శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 19 వ భాగము

P Madhav Kumar


కర్మలు మూడు విధము లని చెప్పబడెను. జీవుడు భవబంధములను తెంచు కొనవలెనన్న యీ మూడు కర్మలను అనుభవింపక తప్పదు. అవి సంచితము, ఆగామి, ప్రారబ్ధము. సంచితాగామి కర్మలు తపస్యాదుల చేత, సద్గురు దేవుని అనుగ్రహముచేత నివారింపబడగలవు. కాని ప్రతిజీవుడు  ఎంతటి వాడైనను ప్రారబ్ధమనుభ వించిన యనంతరమే యీ జనన మరణ చక్రమును దాటగలడు.


ఎంతటి విద్వాంసుడైనను తపస్సంపన్నుడైనను శ్రీని వాస తీర్థులు తన ప్రారబ్ధ కర్మననుభవింపక తప్ప లేదు. శ్రీనివాస తీర్థుల వంశీయులు ఉత్తరాది మఠ మునకు శిష్యులు. శ్రీ రాఘవేంద్ర తీర్ధ స్వాముల మఠము దక్షిణాది మఠ ముగ వినుతికెక్కెను. కొన్ని మాసములలో వైష్ణవులు కొన్ని యాహారపదార్థము లను విసర్జింతురు. దానిని వ్రతమందురు. ఉదాహరణ మునకు ఆషాఢ శుద్ధ ద్వాదశినుండి శ్రావణ శుద్ధ ద్వాదశివరకు చింతపండు రసమును, పచ్చిమిరప కాయలను, ఆవాలను, భోజనమందు విసర్జిం తురు. కాని శ్రీ రాఘ వేంద్రుని మఠమందు వ్రత సమయమున ఆవాలను మాత్రము స్వీకరించు ఆచారము కలదు.


బిదరహల్లి శ్రీనివాసతీర్థులు ఆషాఢ శుద్ధ ద్వాదశి దినమున భోజనానంతరం  ఎక్కుండికి బయలు దేరు టకు నిర్ణయించు కొనిరి.  ఆశ్రమములోని భోజన శాలలో ద్వాదశి పారణకు భగవత్ప్రసాదము సిద్ధము జేయబడెను. శ్రీ రాఘ వేంద్రస్వామి చెంత శ్రీనివా స తీర్థులకు భోజనము వడ్డింప బడెను.


భోజన సమయమున ఆశ్రమములోని వంటవారు ఆవాలు కలిపిన రసమును దెచ్చి మొదట శ్రీస్వామి వారికి వడ్డించి తదుపరి శ్రీనివాసతీర్థులకు వడ్డింప బోయిరి.  శ్రీనివాసతీర్థులు

ఆరసమును తిలకించి శంకించి దీనిలో ఆవాలను కలిపితిరా యని ప్రశ్నిం చెను. అందులకు ఆ వంటవాడు అవునని పలికెను. అవుడు శ్రీనివాస తీర్థులు వ్రతమందు ఆవాలను మేము స్వీకరిం పమని పలికెను. అపుడు  శ్రీరాఘవేంద్ర స్వామి వంటవాని నుద్దేశించి “ఏమయ్యా”! శ్రీనివాస తీర్థులు ఉత్తరాది మఠము నకు జెందిన వారని తెలియదా? కావున వెంటనే ఆవాలను కలపని రసమును దెచ్చి వారికి వడ్డింపుమని ఆదేశించిరి.


శ్రీస్వామి యాజ్ఞానుసార ము శ్రీనివాసతీర్థులకు ఆవాలు కలపని రసమే వడ్డించుట జరిగెను. భోజనానంతరము శ్రీ శ్రీనివాసతీర్థులు ఎక్కుండికి బయలు దేరిరి. అపుడు శ్రీ స్వామి  తీర్థులకు మంత్రా క్షతల నొసంగి యెంతయో గౌరవించి పంపిరి. అయిదు దినములు ప్రయాణ మొన రించి శ్రీనివాస తీర్థులు ఎక్కుండి చేరెను.


మహాత్ముడు, దైవస్వరూపు డైన శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామిచే మన్ననల నొంది తనశిష్యుడు వచ్చుచున్నా డని శ్రీయాద వార్యులకు తెలిసెను. ఆయన తన శిష్యునకు స్వాగతము పల్కుటకు సిద్ధముగా నుండెను. శ్రీనివాసతీర్థులు ఏగుదెంచి గురు దేవునకు సాష్టాంగ దండ ప్రణామ మొనరించుటకు  ఉద్యుక్తు డయ్యెను. తనశిష్యుని దూరమునుండియే గాంచి అసహ్యముతో శ్రీయాద వార్యులు కర్కశకంఠముతో నిట్లుబల్కెను “తిరిగి పొమ్ము, నన్నంటకుము, నీకుటుంబములో నెవరైన మరణించిరా యేమి? పంచమహాపాతకములలో దేనినైన ఆచరించితివా? భగవంతునకు అసంతుష్టీ కరములైన కార్యముల నేమైన యొనరించితివా? ఏమి జరిగెను? నీచుట్టును పాపభూయిష్టమైన వాయువు ప్రసరించు చున్నది.”

అపుడు భయకంపితుడై వణకుచున్న కంఠముతో  శ్రీనివాస తీర్థులు "గురు దేవా! నేను పవిత్రుడను, నావలన నెట్టి యపరాధము జరుగలేదు. నన్ను శ్రీ రాఘవేంద్ర తీర్ధ న్వామి అభినందించి, గౌరవించి, సత్కరించి, ఆదరించి పంపిరి. నాకు తీర్థులను బిరుదు నొసంగిరి' యని పలికెను.


అవి యన్నియు నాకు తెలియును, కాని బయలు దేరుటకు ముందు నీకు స్వామి ఫలమంత్రాక్షతల నొసంగితిరా? లేదా? యని శ్రీయాదవార్యులు ప్రశ్నిం చిరి. అందులకు శ్రీనివాస తీర్థులు 'అవు’నని పలికి, తనకొంగున కట్టబడియున్న ఫలమంత్రాక్షతలు బయట కు తీసెను. అరుణ వర్ణ ములో నుండవలసిన మంత్రాక్షతలు కారునలుపు గ మారుట గాంచిన శ్రీ యాదవార్యులు, శ్రీనివాస తీర్థులు ఆశ్చర్యచకితులైరి. అవుడు శ్రీయాదవార్యులు దృఢమైన వాణితో నిట్లు పల్కెను. "శ్రీనివాసా! నీవు ఏ యపరాధమొనరిం చితివి, శ్రీరాఘవేంద్ర స్వామి భవ్యమఠములో నీ వొనరించిన దానిని నాకు పూర్తిగ వివరింపుము.”


శ్రీనివాసతీర్థులు ఆశ్రమ ప్రాంతములో జరిగిన దానిని విన్నవించుచు తాను ఆవాలతో కూడియున్న రసమును స్వీకరింపక తనవ్రతనిష్ఠను నిలుపుకొన్న ఉదంత మును గూడా చెప్పెను. అవుడు యాదవార్యులు “అదియే నీవొనరించిన యపరాధము. ఆ మహా త్ముని యెదుట నీ వెంత కర్కశముగ ప్రవర్తించితివి? నీ గొప్పతనమును ఆ దైవస్వరూపు నెదుట ప్రదర్శించితివి. నీవు ఉత్తరాదిమఠము నకు చెందినవాడవని, వ్రత సమయమున ఆవాలను స్వీకరింపరాదను విషయ ము  శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామికి తెలియనట్లు ప్రవర్తించితివి. మూర్ఖుడా! శ్రీరాఘవేంద్రులనగా ఎవ రను కొంటివి,  సామాన్య సన్యాసియని యనుకొంటి వా? ఆయన సర్వజ్ఞుడు, సర్వదర్శకుడు, సర్వాంత ర్యామి, ఆయన కినుక వహించిన ఆక్షణమందే నీవు భస్మమై యుండెడి వాడవు, కాని ఆ మహా త్ముడు కరుణాంతరం గుడు, సాక్షాత్తుగ భగవం తుడే ఆయన హృదయ మందు విరాజిల్లియున్నా డు.


ఆ పవిత్ర మూర్తి యెదుట యెట్లు ప్రవర్తింప వలెనో విద్యాధికుడవైన నీకు తెలియదా! వెంటనే శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి చెంతకు వెడలి  ఆయన పాదములపైబడి క్షమా బిక్షనర్ధించి పవిత్రుడవై నా వద్దకు రమ్ము అని పలికెను.


బిదరహల్లి శ్రీనివాసతీర్థులు పవిత్ర జీవనమును గడుపుచున్న భక్తుడు. కాని, అతని ప్రారబ్ధము అతనిచే నిట్లు గురు జనా పరాధమొనరింప జేసెను. అన్నియు తెలిసియు తెలియని వాడయ్యెను. ఆహా! ప్రారబ్ధానుభవ మెంతపని చేసెను. వెంటనే శ్రీనివాసతీర్థులు మంచాల కు తిరిగి వెళ్ళి శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి పాదము లపైబడి ఉచ్ఛైస్వరముతో విలపించుచు తన యపరాధమును క్షమింప వలసినదిగ ప్రార్థింప దొడంగెను.


అపుడు శ్రీస్వామి కృపా దృక్కులను ప్రసరింప జేయుచు “శ్రీనివాసా! నీవు నీ విద్యా గురువుకడకు చేరితివికదా! ఆయన నిన్ను మరల ఇక్కడకు పంపినాడు కదా!" యని పలికెను. అపుడు శ్రీనివాస తీర్ధులు “మహాత్మా! నీవు సర్వాంతర్యామివి.

భూత భవిష్యత్వర్త మానముల నెరింగిన సర్వజ్ఞడవు, నేను అజ్ఞాని ని, మూర్ఖుడను, నీవు గొప్పవాడవు, దైవస్వరూ పుడవు, నేను దీనుడను, హీనుడను, పాపిని, నన్ను క్షమింపుడు. నన్ను ఎక్కుండి పంపకుండ మీరే ఏల శిక్షింపరైరి. నన్ను క్షమింపుడు, నన్ననుగ్రహిం పు" డని యనేకవిధముల ప్రార్థింప దొడంగెను. 


ఆదినముననే శ్రీస్వామి వారి సరసన శ్రీనివాస తీర్థులకుగూడ భగవత్ప్ర సాదము వడ్డింపబడెను. అందు ఆవాలతోగూడిన రసముకూడ వడ్డింప బడెను. శ్రీనివాసతీర్థులు పశ్చాత్తప్త   హృదయుడై భక్తితో ఆ రసమును స్వీకరించెను. భోజనానంత  

రము శ్రీరాఘ వేంద్రతీర్ధుల పాదముల నాశ్రయించి ఆయన యనుగ్రహమునకు పాత్రుడై ఫలమంత్రాక్షతల లను బొంది పాపవిముక్తు డయ్యెను. తదనంతరము శ్రీస్వామివారి యనుమతి గైకొని తనవిద్యాగురువు లైన శ్రీయాద వార్యులను దర్శించుటకు ఎక్కుండి బయలు దేరెను.


శ్రీరాఘవేంద్రతీర్ధ 

స్వాముల పూజారులు:


భగవద్భక్తులైనవారు తీర్థ యాత్రల నొనరించుచు పవిత్ర క్షేత్రములను దర్శించి పవిత్ర నదీ జలములందు స్నాన మాడుచు దేశాటన మొనరింతురు. దక్షిణ భారతదేశములో ఒక గ్రామమందు ముగ్గురు సద్బ్రాహ్మణులు కలరు. వారు భగవద్భక్తులు, పవిత్రాచరణము గల ఆదర్శగృహస్థులు,  సత

తము శ్రీహరినామసంకీర్తన పరులు, మిత్రులు. ఈ మువ్వురు మధ్వసాంప్రదా యమునకు చెందినవారు విద్వాంసులు. వారు శ్రీ మధ్వాచార్యులు శాసించిన ప్రకారము తమ జీవనము  గడుపుచున్న పవిత్రులు. వారు తీర్థయాత్రల నొనరిం చుచు బళ్ళారి ప్రాంతము న కరుదెంచిరి. ఆదోని చెంత మంచాలలో శ్రీరాఘ వేంద్రతీర్థులను మధ్వ యతీశ్వరుడు విరాజిల్లి యున్నాడని తెలిసికొని ఆయనను దర్శింపవలె నని, పవిత్ర తుంగభద్రానదీ జలములందు స్నానమాడ వలెనని బయలు దేరిరి. మార్గములో రాఘవేంద్ర తీర్థస్వామియొక్క అద్భుత ములైన లీలలను, తపశ్శక్తిని, మహత్తరమైన అనుగ్రహశక్తిని, సాహిత్య మందుగల విద్వత్తును, వీటన్నింటికంటే అపరోక్ష జ్ఞానమును. సర్వజ్ఞత్వ మును, సర్వవ్యాపకత్వ మును ప్రజలు ఇంటింటను చర్చించుకొనుట ఆలకిం చిరి. వారు ఈ విషయ ములనన్నింటిని విని ఆశ్చర్యచకితులైరి. ఒకే వ్యక్తి అసంఖ్యాకములైన సిద్ధులను కల్గియుండుట అసంభవమని, గోరంతలు కొండంతలు చేసి శ్రీస్వామి వారి నాశ్రయించిన జనులు ప్రచారము చేయుచుండ వచ్చునని భావించుకొనిరి. ఎట్లైనను ఆయన మధ్వ యతీశ్వరులు గావున ఆయనను దర్శించి ఆయన సిద్ధులను పరీక్షింప వలయునని నిర్ణయించుకొనిరి. వారు మువ్వురును  ఇట్లను కొనిరి. "మనము మనస్సులలో ఒక పదార్ధ మును తినవలయునని సంకల్పించుకొనవలెను. మంచాలలో మఠమందు భోజన సమయమున శ్రీస్వామి మనమర్ధింప కుండగనే ఆ పదార్థము లను  మనకు వడ్డింప వలెనని కోరినచో శ్రీస్వామి సర్వాంతర్యామి యని, సకల సిద్ధులు కలవాడని విశ్వసింపవలెను. లేనిచో ఎందరో  యతీశ్వరులవలె ఈయనకూడ ఒక సామాన్యుడని ఋజువు కాగలదు” అని  ఈ ఉపాయము అద్భుతముగ నున్నదని మువ్వురు భక్తులు నిశ్చయించుకొని   తమ మనస్సులలో ప్రత్యేక పదార్థమును శ్రీ రాఘవేంద్ర స్వామి మఠములో భుజింపవలెనని నిర్ణయిం చుకొని దానిని బహిర్గత మొనరింపక మనస్సులోనే యుంచుకొని మంచాలకు బయలుదేరిరి. మధ్యాహ్న సమయమునకు మంచాల మఠమును చేరి తుంగ భద్రానదిలో స్నానమొన రించిన తదుపరి  శ్రీస్వామి నిదర్శించుట  ఉత్తమమని తలంచి స్నానము చేయుటకు నదీ తీరము నకు జనిరి.


జై గురుదేవ దత్త

***** 

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

19 వ భాగము 

సమాప్తము**

🕉️🔔🕉️🔔🕉️🔔

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat