*దీక్షలో ఎన్నిసార్లు శరణుఘోష చేయాలి - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఓం స్వామియే శరణం అయ్యప్ప అను ఈ మంత్రం 108 సార్లు ఎందుకు జపించాలి ? మాలలో 108 పూసలు ఎందుకుండాలి ? అనే సందేహమునకు జిజ్ఞాసువులైన శిష్యులు ప్రశ్నించగా గురుస్వామి భాస్కర నాయరుగారు ఇలా సెలవిచ్చారు.*
*"మననాత్ త్రాయతే ఇతిమంత్ర"*
ఒక పద్ధతిలో నియమబద్ధంగా శ్రద్ధాభక్తులతో జపించగా ఇష్టకామ్య సిద్ధినీ , ఆత్మశాంతినీ ప్రసాదించగలిగేదీ మంత్రం. మంత్రంలో భగవంతుని పేరూ , బీజాక్షరాలుంటాయి. ఎవరైనా ఆచార్యులు (గురుదేవులు) మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశం చేసేవారూ , ఉపదేశం పొందే వారూ , నిష్టతోనూ , పారమార్థిక ప్రయోజనంతోనూ , మంత్రాన్ని జపించినపుడు అది ఫలితాన్ని ఇస్తుంది.
మనకు ఎన్నో మంత్రాలున్నాయి. అవి ఎందరికో ఫలించినట్లు ఋజువులున్నాయి. వాక్ శుద్ధివున్న వారి వాక్కు సిద్దిస్తుంది. మంత్రాలన్నిటిలో బాగా ప్రసిద్ధమైనది గాయత్రీ మంత్రం , అష్టాక్షరీ మంత్రం , పంచాక్షరీ మంత్రం , మరియు ప్రణవం. మంత్రాన్ని చక్కగా ఉపదేశించిన తర్వాత , ఆ మంత్రాన్ని ఒక నిశ్చితమైన సంఖ్యలో జపించాలి. అయితే ఏ మంత్రాన్నయినా కనీస 108 సార్లు జపించాలని అంటారు. అలాగే దీక్షాధారణకు వినియోగించే మాలల్లో కూడా పూసలు 108 వుండాలని నియమం. ఇందులో విశేషమేమిటో ఆలోచిద్దాము.
అంకెల్లో 1,2,3,4,5,6,7,...... 18లకు చాలా ప్రాముఖ్యం వున్నది. సంఖ్యాశాస్త్రం ఆధారంగా 108ని కూడితే 1+0+8=9 వస్తుంది అలాగే 9 వ ఎక్కములో 2x9=18 నుండి 9x9=81 వరకు హెచ్చవేత చేయగా వచ్చిన అంకెలను అనగా 18, 27, 36, 45, 54, 63, 72, 81 కూడినచో వచ్చు సంఖ్య కూడా తొమ్మిదే - దీనిని బట్టి 9 అంకె మారదని , పూర్ణమని తెలియును.
"జయ" ఇది వేదమంత్రముగా ప్రసిద్ధి నందినది. శివకవచములో నీ 'జయ' మంత్రము , రామ మంత్రము , ఏకాదశరుద్ర సంఖ్యగా ఇమిడి యున్నది. సాంఖ్యా శాస్త్రానుసారముగా , జయమనగా పదునెనిమిది సంఖ్యను సూచించును. జ=8, య=1, 8+1=9 వ ఆ తరువాత ఈ అంకెలకే యేదియైనను జేర్చబడి సంఖ్యామానము వెలయును.
ఈ తొమ్మిది సంఖ్య చాలా ప్రాముఖ్యము గలది. దీని ప్రాశస్త్యము ఋగ్వేదములో నీ విధముగా చెప్పబడినది. *“నవానాం నవతీనాం , విషస్సరో పురీషణాం సర్వాసామగ్రధం నామారే అస్య యోజనం హరిష్టామధుత్వామధులాచకార".*
వ్యాసమహర్షికి ఈ 9 అంకె చాలా ప్రియమైనదిగా నున్నందు వలననే అసంఖ్యాక మానముగా పదునెనిమిది పురాణములు , ఉపపురాణములు , స్మృతులు , నేర్పడినవి.
మానవ శరీరమున 72000 వేల నాడులున్నవి. వానిలో 108 నాడులు ఈ హృదయమే భగవంతునికి , ఆత్మకు స్థానమనబడుచున్నది. భగవదాస్థానమునకు , ఆత్మనిలయము నకు ఆధారమైన హృదయములోని నాడులు 108 ననుసరించి జపసంఖ్య 108గా ఆచారములోనికి వచ్చినదని పెద్దలు నుడువుదురు ప్రాణాయామ పూర్వక మంత్రోచ్ఛారణమే జపమనబడును. దీనికి ఆధారముగా జపమాలలో 108 పూసలుండ వలయును. 54 లేక 27 పూసలతో కూడ జపమాల నిర్మాణము చేసికొనవచ్చును.
ఆదిశక్తి , బ్రహ్మ , సీత , రాముడు , రాధ , కృష్ణాదులపేర్లను అలాగే అయ్యప్ప పేర్లను సాంఖ్యాశాస్త్ర పద్ధతిలో పరిశీలించినచో 108 సంఖ్యయేవచ్చును.
ఉదాహరణకు అచ్చులు , హల్లులను ఈ విధముగా అమర్చవలెను.
*అచ్చులు*
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
ఋ , అం , అః
11, 12, 13, 14
క , ఖ , గ , ఘ , చ , ఛ , జ , ఝ , ఞ , ట , ఠ , డ , ఢ , ణ , త , థ , ద , ధ , న , ప , ఫ , బ , భ , మ
1,2, 3, 4, 5, 6, 7, 8, 9,10,11, 12, 13, 14, 15, 16, 17,18,19,20, 21, 22, 23, 24, 25,
య , ర , ల , వ , శ , ష , స , హ , క్ష , త్ర , జ్ఞ
26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36
ఈ వర్ణక్రమానుసారముగా సీతారామ , రాధాకృష్ణ , ఓం స్వామి శరణం అయ్యప్ప అనే మాటల్లోని అంకెల్ని కూడినచో 108, తత్ గుణతములే వచ్చును.
సీతా = స + ఈ + త + ఆ
32 +4+16+ 2 = 54
రామ = ర + ఆ + మ 27+ 2+ 25 = 54 సీతారామ = 54 + 54 = 108
రాధాకృష్ణలో 108 సంఖ్య 9×12 = 108
రాధా = ర + ఆ + ధ + ఆ 27+2+19+2=50
కృష్ణ = క + ఋ + ష + ణ
1+11+31 +15=58
రాధాకృష్ణ = 50+58 + 108
ఓం స్వామి శరణం అయ్యప్పలో 108 తత్ గుణితములు
9 X 32 288
ఓం అ + ఉ + మ
1+5+25 = 31
స్వా = స + వ + అ 32+29+1 = 62
మి = మ + ఇ
25+3=28
శ = 30
ర = 27
ణం =15 72
య = 26
య = 26 95
ప = 21
ప = 21
.............. 9X32 288
288
*"ఓం స్వామి శరణం అయ్యప్ప" అను శరణుఘోషలోని నామావళిలో గల దివ్య మహత్యము ఇదియే. అందుకే ఏ మంత్రము పూజా విధానము తెలియక పోయినా దీక్ష కాలములో "ఓం స్వామి శరణం అయ్యప్ప"* అను నామమును ఎలుగెత్తి పలికిన , బీజాక్షరసంపుటితో గల ఆ దివ్య నామ ఉచ్చారణయే భగవానుని సాన్నిధ్యమునకు చేర్చుననుటలో సందియము లేదు.
పై ఉదాహరణముతో పాటు , సంఖ్యా , జ్యోతిష్య నియమాలననుసరించి కూడా మంత్ర జవసంఖ్య 108 ని బలపరుస్తుంది. అలాగే 108 మణులున్న మాల సర్వాభీష్ట ప్రదాయకమని మహానుభావులు చెపుతున్నారు.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు 12 రాశుల్ని చుట్టి వచ్చేటప్పటికి , ఒక చక్రం (ఆవృత్తి) పూర్తి అవుతుంది. ఒక ఆవృత్తిలో 360 అంశాలుంటాయి. ఈ విధంగా సూర్యుని ఒక ప్రదక్షిణకు చెందిన అంశాల , కళల్ని పరిశీలిస్తే 360 × 60 = 21,600 కళలవుతాయి. సూర్యుడు 6 నెలలు ఉత్తరాయణంలోను , 6 నెలలు దక్షిణాయణము లోనూ ఉంటాడు. పైన చెప్పబడిన సంఖ్యను 21,600 సంఖ్యను దీని ప్రకారం రెండు భాగాలు చేస్తే 10,800, 10,800 అవుతుంది.
ప్రతిదినమూ సూర్యోదయకాలనుండి మరునాటి సూర్యో దయం సమయం వరకూ వున్న కాలాన్ని 6 ఘడియలుగా పరిగణిస్తారు. ఒక ఘడియలో 60 నిముషాలు 60 నిమిషాల్లో 60 విఘడియలు వుంటాయి. ఈ విధముగా ఒక రేయీ పగలులో 60 × 60×60 విఘడియలు వస్తాయి. ఇందులో సగం అంటే , 10,800 పగలు , అంతే సంఖ్యలో రాత్రి వుంటాయి.
మన ప్రాచీన మహర్షులు వేల వేల సంవత్సరముల క్రిందటే నేటి వైజ్ఞానిక పద్ధతులైన దశాంశ పద్దతులు ప్రవేశపెట్టి , (అదే వేదగణితము అని ఇపుడు ప్రాచుర్యములోనికి వచ్చింది.) కాలాన్ని అంకెల్సి సమన్వయం చేశారు. దీన్ని అనుసరించి 10,800లో చివరి రెండు సున్నాలు తీసి వేస్తే 108 మిగులుతుంది. అంటే 9 తో భాగించబడే సంఖ్యగానే మనం దీన్ని గుర్తించాలి. ఈ సమన్వయం ఆధారంగానే జవసంఖ్య 108 గాను , జపమాలల్లోని పూసలు 108 గానూ నిర్ణయించారు.
అలాగే జపమనగా నేమిటో , జపమాలల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం
అంతేగాక లిఖిత జపమనమేమో గమనించి ఆచరించుదాం అంటూ చెప్పసాగారు గురుస్వామి.
*"జకారో జన్మ విచ్చేదః , పకారః పాపనాశకః జన్మపాప వినాశిత్వా జప ఇత్యభిధీయతే"*
'జ' జన్మ విచ్ఛేదమును చేయునది , 'వ' పాపమును నశింపచేయునది 'జప' మనబడును.
*మిగతా భాగం రేపు చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏