శ్రీ మహాశాస్తా చరితం - 4 *గ్రామముల యందు అయ్యప్ప*

P Madhav Kumar



*గ్రామముల యందు అయ్యప్ప*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  (ABADPS)*

తమిళనాడుకి చెందిన పలుగ్రామములలో నేటికి కూడా , ప్రజలను రక్షించే భూతనాధునిగా
అయ్యనార్ గా పిలువబడుతూ పూజింపబడుతున్నాడు శాస్తా. తమిళనాట ప్రతి గ్రామములోనూ
ప్రజలకు కాపలాదారు దైవముగా కొలువబడుదైవమే ఈ అయ్యనార్. మహాశాస్తా అనే హరిహరపుత్రుడే
అయ్యనార్‌గా కొనియాడబడుచున్నాడు. ఇందులో ఏ మాత్రమూ సందేహము లేకుండా నిరూపింప బడినది.
గ్రామాలలో మాత్రమే గ్రామదేవతగా కొలువబడుటవలన అతడు కేవలం గ్రామదేవత అనే
అంటారు కొందరు.
స్వయం సిద్ధముగానూ , స్వయంభువుగానూ ఆవిర్భవించు స్థలములు , పెద్దలచే పూజింపబడిన
స్థలములే కాక , కొత్తగా ఒక ఊరును రూపొందించు సమయమున , నిర్ణీత స్థలమున ఆలయం కట్టి
తీరాలన్నది సంప్రదాయం. ఆ విధముగా పరమేశ్వరుని ఆశీర్వాద అంశతో రూపొందిన అయ్యనార్ గ్రామ పరిపాలకునిగా , ఊరి ప్రజల కాపలాదారునిగా గ్రామ సరిహద్దులలో కాపలాభటునిగా
నియమించబడినాడు.
నిన్నటి గ్రామములే నేటి నగరాలుగా రూపొందుతున్నాయి. సంప్రదాయ పద్ధతులు
పాటింపబడకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల ఊరియొక్క సరిహద్దులు కూడా చెదరిపోవుచుండుట
వలన అయ్యనార్ విగ్రహములు కూడా తొలగింపబడి , పూజలందుకొను స్థితి కూడా కరువగుచున్నది.
ఇవన్నీ కాలానుగుణంగా , కాలక్రమేణా జరుగుతున్న మార్పులే తప్ప శాస్తా యొక్క విలువ
తగ్గిపోయినదని చెప్పుటకు వీలుకాదు. మహాకాళికాదేవి , వినాయకుడు , వేయేల , శ్రీవిద్యాస్వరూపిణి
అయిన లలితా మహాత్రిపురసుందరిగా వర్ణింపబడు కామాక్షిదేవి కూడా గ్రామపురమున పెద్ద ఎత్తున
ఆరాధింపబడుచున్నది. అటులనే శాస్తా కూడా గ్రామపాలకునిగా నియమించబడినవాడే.
పరమేశ్వరి అయిన కాత్యాయనీ దేవిని తమిళనాట *'కాత్తాయి'* అంటూ వాగ్గేవి అయిన సరస్వతిని
*'పేచ్చాయి'* వాక్కుకి అధిపతి , పరాభట్టారిక అయిన పరాశక్తిని *'పిడారి'* అంటూ జానపద రీతిలో
తమకు అనుగుణముగా పిలుచుకునే ప్రజలు , స్వామిని కూడా *'అయ్యనార్'గా* కొలుచుచున్నారు.
దీన్ని కంచి కామకోటి పీఠాధిపతి అమోదించినదే.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat