాగ్రచిత్తముతో తారతమ్యములను పాటిం చుచు సకలదేవతామూర్తు లను ఆరాధింతురు. ఆ మహామహుని యోగబల ముచే సకల దేవతలు శ్రీతీర్థులవారికి సాక్షాత్క రించెదరు. సకలదేవతలను ప్రత్యక్షముగ దర్శించి, ఆరాధించి నివేదన మొన రించుటయే శ్రీరాఘ వేంద్ర తీర్థస్వామి యొక్క నిత్య కృత్యము. వారెచ్చటను న్నను మఠములో పరం పరాగతముగ ఆరాధింపబ డుతున్న ఈమూర్తులన్ని యు అచటనే యుండవల యును. కావున సకల దేవతా మూర్తులను ప్రతి నిత్యము దివ్యారాధన చేయుదురు.
సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి సకలపరివార సహితముగ దక్షిణముగ పయనించుచు ఆదోనిజేరి ఆరాజ్యమునకు మంత్రియైన దివాన్ వెంకన్నపంతులు గృహము నందు విడిది చేసిరి. తన యనుంగు శిష్యుని ప్రార్థన లను మన్నించి కొంత కాలము పరివార సహిత ముగ ఆతిధ్యమును స్వీకరించుటకు శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామివారంగీక రించిరి.
శ్రీ నరహరి తీర్థులు:
శ్రీ మూలరామచరితము బ్రహ్మదేవునినుండి ఆరంభ మైనది. సృష్ట్యాదిలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవు డు విశ్వకర్మచే ఆగమ శాస్త్రానుసారముగ శ్రీ మూల సీతారామమూర్తు లను నిర్మాణమొనరింప జేసెను. ఆ దివ్యమూర్తు లను బ్రహ్మ నిత్యము ఆరాధించుచుండెను. వైవ స్వత మన్వంతరము లో మనుచక్రవర్తి భక్త్యారాధన లకు సంతసించి సృష్టికర్త యీ మూలరామ విగ్రహ ములను మనువున కొసంగెను. మనువు సూర్యదేవున కొసంగెను. నాటినుండి సూర్య వంశ చక్రవర్తులు శ్రీమూల రామా రాధన మొనరించుచుం డిరి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు మానవ కళ్యాణార్థమై ప్రతికల్పమం దును అవతరించుచుం డును. శ్రీరామావతార ములు అసంఖ్యాకములు.
శ్రీరామచంద్రుడే యీశ్రీరామ మూర్తిని ఆరాధించెను. దాశరథి పట్టాభిషేకానం తరము దిగ్విజయ మొనరించుటకు సంకల్పిం చెను. శ్రీరామ వియోగము ను భరింపలేని సీతా సాధ్వి తానుకూడ వెంట వచ్చెదనని ప్రార్థించెను. అపుడు శ్రీరాఘవేంద్రుడు తనచే ఆరాధింపబడు చున్న మూలరామ మూర్తిని తనస్వరూపముగ పేర్కొని సీతాదేవి కొసంగెను. సీతాదేవి సంతుష్టురాలై శ్రీరామ చంద్రుని ప్రతిరూపమైన శ్రీ మూల రామమూర్తిని ఆరాధింపదొడంగెను.
శ్రీరామావతారము కంటే పూర్వమునుండి పరంపరా గతముగనున్న అర్చవిగ్ర హము కావున యీ మూర్తి ని శ్రీమూలరామమూర్తి యని సీతా దేవియే స్వయముగ నామకరణ మొనరించెను. పరిచయ సౌలభ్యమునకై ఆమె మూర్తిని మూలరామ మూర్తియని వ్యవహ రించెను.
సీతాదేవి లక్ష్మణుడొనరిం చిన సేవకు ప్రసన్నురాలై శ్రీమూల సీతారామ విగ్రహ ములను ఆరాధనార్ధమై ప్రసాదించెను. లక్ష్మణుడు స్వామినారాధించి 'సౌభరి’ మహర్షి కొసంగెను. ఆ మౌనివర్యుడు ఈమూల మూర్తులకు నిజమైన ఆరాధకుడు శ్రీ ఆంజనేయు డే యని గ్రహించి మూల సీతారాముల విగ్రహము
లను పవనాత్మజునకొసంగి చరితార్థుడు అయ్యెను. శ్రీ ఆంజనేయస్వామి ఆదివ్య రూపముల నారాధింప నారంభించెను. యుగము మారెను.
ద్వాపరయుగము ఆరంభ మయ్యెను. ద్వాపర యుగ ములో శ్రీకృష్ణపరమాత్మ గోలోకమునుండి వచ్చి అనేక దివ్య లీలలనొన రించెను. ఆయన దివ్యాను గ్రహమునకు పాత్రులైన వారే పాండవులు. పాండవ ద్వితీయుడైన భీమసేనుడు వాయుదేవుని అవతార ము. పాండవులు వనవాస మొనరించు సమయమున పాండవ మధ్యముడైన అర్జునుడు శివానుగ్రహము కొఱకై తపమాచరించుటకు వెడలి పోయెను.
పాండవులు గంధమాదన పర్వత ప్రాంతమున భ్రమించు చుండిరి. ఒక శుభదినమున ద్రౌపదితో కలసి భీమసేనుడు రమ్యమగు ఆ పర్వత ప్రాంతమున చరించుచుం డెను. ఆకసమునుండి ఒకదివ్యపుష్పము ద్రౌపది యొడిలోపడెను. దాని సుగంధము అద్భుతము. ఆ సౌగంధికా పుష్పము లను భగవదారాధనా నిమిత్తమై తీసికొని రావల సినదిగ ద్రౌపది భీమసేను నర్థించెను. ఆ వాయు పుత్రుడు ఆప్రసూన మేతెం చిన దిక్కుగబయలు దేరెను. మార్గములో ఒక వృద్ధవానరము తన వాలమును మార్గమున కడ్డముగ నుంచి పరుం డెను. మానవుడు వానర వాలమును దాటుట ధర్మముకాదు. అందువలన భీమసేనుడు వాలమును తొలగింప వలసినదిగ వానరము నాదేశించెను. అందులకా వానరము తాను వృద్ధుడనని, తొలగ లేనని వాలమును తొలగిం చుకొని పోవలసినదని పలికెను. భీమసేనుడా వాలమును తొలగించు టకు ప్రయత్నము చేసి విఫలుడయ్యెను. తన నాగాయత బలముపై నెంతయో గర్వముగల భీమసేనుని అభిమానము భంగ మయ్యెను. ఈ వానరము సామాన్యమై నది కాదనియు, ఎవరో మహాపురుషుడై యుండ వచ్చుననియు భావించి భీమసేనుడు అనేకవిధ ముల స్తుతించెను. అపుడు ఆవృద్ధ వానరము అంతర్థానమై శ్రీ ఆంజనేయ స్వామిగ సాక్షాత్కరించెను.
శ్రీవాయు పుత్రులిరువురు పరస్పరము ఆలింగన మొనరించుకొనిరి. భీమ సేనుడు శ్రీ ఆంజనేయుని విశ్వరూపమును సంద ర్శించి ధన్యుడయ్యెను. తనసోదరుని ఉద్ధరించు టకు సంకల్పించుకొని ఆంజనేయుడు శ్రీ మూల సీతారామ మూర్తులను భీమసేనున కొసంగెను. భీమసేనుడు ఆదివ్య మూర్తుల నారాధించెను.
పాండవులందఱు ఈ యర్చ విగ్రహములను పూజించిరి. శ్రీ రామాను గ్రహమునకు పాత్రులై కురుక్షేత్ర సంగ్రామములో విజయమును పొంది చక్రవర్తులైరి. ఆకాలములో శంఖుకర్ణుడు కళింగ దేశాధీ శ్వరుడైన బాహ్లికునిగా అవతరించెను. పాండవుల యనుగ్రహమునకు పాత్రు డైన యీచక్రవర్తి శ్రీరామ చంద్రునకు అనన్యభక్తుడు. పాండవులనుండి శ్రీమూల రామవిగ్రహములను బాహ్లి క చక్రవర్తి పొంది ఆరాధింప నారంభించెను.
బాహ్లికచక్రవర్తి వంశము వారలను గజపతులం దురు. వీరిది కళింగ రాజ్యము, అనగా ఒరిస్సా ప్రాంతము.
శ్రీవాయుదేవుని యవతార మైన మధ్వాచార్యులు 13వ శతాబ్ధములో కళింగ రాజ్యమునకు వేంచేసెను. కళింగ రాజ్య ములో శ్యామశాస్త్రి యను మహాపండితుడు కలడు. వీరి జన్మస్థలము గంజాం జిల్లాలోని చికాకోలు నగరము. తండ్రి నరసింహ భట్టారకుడు. అనంగభీమ రాజాస్థానములో మంత్రిగ నుండెను. ఈయనకు ఇరువురు కుమారులు కలరు. వారు ఇద్దరూ మహా విద్వాంసులేకాదు రణరంగధీరులు, రాజకీయ చతురులు. వారిలో ఒక్కరే యీ శ్యామశాస్త్రులు. శ్రీ మద్ధ్వాచార్యులతో శాస్త్రి పరాజితుడయ్యెను.
శాస్త్రచర్చ యొనరించి శ్యామశాస్త్రి శ్రీమద్ధ్వా చార్యులకు శిష్యుడై సన్యాసాశ్రమమును స్వీక రించెను. నాటి నుండి శ్రీ నరహరితీర్ణులను పేర ప్రఖ్యాతిని గాంచెను. శ్రీ నరహరితీర్థులు కూడ శ్రీమద్వాచార్యులతో గలసి బయలుదేరుటకు సంసిద్ధు డయ్యెను. శ్రీ వాయు దేవునియవతారమైన శ్రీ మద్ధ్వాచార్యులకు శ్రీ మూలసీతారామమూర్తులు గజపతిరాజుల భాండా గారములో వేంచేసి యున్నవని తెలియును. కావున ఆయన శ్రీ నరహరి తీర్థులను అచ్చోటనే యుండి సమయ మాసన్న మైనపుడు మూలసీతా రామ మూర్తులను గజపతి రాజుల నుండి స్వీకరింప వలసినదిగా ఆదేశించెను.
గురుదేవుని ఆదేశాను సారముగ నరహరితీర్థులు గజపతుల రాజధానిలో నుండి సమయముకొఱకై నిరీక్షించుచుండెను. కళింగ దేశపురాజు యౌవన కాలమందే మరణించెను. వాని కుమారుడు బాలుడు. రాజ్యాధి కారమునకు ఇంకను పండ్రెండ్రు సంవత్సర ములు ఆగవలయును. మంత్రులు, సేనాధిపతులు వివాదపడసాగిరి. రాజ్య ము అరాచకమయ్యెను.
అధికారముకొఱకై రాజ్య నిర్వహణ భార మెవరికి అప్పగింత వలెననెడి సమస్య రాణిని బాధింప దొడంగెను. చివరకు వృద్ధులగు మంత్రులు ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చిరి. భద్రగజము నలంకరించి దానితొండము నకు శ్రీజగన్నాధ స్వామి కర్పించియున్న పుష్పహార మును తెచ్చి అందించిరి. ఆగజమును పట్టణములో ఊరేగించిరి. ఆసమయ ములో శ్రీ జగన్నాధస్వామి ని దర్శించి దేవాలయము నుండి వెలుపలకు వచ్చుచున్న శ్రీ నరహరి తీర్థుల మెడలో ఆ ఏనుగు పుష్పమాల నలంకరించి ముందు కాళ్ళను వంచి తొండము నెత్తి నమస్కరిం చెను. శ్రీనరహరితీర్థులను రాజప్రతినిధిగ అభిషే కించిరి.
జై గురుదేవ దత్త
****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
15 వ భాగము
సమాప్తము **
🎾🎾🎾🎾🎾🎾
🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః 🙏