పండ్రెండు సంవత్సర ములు రాజ్యపాలన మొనరించి శ్రీ నరసింహ తీర్థులు కళింగ రాజ్యము ను భూలోక స్వర్గము వలె తీర్చిదిద్దిరి. రాజకుమారుని సింహాసనాధీశునిగ నొన రించి తీర్థులు శ్రీ మధ్వా చార్యుల చెంతకు పోవు టకు సంసిద్ధు డయ్యెను. అపుడు రాజకుటుంబము హస్తములను ముకుళించి నమస్కరించుచు స్వామీ! తమరు మానుండియేదైనా కానుకగ స్వీకరింపవలయు నని ప్రార్థించిరి. అందులకు శ్రీనరహరితీర్థులు రాజా! సర్వసంగ పరిత్యాగుల మగుమాకు ధనకనకవస్తు వాహనములందు మోహ ము లేదు. మీభాండా గారములో పూజారాధన లు లేక యున్న శ్రీ సీతా రామ విగ్రహములను నాకు ఇచ్చినచో నేనారాధించు కొనెదనని పల్కెను. అందులకు కళింగరాజు సంతోషముతో అంగీకరించి ఆ విగ్రహములను తీర్థుల కర్పించి నమస్కరించెను.
శ్రీ సీతారామవిగ్రహము లను తీసికొని శ్రీ నరహరి తీర్థులు శ్రీ మద్ధ్వాచార్యు లను జేరుటకు వేగముగ పయనించుచు సింహాచలం క్షేత్రమునుచేరెను. శ్రీసీతా రామ విగ్రహములు కళింగ రాజ్యపు సరిహద్దులను దాటగనే రాజధానిలో అనేక ఉత్పాతములు సంభవించెను. రాజాంతః పురమునకు నిప్పు అంటు కొనెను.
ఆ సమయమున వయో వృద్ధులు మహత్ములు శ్రీసీతారాముల విగ్రహము ల మహిమను తెలియ జెప్పి ఆమూర్తులు మన రాజధానినుండి వెడలుట యే యీ ఉత్పాతము నకు కారణమని చెప్పిరి. ఆ సమాచారము విన్న వెంటనే కళింగ రాజు ప్రతిమలను తిరిగి తీసుకొని రావలసినదిగ భటులను పంపెను. తన్ననుసరించి వచ్చిన రాజభటులను చూచి తీర్థులు శ్రీ సీతారాములు ఉన్న పెట్టెను వారి ముందు ఉంచి మీకు సాధ్యమైన యెడల తీసికొనిపొమ్మని పల్కెను. వారెంత ప్రయత్న ము చేసినను ఆ మూర్తులు కించిన్మాత్ర మైనను కదల లేదు. వారు హతాశులై వెడలిపోయిరి. నరహరితీర్థులు అచటి నుండి బయలుదేరి శ్రీ సీతారాముల ప్రతిమలను తీసికొని ఉడిపి చేరెను.
శ్రీమద్ధ్వాచార్యులు అవత రించిన కార్యము సంపన్న మయ్యెను. ఆదిగురువైన వేదవ్యాసుని దర్శనమునకై వారు బదరి కాశ్రమము నకు వెళ్ళుటకు నిశ్చయిం చు కొనిరి. శ్రీమూల సీతారాముల కొఱకై ఆయన ఎదురుచూచు చుండెను. పూర్వము ఆయన శ్రీఆంజనేయావ తారమందు, భీమావతార మందు తానుభక్తితో ఆరాధించియున్న శ్రీ మూల సీతారామ చంద్రులను ఈ అవతారమందు కూడ పూజింపవలెనని ఆయన హృదయము వేగిరపడు చుండెను. అందువలన ఆయన శ్రీనరహరితీర్థుల రాకకొఱకు ఎదురుచూచు చుండెను.
కార్తీక శుద్ధ ద్వాదశి సంధ్యాకాలమున శ్రీనర హరితీర్థులు శ్రీ మూల సీతారామ విగ్రహములను తెచ్చి గురుదేవుల కర్పించి
సాష్టాంగదండ ప్రణామము లొనర్చెను. శ్రీమద్ధ్వాచార్యు లు అత్యంత ప్రసన్నులై నరహరితీర్థులను ఆలింగ నము చేసుకొని గౌర వించెను.
శ్రీనుద్ధ్వాచార్యులు మధ్వ సరోవరములో స్నానమాచ రించి బ్రహ్మచే ఆరాధించ బడిన శ్రీమూల సీతా రామ విగ్రహములను శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహమునకు ప్రక్కనుంచి తనివితీర పూజించి చరితార్థుడు అయ్యెను. తదనంతరము ఈ మూల మూర్తులను పరంపరాగతముగ అవిచ్ఛి న్నముగ ఆరాధింపవలెనని ఆదేశించి శ్రీ పద్మనాభ తీర్థులకు ఒసంగిరి.
నాటినుండి పరంపరాగత ముగ శ్రీమూలసీతారామ విగ్రహములు శ్రీమద్ధ్వా చార్యుల శిష్యులచే ఆరాధిం బడుచుండెను. ఆ మూల మూర్తులనే శ్రీ రాఘవేంద్రస్వామి తనివి తీర ఆరాధించిరి.
వీరి కాలములోనే శంఖు కర్ణుడు వ్యాసరాయునిగా అవతరించెను. వ్యాస రాయస్వామికూడ మధ్వా చార్య సాంప్రదాయములో ని యతీశ్వరులే.
అసదుల్లాఖానుని గర్వభంగము:
శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి చేయు శ్రీ మూల రామార్చనము అత్యంత సుందరముగ దర్శనీయ ముగ నుండును. ఆ ఆరాధనా క్రమమును గాంచినవారు బ్రహ్మానంద మనుభవింపగలరు. భగ వంతుని పొడశోపచార ముల ద్వారా ఆరాధించి సకల దేవతా పూజల నొనరించి అనంతరము భగవంతుని దివ్య చరణా మృతమును (తీర్థమును) భక్తుల కొసంగెదరు. తదనంతరము మహా నైవేద్యము నొసంగెదరు. సంతర్పణానంతరము సాయంత్రము కూడ భగవదారాధన, సత్సంగ ము యధావిధిగ జరుప బడును. శ్రీతీర్థులవారు మంత్రాక్షతలను భక్తుల కొసగి అనుగ్రహించెదరు.
శ్రీ వెంకన్న పంతులు సజ్జనుడు. తాను తరించుటయేకాక సకల మానవాళి భగవదనుగ్రహ మునకు పాత్రము కావల యునని అభిలషించెడి వాడు. శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామిని సేవించుచు తనను చరితార్ధునిగ నెంచుకొనెను.
తనకు అమాత్యపదవి నొసగి గౌరవించిన ఆదోని రాజ్యాధినేత అసదుల్లా ఖాన్ కూడ తనగురు దేవుని అనుగ్రహము నకు పాత్రుడు కావలయు నని సంకల్పించి వెంకన్న పంతులు నవాబు గారి మహలును జేరి అసదుల్లా ఖానుని దర్శించి యిట్లు బలెను. జహాపనా! మాగురు దేవులు మన రాజధాని కేతెంచి మాగృహములో విరాజిల్లి యున్నారు. ఆయన మహత్ముడు. భగవద్భ క్తుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, దర్శనమాత్ర ముననే సకలపాపములను నశింపజేయగల దివ్య మూర్తి. మీరు సపరివార ముగ నేతెంచి ఆ మహా త్ముని దర్శింప వలసినదిగ ప్రార్ధించు చున్నాను.
అపుడు అసదుల్లాఖాన్ 'దివాన్ జీ! అలాగుననా! రేపుతప్పక నేను ఆ పైగంబరుని దర్శింప వలయును. రేపు సూర్యాస్తయయ సమయ ములోపల స్వయముగ నేను మీ గృహమున కేతెంచి నీగురు దేవుని దర్శింపగల' ననిపల్కెను.
అసదుల్లాఖానుని సమా ధానము నాలకించి వెంకన్న పంతులు పరమా నందభరితుడై గృహమును జేరి నవాబు మరునాడు తమదర్శనార్ధమై రాగల డని గురుదేవులకు విన్న
వించెను.
అసదుల్లాఖాన్ సహజ ముగ మంచిహృదయము కలవాడే. కాని హిందువుల యెడలగల వైరభావమును విస్మరింప లేకపోయెను. స్వామిని పరీక్షింపవలెనని సంకల్పించు కొనెను. తానే రాజ్యాధినేత ననియు సామాన్యులైన సన్న్యాసు లను విశేషముగ గౌరవింప పనిలేదనియు, దివాను కోరికను దీర్చుటకే అచటికి వెడలి ఆ సన్న్యాసిని అవహేళన మొనరింప వలెనని దురాలోచన చేసెను. మరునాడు సకలపరివారముగ శ్రీరాఘ వేంద్రతీర్థస్వామిని దర్శిం చుటకు అసదుల్లాఖాన్ బయలు దేరెను. ఒక బంగరు పళ్ళెరములో మాంసమునుంచి దానిపై ముఖమల్ వస్త్రమును గప్పి శ్రీ స్వామివారికి కానుకగ దీసుకొని బయలు దేరెను.
నవాబుగారే శ్రీ రాఘ వేంద్రస్వామివారిని దర్శిం చుటకు బయలు దేరుచున్నారని తెలిసికొని అసంఖ్యాకముగ ప్రజలం దరు వెంకన్న గృహ ప్రాంగణమునకు జేరు కొనిరి. గృహమును సర్వాంగ సుందరముగ నలంకరించిరి. భగవదా రాధన జరుగు ప్రదేశము లో శ్రీతీర్థులవారి ఆసనము న కెదురుగా నవాబుగారి కొఱకై ఒక ఉచితాసనము నేర్పరచిరి. సాయంకాల సమయములో ఆరాధనను తిలకించుటకు పరివార
సమేతముగ బంగారు పళ్ళెరములో విచిత్ర కానుక (మాంసము) నిడుకొని అసదుల్లాఖాన్ అఱుదెంచెను. వెంకన్న పంతులు స్వాగతము బల్కుచుండగ ఖాను ఆప్రదేశమున కేతించి శ్రీవారికి అనేక సలాము లొనరించి ఆ బంగారు పళ్ళెరములోని పదార్ధము లను భగవంతునకు నివేదింప వలసినదిగా ప్రార్ధించెను. పళ్ళెరము లోని మాంస ఖండములపై ముఖమల్ వస్త్రము కప్పి యున్నదిగాన యెవడును ఖాన్ యొనరించిన ఈ దుష్కృత్యమును గమ నింపరైరి. కాని సర్వజ్ఞులైన శ్రీరాఘవేంద్రస్వామి సర్వము గ్రహించినవారై చిరునవ్వుతో ఖాన్ ను ఆశీర్వదించి ఆసనము నలంకరింప వలసినదిగ ఆజ్ఞాపించిరి. అసదుల్లా ఖాన్ తన దుష్కృత్యము సఫలీకృత మైనదని సన్యాసి సామాన్యుడే యని భావించి తన రాజసమును ప్రదర్శించు
చు ఆసనము నలంక రించెను. ఈమాంస ఖండములను భగవంతు నకు నివేదించి సకల ప్రజామధ్యమున ఈ సన్యాసి అపహాస్యము పాలుకాగలడని తలపో
యుచుండెను.
శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి తనకమండలములోని గంగాజలమును ఖాన్ తెచ్చిన బంగారుపళ్ళెర ముపై చల్లెను. ఆ ముఖమల్ వస్త్రమును తొలగింపవలసినదిగా ఒక శిష్యునాజ్ఞాపించెను. ఆ బంగాగారు పళ్ళెరములో వివిధములైన ఫలముల ను, సుగంధపుష్పములను దర్శించి ప్రజలందరు పరమానంద భరితులైరి. అసదుల్లా మాత్రము పరమాశ్చర్య చకితుడై తానొనరించిన భాగవతా పచారమునకు పశ్చాత్తాప ముజెందుచు గడగడ వణకనారంభించెను.
ఖాన్ ముఖముపైన చెమట పట్టుచుండగ ముఖము వివర్ణమై దిగ్గున ఆసనము నుండి లేచి తీర్థులవారి చరణములపై బడి, మహానుభావా! నేను మిమ్ములను గౌరవించు టకుగాక, అవమానించి అవహేళన జేయుటకరు దెంచితిని. నా అమా త్యుడు మీరు భగవత్సము లని, మహాత్ములని చెప్పినను సత్యము సంగీకరింపక పామరుని వలె మీదివ్యసముఖమున అపరాధ మొనరించితిని. గురు దేవా! నే నొనరించిన ఈ దుష్కృత్యమునకు హృదయపూర్వకముగ పశ్చాత్తాపమును జెందు చున్నాను. నా యపరాధ మును మన్నించి నన్ను క్షమించవలసినదిగ ప్రార్ధించుచున్నా" ననిపల్కి అనేక వందనముల నర్పింపసాగెను.
వెంకన్న పంతులుతో పాటు అందఱు ఈ విచిత్ర సంఘటనను గాంచి విషయము తెలియక పరమాశ్చర్య చకితులైరి. నవాబు స్వామికి ఏ అపరాధమొనరించినాడో తెలియక ప్రజలు అచ్చెరు వొందసాగిరి. ఖాన్ యొనరించిన అపరాధము ఖానునకు శ్రీవారికిదప్ప అన్యులందరకు అగోచ రమే. శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి అసదుల్లాను ఆశీర్వదించి తీర్థ ప్రసాదముల నొసంగి గౌరవించిరి. అసదుల్లా ఖాను రాజగృహమును జేరినవాడై తానొనరించిన దుష్కృత్యమునకు పశ్చాత్తాపము జెందుచు దీనికి పరిహారముగ నేమి యొనరింపవలెనని రాత్రి అంతయు ఆలోచించెను.
ఉదయముననే వెంకన్న పంతులును రావించి అమాత్యా! నిన్నటిరాత్రి నేను మరలివచ్చిన అనంతరము గురుదేవు లేమనిరి? నేను ఆయన సమక్షములో ఘోరాపరా ధము నొనరించితిని. మహత్ములాగ్రహించిన నేను, నా రాజ్యము నశింప గలమని పల్కి జరిగినది వివరించెను.
ఆశ్చర్యచకితుడై జరిగిన విషయమును గ్రహించి వెంకన్న పంతులు 'జహాపనా నా గురుదేవు లు శాంతమూర్తి, కరుణా సముద్రుడు, క్షమాస్వరూ పుడు. కావున తామొన రించిన ఈఅపరాధమును సరకుగొనడని” ధైర్యము చెప్పెను.
అసదుల్లాఖాను తన దుష్కృత్యమునకు పరి హారముగ కొన్ని గ్రామములను శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామికి కానుకగా అర్పించెదనని, ఏయే గ్రామములు కావలయునో స్వామివారే నిర్ణయింప వలెనని బల్కెను. రాజుపల్కిన మధుర వాక్యముల నాలకించి పరమానంద భరితుడై గురుదేవుని జేరి విన్నవించెను.
శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి మందహాసము నొనరించు చు వెంకటేశా! నా కెన్నియో గ్రామములు వలదు. సర్వము ఆ శ్రీరామచంద్రుని సంకల్ప మాత్రముననే సంభవిం చును. భగవదారాధన నార్థమై 'మంచాల' యను గ్రామమును సమర్పింప వలసినదిగ నవాబును కోఱుమనెను. వెంకన్న పంతులు బాదుషాను జేరి 'మంచాల' విషయమును విన్నవించెను.
అసదుల్లాఖాన్ మంచాల గ్రామము నొక ఫకీరున కొసంగెను. నవాబు ఆ ఫకీరును రావించి వానికి మరికొన్ని గ్రామముల నొసంగి మంచాలను స్వీకరించెను. అసదుల్లా పరమానంద భరితుడై ఆక్షణమందే 'మంచాల’ గ్రామమును శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామికి కానుకగా సమర్పించెను. నవాబు అనేక గ్రామముల నొసంగుటకు సిద్ధముగా యుండెను. కాని శ్రీవారు ఒక మంచాల కుగ్రామ మునే కోరుకొనుట దివాన్ వెంకన్న పంతులునకు ఆశ్చర్యమును కలిగించెను. అతడు శ్రీవారితో ఆ విషయమును విన్నవిం చెను. అపుడు శ్రీరాఘ వేంద్ర తీర్థ స్వామి యిట్లు పల్కిరి. వెంకన్నా! నేను ప్రహ్లాదావతారములో అనేక యజ్ఞ యాగాదుల నొనరించితిని, నాటి ఆయఙ్ఞ భూమియే నేటి ఈ మంచాల గ్రామము. పరమపవిత్ర యజ్ఞ క్షేత్రము, దివ్యభూమి, కర్మభూమి. కావుననే నేనా కుగ్రామమును అంగీక రించితిని.
ఆదోని అమాత్య శేఖరుడైన వెంకన్న పంతులు 'మంచాల’ గ్రామములో ఒక విశాల మైన ఆశ్రమమును నిర్మించెను. ఆశ్రమ నిర్మాణ వ్యయమునంతయు అస దుల్లానే వహించెను. తదనంతరము శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి భగవన్ మూర్తు లను తోడ్కొని, పరివారము, అసదుల్లా ఖాను, వెంకన్న పంతులు మొదలగు వారందరు వెంటరాగా మంచాలలోని నూతన ఆశ్రమమును ప్రవేశించిరి.
జై గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
16వ భాగము
సమాప్తము**