ఆశ్రితజన వాత్సల్యము:
అది పదునైదవ శతాబ్దము. విజయనగర సామ్రాజ్యము అత్యున్నత స్థితిలోనున్న శుభ సమయము. శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి ఆకాలములో శ్రీవ్యాసరాయ తీర్థులుగా నుండిరి. శ్రీ వారు వృద్ధులైరి. సంచారమును నిలిపి పెక్కు కాలము భావ సమాధిలో నుండసాగిరి. హంపీలోగల చక్రతీర్థము చెంత నివసింపసాగిరి. నాటి విజయనగర పాల కులు త్రిసంధ్యల యందు స్వామిని దర్శించెడివారు.
శ్రీన్వామివారు అప్పుడ ప్పుడు శ్రీపురందరదాసు, శ్రీకనకదాసు, శ్రీ వాదిరాజ తీర్థస్వాములు మొదలగు వారిని సమావేశ పరచి శ్రీహరి వాయు దేవుల దివ్యలీలలను చర్చించెడి వారు. ఒకప్పుడు చర్చలో జన్మ పునర్జన్మ వారి చర్చనీయాంశ మయ్యెను. అపుడు శ్రీవ్యాసరాయ తీర్థులు యిట్లుపల్కిరి. “మహాశయులారా! ఈజన్మ పరిసమాప్తము కానున్నది. కాని మనకు శ్రీ మూల రాముని ఆరాధనములో తృప్తి కలుగదయ్యె.” అపుడు కనకదాసు ఇట్లుపలికెను. “దేవా! అటులైన తమరు మరల భూమిపై అవతరింప గలరు. కనకదాసు యమాంశచే అవతరించిన భక్తుడు, స్వామీ! ఈ పురందర దాసుకు ముక్తి కల్గునా యనిపలికెను. అపుడు వ్యాసరాయల వారు అదెట్లు జరుగును. ఈయన యింకను ఆరు జన్మము లెత్తవలసియుండె ననిపలికిరి. మరి శ్రీవాది రాజ తీర్థస్వాముల వారి విషయమేమి యని కనకదాసు ప్రశ్నించెను. అపుడు స్వామి శ్రీవాది రాజతీర్థస్వామి ఈభూమి పై వేలకొలది సంవత్సర ములు విరాజిల్ల గలరు, వారి కొఱకై ఎందులకు ఆలోచింతువని పల్కెను. అపుడు కనకదాసు ప్రభూ! మరి యీ దాసునకు ముక్తి యెప్పుడని పలికెను. అపుడు శ్రీవ్యాసరాయ తీర్థస్వామి కనకదాసా! నీవుమరలజన్మింపవలెను ప్రారబ్ధము నెవరైనను
అనుభవింపవలసినదే. నీవు మరుజన్మములో నీ ప్రారబ్ధ శేషముననుభవించి నన్ను దర్శించి భవబంధ విముక్తుడ వయ్యెదవని పలికెను.
తదనంతరము శ్రీ వ్యాస రాయ తీర్థస్వామి శ్రీరాఘ వేంద్రునిగా అవతరించి పీడిత మానవాళి నుద్ధరిం చుటకు దేశాటనమొన రించుచు మానవి యను గ్రామమందు గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవా లయములో చాతుర్మాస్య మొనరించుచుండిరి. చాతుర్మాస్య వ్రతసమయములో ఆషాఢ శుద్ధద్వాదశి నుండి శ్రావణశుద్ధ ద్వాదశివరకు ఆహారమందు కొన్నిపదార్థ ములను (చింతపండు, పచ్చిమిరప, ఆవాలు మొదలైనవి) వర్జించుట సాంప్రదాయకమై యున్నది దీనినే వ్రతనిష్ఠ యని కూడ నందురు.
శ్రీరాఘ వేంద్రస్వామి చాతు ర్మాస్య వ్రత మొనరించు చున్న సమయములో ఆ ప్రదేశమునకు ఒక హరి జనుడు వచ్చెను. అతడు స్వామికి సాష్టాంగ దండ ప్రణామ మొనరించెను, ఆ వ్యక్తిని గాంచగనే స్వామి "కనకదాసా! ఎన్నాళ్ళకు నిన్ను గాంచితిని నీ ప్రారబ్దానుభవము నేటితో అంతరించెను అని పలికిరి.
శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి పలికిన మధురవచనముల నాలకింపగనే హరిజను నకు పూర్వస్మృతి కల్గెను. అతడు శ్రీ వారి పాదము లపై బడి గురు దేవా శ్రీవ్యాసరాయ యతీంద్రా క్షుద్రమగు ఈ మానవ జన్మమును నేనిక భరింప లేను. నా కర్మములనుబాపి నాకు పరంధామమును అనుగ్రహింపుమని ప్రార్థిం చెను. అపుడు శ్రీవారు “కనకదాసా! భగవంతున కేమి కానుక తెచ్చితి’వని ప్రశ్నించెను. అందులకు కనకదాసు "స్వామీ! నేను కటికదరిద్రుడను; కావున నావద్దయున్న ఈ గుప్పెడు ఆవాలను మాత్రమే సమర్పింప గల”నని పల్కి తన చెంగులో కట్టియున్న ఆవాలను శ్రీవారి కర్పిం చెను. శ్రీరాఘ వేంద్ర తీర్థ స్వామి అత్యంత ప్రసన్నులై భక్తుడర్పించిన ఆ ఆవాల ను భగవత్ప్రసాదములో వినియోగింప వలసినదిగ పలికిరి. ఆవాలను చాతు ర్మాస్య దీక్షలో నున్నవారు విసర్జింపవలెను. శ్రీవారు ప్రసాదములో వినియోగిం పుడని పల్కుట గాంచి తదితరశిష్యులు, గ్రామ పెద్దలు ఆశ్చర్యచకితులైరి. అదిగాంచి శ్రీవారు ఇట్లు పలికెను. భక్తులారా! భగ వంతుడు భావమయుడు, భక్తపరాధీనుడు. ఈ హరి జన రూపములో నున్న కనకదాసు పరమభాగవతో త్తముడు. ఆ జగన్నాథుడు మధురాతి మధురములగు పదార్థములనైనను స్వీక రింపడు, పత్రపుష్ప ఫల తోయములు (నీరు) అయినను భక్తుడొసంగిన చో ప్రేమతో స్వీకరించును. శ్రీరామచంద్రుడు శబరి ఎంగిలిపండ్లను ఆరగింప లేదా? శ్రీకృష్ణుడు విదురు డొసంగిన అరటితొక్కలను స్వీకరింపలేదా, కుచేలు డొసంగిన అటుకుల నార గింప లేదా? కావున పరమ భక్తుడగు ఈ కనకదాసొసం గిన ఆవాలు పరమపవిత్ర ములు. యీ ఆవాలే భగవంతుని నివేదనకు అర్హతను కల్గియున్నవి.
శ్రీవారు హరిజనుని రూప ములో నున్న కనకదాసుని గాంచి నదీస్నానము చేసి శుచియైరమ్మని పల్కెను. నాటి మహా నైవేద్యములో ఆవాలు కలుపబడెను. నివేదనానంతరము ఆవా లు కలిపిన మహానైవేద్య ము సంతర్పణలో విని యోగింప బడెను.
కనకదాసు నదీ స్నానమా చరించి శుచియై శ్రీ ఆంజ నేయస్వామి దేవాలయ మునకరుదెంచి ధ్వజస్తంభ ము చెంత నతమస్తకు డై నిలువబడెను. శ్రీవారు భక్తునిగాంచగనే దిగ్గునలేచి అత్యంతానుగ్రహముతో మహానివేదనమును కనక దాసునకొసంగిరి. మహా నివేదనము నారగించి శ్రీరాఘవేంద్ర తీర్ధస్వామి అనుగ్రహమునకు పాత్రుడై భవబంధములను త్రెంచు కొని కనకదాసు పరంధామ మునకు జనెను.
శ్రీరాఘవేంద్రస్వామి ఒక మహాభక్తుడర్పించిన ఆ యావాలను ప్రసాదముగ భావించి స్వీకరించెను. ఆహా! స్వామియొక్క ఆశ్రితభక్తజన వాత్సల్య మేమి? భక్తునికొఱకు తమ చాతుర్మాస్య వ్రతనిష్ఠను గూడ నుల్లంఘించి ద్వాదశీ దినమున ఆవాలను అమృతముగ స్వీకరించె ను. నాటినుండి శ్రీరాఘ వేంద్రస్వామి మఠములో వ్రతదినములందు గూడ ఆవాలను స్వీకరించుట ఆచారమయ్యెను. శ్రీస్వామివారి మఠమును దక్షిణాది మఠమని వ్యవహరింతురు.
బిదరహల్లి శ్రీనివాసతీర్థులు:
ధార్వారుజిల్లాలో బిదర హల్లియను గ్రామము కలదు, ఆగ్రామములో కృష్ణమాచార్యులు అను సద్బ్రాహ్మణుడు తిరుమ లాంబయను సహధర్మ చారిణితో నివసించు చుండెను. వారి కుల దైవము వేంకటాచలముపై విరాజిల్లియున్న శ్రీ వేంక టేశ్వర విభుడు. వారు మధ్వ సంప్రదాయమును త్రికరణశుద్ధిగ ఆచరించు చున్న ఉత్తములు. వారికి శ్రీనివాసుని యనుగ్రహ ము వలన ఒకకుమారుడు కలిగెను. వానికి తల్లి దండ్రులు శ్రీనివాసాచార్యు లని నామకరణము చేసిరి. శ్రీనివాసాచార్యులు తన ప్రాధమిక విద్యాభ్యాసము ను తండ్రియొద్దనే ముగిం చుకొని మధ్వ సంప్రదాయ మందుగల ఉన్నత విద్య అభ్యసించుటకై శ్రీయాద వార్యులనెడి గురు దేవు నాశ్రయించెను.
శ్రీ యాదవార్యులు ఒక గృహస్థు. ఆయన తపస్వి, జ్ఞాని, కర్మిష్ఠి, భక్తుడు. గృహస్థాశ్రమమున నున్న ను ఆయన సర్వ సంగ పరిత్యాగివలె జీవించుచుం డెను. శ్రీ యాదవార్యులు వేదవ్యాస భగవానుని భక్తులు. యాదవార్యులు పిలచిన వ్యాస దేవుడు పలికెడి వాడట!
ఆ మహత్ముని చెంత శ్రీనివాసాచార్యులు అనేక మధ్వ సంప్రదాయ గ్రంథముల నధ్యయనము చేసి ఉద్దండ పండితుడై గురుదేవుని అనుగ్రహము ను బడసి తన స్వగ్రామ మునకు మరలి వచ్చెను. బ్రహ్మచర్యాశ్రమము మును విసర్జించి శ్రీనివాసాచార్యు లు గృహస్థాశ్రమమును స్వీకరించి తన గురుదేవు లైన శ్రీయాదవార్యుని వలె వైరాగ్యయుక్తమైన జీవన మును గడుపుచుండెను.
శ్రీనివాసాచార్యులు శ్రీమదానంద తీర్థులయొక్క గ్రంధములపై వ్యాఖ్యాన ములను రచింపదొడం గెను. శ్రీనివాసతీర్థులు శ్రీ రాఘవేంద్ర వైభవమును పెక్కండ్రు భక్తులద్వారా తెలిసికొనెను. శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి సర్వజ్ఞుడని, త్రికాలజ్ఞుడని, ఘటనా ఘటన సమర్థుడని, నిగ్రహానుగ్రహ సమన్వితు డని, మధ్వశాస్త్రములందు మహావిద్వాంసుడని, మహా భక్తుడని శ్రీనివాసాచార్యు లు తెలిసికొని మంచాల గ్రామమునకు అపుడపుడు వెళ్ళుచు స్వామివారితో సాంగత్య మొనరించు చుండెను. ఒకప్పుడు స్వామి యాశ్రమములో ఒక విచిత్ర సంఘటనము సంభవించెను. శ్రీ రాఘవేం ద్ర తీర్థ స్వామి రచించిన భాష్యములను సరిచూచు కొనుచుండెను. ఒక భాష్య ములో కొంత మార్పు చేయవలసి వచ్చెను. కాని వారి వద్ద వ్రాతపరికరము లు లేవు, అపుడు స్వామి వాటిని తెప్పించుటకు అటునిటు దృష్టి సారించిరి. కాని దరిదాపులలో ఆశ్రమ శిష్యులెవ్వరును లేరు. శ్రీనివాసాచార్యులు స్వామి కి కొంత దూరములో కూర్చుండి గ్రంథావలోకన మొనరించుచుండెను. స్వామి శ్రీనివాసాచార్యుల ను వ్రాత పరికరములను ఎవరిచేతనైనను పంపించ వలసినదిగా కోరిరి. అపుడు వెంటనే శ్రీనివాసా చార్యులు లేచి పరిశుభ్ర మైన వస్త్రములను ధరించి తన సిరాపాత్రను, కలము ను స్వామి ముందుంచెను. శ్రీరాఘవేంద్ర తీర్థ స్వామి శ్రీనివాసాచార్యుని వస్త్ర ధారణను గాంచి ఆశ్చర్య చకితుడై యిట్లు బల్కిరి. "ఆచార్యా! మీరే స్వయ ముగ వ్రాతపరికరములను తీసికొని రావలసినదిగా మేము చెప్పలేదే, ఎవరి చేతనైన పంపవలసినదిగా కోరినాము. కాని మీరు వ్రాతపరికరములను దెచ్చు టకు పవిత్రవస్త్రముల నేల ధరించి తెచ్చితిరి". అందు లకు శ్రీనివాసాచార్యు లిట్లు ప్రత్యుత్తర మొసంగెను. “దేవా! గంగానది ప్రతి సంవత్సరమొక శుభ ముహూర్తమున తుంగ భద్రను ప్రవేశించును. ఆ పవిత్రసంగమ సమయ మందు దివ్యజలములను నేను స్వీకరించి యీ సిరాను తయారు చేసి కొంటిని, కావున యిది పరమ పవిత్రము. ప్రతి దినము నేను స్నానానంత రము పవిత్ర వస్త్రములను ధరించి యీ వ్రాత పరికర ములచే నారచనలను సాగించెదను, తదుపరి వాటిని (వ్రాత పరికర ములను) దైవసన్నిధి యందుంచెదను. మరల స్నానమాచరించెడి వరకు వాటిని ముట్టెడివాడను కాను.
అపుడు శ్రీరాఘవేంద్ర స్వామి పరమానంద భరితుడై ఆచార్యా! మీ వ్రాతపరికరములే అంత పవిత్రమైనచో మీ రచన లెంత పవిత్రములోకదా! మీ రచనలను పరికింప వలెనని నాకు కుతూహల ముగ నున్నదని పలికెను.
అపుడు వెంటనే శ్రీనివాసా చార్యులు తనరచనలను దెచ్చి శ్రీరాఘవేంద్ర తీర్థుల సమక్షమన నుంచిరి. శ్రీస్వామి శ్రీనివాసాచార్యు ని గ్రంథములను కొన్ని దినములు పరికించి అవి మధ్వ సాహిత్యములో మణిమకుటములని గ్రహించెను. శ్రీస్వామి ఆనంద బాష్పసమన్వితుడై యిట్లుబల్కెను.“ఆచార్యా! నీవెంతో ధన్యుడవు, నీ యీ గ్రంథములు మధ్వ సాహిత్యములో అత్యుత్త మములు, నీ జీవనము పవిత్రము, నియమ బద్ధము, నీవు తపస్వివి, ధ్యానపరుడవు, కర్మానుష్ఠా న పరాయణుడవు నీవు గృహస్థాశ్రమములో నున్న యతీశ్వరుడవు, నీ యీ భాష్య గ్రంథములు, అక్షరములు నిత్యములు, మధురాతి మధురములు.
మరునాడు శ్రీరాఘవేంద్ర తీర్థ స్వామి విద్వజ్జన సభనేర్పాటు గావించెను. ఆ మహాసభలో శ్రీస్వామి శ్రీ బిదరహల్లి శ్రీనివాసా చార్యులను హృదయ పూర్వకముగ అభినందిం చెను. ఆయనకు ఉన్నతాసనము నొసంగి గౌరవించెను. సభలోని విద్వాంసులందరూ ప్రస్తు తించుచుండగ శ్రీరాఘ వేంద్ర తీర్థ స్వామి శ్రీ శ్రీనివాసాచార్యునకు తీర్థులని బిరుదు నొసంగి బంగారపు తీగలచే అలంకరింపబడిన దుశ్శాలువను గప్పి ఒక పెద్దపళ్లెరము నిండ వెండి నాణెములను నింపి సత్కరిం చెను.
ఆదినమునుండి శ్రీనివాసా చార్యులు బిదరహల్లి శ్రీనివాస తీర్థులుగ ప్రసిద్ధికెక్కెను. ఈ తీర్థుల నెడి బిరుదు కేవలము సర్వసంగ పరిత్యాగులైన యతీశ్వరులకే లభించును. కాని శ్రీనివాసాచార్యునకు రాఘవేంద్రుని యనుగ్రహ మువలన గృహస్థాశ్రమ మములోనే లభించెను.
తనకు ఈ విద్వత్సత్కా రము లభించుటకు కారణము తన గురుదేవు లైన శ్రీయాద వార్యులని శ్రీ శ్రీనివాసతీర్థులు నిర్ణయిం చుకొని యీ విషయము నంతయు గురు దేవులకు విన్నవించుటకై ఎక్కుండి (శ్రీయాదవార్యుల వారు ఉండు ప్రదేశము) బయలు దేరుటకు సంకల్పించెను.
జై గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
18 వ భాగము
సమాప్తము**
🕉️🔔🕉️🔔🕉️🔔