శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, కర్ణాటక లోని పశ్చిమ కనుమల్లో ఉంది. దేవస్థానం వెనుకవైపు కుమార పర్వతం ఉంటుంది. ఇది దేవస్థానాన్ని పడగా విప్పి కాస్తున్న శేష పర్వతం వలే ఉంటుంది. ఆలయం చుట్టూ కొండలు, జలపాతాలు ఉండడం వలన ఈ ప్రదేశం మరింత అద్భుతంగా మారింది. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం మంగళూరు కు దెగరలో సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది.
సుబ్రహ్మణ్య అనే గ్రామం పూర్వం కుక్కే పేరుతో పిలవబడేది అందుకే ఈ క్షేత్రాన్ని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అంటారు. ఈ దేవాలయం అనేక ప్రాచీన పుస్తకాలలో ప్రస్తావించబడి ఉంది. ఉదాహరణకు, శంకర విజయ అనే పుస్తకంలో ఆదిశంకరాచార్యులు తమ ఆధ్యాత్మిక యాత్రలో ఇక్కడ గడిపిన కాలాన్ని వివరిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని భజే కుక్కే లింగం అని పేర్కొనడమైనది.
కుమారధార నది: దీనినే మహినది అంటారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునే ముందు ఈ నది లో మునిగి రావడం ఆనవాయితీ. కుమార స్వామి తారకుడు మరియు శూరపద్మాసుర అనే రాక్షసులను సంహరించిన తర్వాత, తన శక్తీ ఆయుధాన్ని ఈ నదిలో శుద్ధి చేయడం వలన కుమారధార నది అనే పేరు వచ్చింది.
ఈ నది నీటిని పవిత్రంగా భావిస్తారు, ఇది అనేక భక్తులకు ఆరోగ్యం మరియు శాంతి అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. భక్తులు ఈ నదిలో స్నానం చేసి తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు. అలాగే ఎవ్వరికైనా చర్మ సమస్యలు ఉంటే, ఈ నదిలో స్నానం చేసి స్వామి ని దర్శించుకుంటే సర్వ రోగాలు పోతాయి అందుకోసం ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
ఈ దేవాలయానికి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉన్నప్పటికీ, భక్తులు పశ్చిమ వైపు నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలో మూలవిరాట్టు స్వామి, మధ్యలో వాసుకి మరియు క్రింద ఆదిశేషుడు ఉంటారు.
గరుడ స్థంభం: ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ స్థంభం, వాసుకి విషపు బుసలనుండి భక్తులను రక్షించడానికి ప్రత్యేకంగా నిర్మించబడింది.
చరిత్ర :
శ్రీవిష్ణువు యొక్క వాహనమైన గరుడా నుండి రక్షణ కోసం వాసుకి మరియు ఇతర సర్పాలకు ఆశ్రయంగా ఉండటానికి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాసుకి కోరిక మేరకు కార్తికేయుడు ఈ ప్రదేశంలో వెలసినట్లు చెప్పబడుతుంది.
పురాణిక నేపథ్యం :
స్కాందపురాణం మరియు సనత్ కుమారసంహితలో ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకుడు మరియు సూర్పర్మాసురను సంహరించిన తరువాత తన ఆయుధాన్ని ధారా నదిలో శుభ్రపరచుకున్నాడు. ఈ సమయంలో, కార్తికేయుడు ఇంద్రుని కుమార్తె దేవసేనను వివాహం చేసుకున్నాడు.
నిర్మాణం :
ఆలయం నిర్మాణం లో దక్షిణ భారత శిల్ప కళ యొక్క ప్రత్యేకతలు ప్రతిబింబితమవుతాయి. ఆలయంలో ప్రధానంగా గ్రానైట్ మరియు శిలలతో నిర్మించిన దివాళ్ళు, కొండల మధ్య ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేకించి, నాగల పూజకు ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ దేవాలయానికి చెందిన నిర్మాణం ద్రావిడ శిల్ప శైలిలో ఉంది, అందులో అందమైన శిల్పాలు, విగ్రహాలు మరియు అద్భుతమైన కళాకృతులు ఉన్నాయి. ప్రధాన మందిరంలో సుబ్రహ్మణ్యుని విగ్రహం నవరత్నాలతో అలంకృతమై ఉంది.
ప్రత్యక పూజలు :
ఆశ్లేష బలి పూజ:
ఆశ్లేష బలి, కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో జరిగే ముఖ్యమైన కాలసర్ప దోష పూజ. ఇది కాలసర్ప దోషం మరియు కుజ దోషం నుండి రక్షణ కోసం చేసే పూజ.
సర్ప సంస్కారం:
ఇది పిండ ప్రదానం తో సమానం. పాముల విషయంలో పూర్వికులు చేసిన తప్పుల వలన కొందరికి సంతానం కలగదు. దానికి పరిస్కారంగా ఈ సర్ప సంస్కారం చేస్తారు. సర్ప సంస్కారంలో భక్తులు రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఉత్సవాలు:
సుబ్రహ్మణ్య షష్ఠి: ఇది నాగదేవతలను మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేందుకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ రోజున బ్రహ్మ రథం మీద కుమార స్వామి ఊరేగిస్తారు. ఆ సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి రథం చుట్టూ తిరిగి వెళ్తుంది. ఏడాది లో ఆ ఒక్క రోజు మాత్రమే పక్షి కనిపిస్తుంది.
పూజ చేయడం వల్ల ప్రయోజనాలు :
ఆలయం లో పాము పుట్ట కూడా ఉంటుంది. అక్కడ నుంచి మట్టి ని తీసి, నైవేద్యం గా ఇస్తారు. అది ఇంటికి తీసుకుని వచ్చి ఎరుపు గాని, పసుపు గాని గుడ్డ లో ఉంచి, గుమ్మం పైన ఉంచితే. ఆ మట్టి యొక్క శక్తీ అష్టదిక్బంధనం లా ఇంటిని చేడు నుండి కాపాడుతుంది.
సర్పదోషం ఉన్న భక్తులు ఈ దేవాలయంలో పూజలు చేసి, ఆరోగ్యం, సంతోషం మరియు దోషాల నుండి విముక్తి పొందవచ్చని నమ్ముతారు. నాగపూజలు భక్తులకు సంతృప్తి, శాంతి మరియు సుఖాన్ని అందిస్తాయని భావిస్తారు.
ఆలయ సమయాలు :
- ఉదయం: 5:30 AM నుండి 1:30 PM వరకు
- సాయంత్రం: 3:30 PM నుండి 8:00 PM వరకు
ఎలా చేరుకోవాలి :
- విమాన మార్గం: కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం మంగళూరు విమానాశ్రయానికి 100 కిమీ దూరంలో ఉంది.
- రైల్వే: సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ 7 కిమీ దూరంలో ఉంది.
- రోడ్: బెంగళూరు నుండి 280 కిమీ దూరంలో ఉంది, ఆ మార్గం ద్వారా రావడం సులభం
చూడదగిన ప్రదేశాలు :
- కుమారధార నది – పవిత్ర స్నాన స్థలం.
- ఆదిసుబ్రహ్మణ్య ఆలయం – ప్రాచీన ఆలయం.
- వనదుర్గ దేవాలయం – దేవి దర్శనం.
- బిష్పే తీర – ప్రఖ్యాత సందర్శన స్థలం.
- దొడడామలత – ప్రకృతి రమణీయత.
- శృంగేరి మఠం – ప్రముఖ పుణ్య క్షేత్రం.
- నెరియన్య గ్రామం – గ్రామీణ సంప్రదాయం.
- మంజనద భలే – దృశ్య వనరాలు.
- సులియా పట్టణం – స్థానిక ప్రత్యేకతలు.
- సోమేశ్వర దేవాలయం – ఒక ప్రాచీన ఆలయం.
ఇవి కుక్కే సుబ్రహ్మణ్య వద్ద సందర్శించవచ్చు.